కేంద్రం కీలక నిర్ణయం... ఇండియా, చైనా ఉద్రిక్తతలపై అఖిలపక్ష భేటీ

India China Border: ఇండియా, చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: June 17, 2020, 1:52 PM IST
కేంద్రం కీలక నిర్ణయం... ఇండియా, చైనా ఉద్రిక్తతలపై అఖిలపక్ష భేటీ
ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
ఇండియా, చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా 20 మంది సైనికులు చనిపోవడం సహా సరిహద్దుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందినప్రతినిధులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇక లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇండియా, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో... చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.అంతకుముందు త్రివిధ దళాల అధిపతులతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నత సమావేశం నిర్వహించారు. చైనా, భారత్ సరిహద్దుల్లోని పరిస్థితిపై సమీక్షించారు. భారత సైనికులను కోల్పోవడం ఎంతో కలచివేస్తోందని. ఇది ఎంతో బాధాకరమని ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో వారు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని... దేశం కోసం ప్రాణాలలొడ్డి భారత ఆర్మీ విలువలను సమున్నతంగా చాటారని కొనియాడారు.
First published: June 17, 2020, 1:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading