గాల్వన్ లోయలో తుపాకీ పేలలేదు. రాళ్లు, కర్రలతో పరస్పరం ఇంత మంది చనిపోయారని ప్రచారం జరిగింది. కానీ చాలా మందికి అనుమానం వచ్చింది. కొట్టుకుంటేనే అంత మంది చనిపోతారా? అంతలా గాయలవుతాయా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఐతే కానీ అక్కడ తుపాకీ పేలనప్పటికీ.. చైనా ఆర్మీ మరో మారణాయుధాన్ని వినియోగించింది. ఇనుప మేకులు బిగించిన రాడ్లతోనే భారత జవాన్లపై చైనా సైనికులు దాడి చేశారని ప్రముఖ రక్షణరంగ నిపుణుడు అజయ్ శుక్లా బయటపెట్టారు. గల్వాన్ లోయలో ఘటనా స్థలంలో ఈ ఆయుధాలు దొరికాయాని ట్వీట్ చేశారు.
The nail-studded rods — captured by Indian soldiers from the Galwan Valley encounter site — with which Chinese soldiers attacked an Indian Army patrol and killed 20 Indian soldiers.
గల్వాన్ లోయలోని ఎన్కౌంటర్ స్థలం వద్ద మేకులు బిగించిన ఈ రాడ్లను భారత జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. చైనా అనాగరిక చర్యను ఖండిస్తున్నా. ఇది సైనిక చర్య కాదు నేరపూరిత చర్య.
— అజయ్ శుక్లా
మేకుల రాడ్లతో దాడి చేయడంతో భారత జవాన్ల ఒళ్లు ఛిద్రమైంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో రక్తమోడుతూ చాలా మంది తుది శ్వాస విడిచారు. తాము చనిపోతున్నా.. పలువురు జవాన్లు చైనా సైనికులను హతమార్చారు. వారిని పట్టుకొని లోయలోకి దూకినట్లు సమాచారం. సైనికుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కాగా, లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయలో ఈ నెల 15, 16వ తేదీల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అటు చైనా ఆర్మీకి కూడా భారీగా ప్రాణ నష్టం సంభవించిందని.. సుమారు 43 మంది చైనా సైనికులు మరణించారని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే కల్నల్ స్థాయి అధికారి సహా 20 మంది సైనికులు చనిపోవడాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. చైనా సంస్థలతో ఒప్పందాలు రద్దు చేసుకొని.. చైనా ఉత్పత్తులను బహిష్కరించి.. డ్రాగన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని యోచిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.