హోమ్ /వార్తలు /ఇండో చైనా /

చైనాకు మరో షాక్...ఇకపై ఎలక్ట్రానిక్స్ కోసం జర్మనీ, రష్యా వైపు చూడాలని IEEMA నిర్ణయం...

చైనాకు మరో షాక్...ఇకపై ఎలక్ట్రానిక్స్ కోసం జర్మనీ, రష్యా వైపు చూడాలని IEEMA నిర్ణయం...

ప్రతీకాత్మక చిత్రం  (Image;Twitter)

ప్రతీకాత్మక చిత్రం (Image;Twitter)

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదం కోసం Indian Electrical & Electronics Manufacturers Association అండగా నిలిచింది.

గాల్వన్ లోయలో చైనా చొరబాటు అనంతరం, బాయ్ కాట్ చైనా ఉద్యమం దేశంలో ఊపందుకుంది. ఇప్పుటికే చైనా వస్తువులను దాదాపు అన్ని రంగాల నుండి బహిష్కరిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం, గడిచిన కొన్ని వారాలుగా, చైనా కంపెనీలకు చెందిన ఆర్డర్‌లను భారతీయ ఎలక్ట్రానిక్ కంపెనీలు పెద్ద స్థాయిలో రద్దు చేయడం ప్రారంభించాయి (Indian companies cancelling order from china). ఇప్పుడు ఈ ఆర్డర్‌ల కోసం ఇతర దేశాల కోసం వెతకడం ప్రారంభించాయి. ఈ కంపెనీలు ప్రధానంగా విద్యుత్ పంపిణీ మరియు ట్రాన్స్ మిషన్ గేర్ కోసం ఆర్డర్లను చైనా నుంచి రద్దు చేస్తున్నాయి. అయితే ఇతర దేశాల్లో అధిక ధరలు ఉన్న కారణంగా ఇంతకాలం ఎలక్ట్రానిక్ వస్తువులను చైనా నుంచి కొనుగోలు చేసేవారమని, అయితే ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కంపెనీల స్థానంలో యూరప్, జపాన్, దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. అయితే చైనా సంస్థల కన్నా ఈ దేశాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ, బాయ్ కాట్ చైనా ప్రభావంతో చేతి చమురు వదిలినా వెనకడుగు వేయడం లేదు. కాగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ నినాదం కోసం Indian Electrical & Electronics Manufacturers Association అండగా నిలిచింది. అయితే చైనా దిగుమతులకు ప్రత్యామ్నాయం త్వరగా వెతకాలని లేకుంటే పరిశ్రమ సరఫరా ఆగిపోకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అసోసియేషన్ కోరింది.

Indian Electrical & Electronics Manufacturers Association అధ్యక్షుడు ఆర్‌కె చుగ్, మాట్లాడుతూ ఇప్పటివరకు ముడి పదార్థాలు, అసెంబ్లింగ్ సామగ్రి, అలాగే ఫినిష్డ్ గూడ్స్ కూడా చైనా నుండి లభిస్తున్నాయి. IEEMA డైరెక్టర్ జనరల్ సునీల్ మిశ్రా మాట్లాడుతూ, పరిశ్రమ ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నదని, తద్వారా చైనా నుండి వస్తువుల సరఫరాను నిలిపివేయవచ్చని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. పూర్తిగా స్వయం సమృద్ధి సాధించే వరకు, జపాన్, తైవాన్, కొరియా మరియు జర్మనీ దేశాల వస్తువుల వైపు చూస్తున్నామని తెలిపారు. కాగా సాఫ్ట్‌వేర్‌ వంటి అవసరాల కోసం యూరప్ నుండి దిగుమతి చేసుకోవచ్చని, అలాగే ముడి పదార్థాల కోసం రష్యా, చెక్ రిపబ్లిక్, పోలాండ్‌ నుంచి దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే తమ సభ్యులు ఇతర దేశాలకు వెళ్లి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ అడుగంటింది. దీంతో చిన్న పరిశ్రమలు మూతపడే స్థాయికి చేరుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆదుకోకపోతే నిరుద్యోగ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని డిమాండ్ చేశారు.

First published:

Tags: China, China Products, India-China, Indo China Tension

ఉత్తమ కథలు