లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తరువాత వారం రోజుల క్రితం మళ్లీ ఉద్రిక్తతలు మెదలయ్యాయి. చైనా ఆర్మీకి దీటుగా భారత బలగాలు జవాబిస్తున్నట్టు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలపై పట్టు నిలుపుకున్న మన దేశం చైనా ఎల్ఏసీ నుంచి ముందుకు రాకుండా నిఘాపెట్టింది. విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకుందామని భారత్ చెబుతున్నా చైనా కవ్వింపు చర్యలు మానటంలేదు. మాస్కోలో కొద్ది రోజుల క్రితం ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య సమావేశం జరిగినా సరిహద్దుల్లో పరిస్థితులు మాత్రం పూర్వ స్థితికి రావడంలేదు. ఒక్క ఇంచు భూభాగాన్నీ కోల్పోవడానికి సిద్ధంగా లేమని చైనా, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం తమ బాధ్యత అని భారత్ చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) డీఎస్ హుడా వివరించారు. ఆయన రాసిన వ్యాసం సారాంశం.
ఎల్ఏసీ వెంబడి శాంతి పునరుద్ధరణకు దౌత్యపరమైన సంప్రదింపులతో ముందుకు వెళ్లాలని భారత్ భావిస్తోంది. మిలటరీ యాక్షన్ మన విధానం కానప్పటికీ, దాన్ని పూర్తిగా పక్కన పెట్టలేం. భారత విదేశాంగ శాఖామంత్రి జైశంకర్ కూడా ఇదే మాట చెప్పారు. శాంతి చర్చలతోనే సరిహద్దుల్లో వివాదాలకు పరిష్కారాలు లభిస్తాయి. కావాలని చేసే కవ్వింపు చర్యలతో ఇరు దేశాలకూ నష్టమే. గతంలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన కొట్లాటలో ప్రాణనష్టం జరిగిన తరువాత భారత్ ఎల్ఏసీ వద్దకు భారీగా బలగాలను తరలించించి. చైనా ఆర్మీ కదలికలపై నిఘా పెంచింది. బోర్డర్ దగ్గరకు ఇరు దేశాల సైనికులు ఎదురెదుదుగా వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిందే. అలాంటి సందర్భంలో బలప్రయోగం, హింసకు దూరంగా ఉండాలి. 2014లో నార్త్ కమాండ్ కార్యాలయ సమీపంలోని ఎల్ఏసీ వద్ద భారత్, చైనా సైనికులు ఒకరికొకరు సమీపించినప్పుడు ఎలాంటి హింస జరగలేదు.
గాల్వన్ లోయ వద్ద రెండు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయిన తరువాత విధివిధానాలు, ప్రోటోకాల్‌లు సవరించింది. అవసరమైతే ఎలాంటి చర్యలైనా తీసుకునేలా స్థానిక కమాండర్లకు అధికారం ఇచ్చింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) చర్యలను నిలువరించడానికి ఇవన్నీ సమంజసమే అయినా.. ఈ చర్యలు యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.
రెండు వైపులా అపనమ్మకం ఉంది. మేలో చైనా సైనికులు చేసిన పని ఇంతవరకు దారితీసింది. అప్పటి నుంచి ఆ దేశ చర్యలను భారత్ అనుమానంతోనే చూస్తుంది. గతంలో రెండు సైన్యాల మధ్య సరిహద్దు సమావేశాలు ఎల్ఐసి వెంట శాంతిని నెలకొల్పేలా, ప్రభావవంతమైన సాధనంగా ఉండేవి. ఇప్పుడు అది లేదు. ఈ అపనమ్మకం సైనిక చర్యలకు దారితీసే అవకాశమూ లేకపోలేదు.
సరిహద్దు సమస్యలకు సంబంధించి 2015 లో పిఎల్ఎతో దాదాపు 50 సమావేశాలలో భారత్ తరఫున నేనుకూడా పాల్గొన్నాను. చిన్న చిన్న వివాదాలు పరిష్కరించుకునే వాతావరణంలో చర్చలు జరిగేవి. ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉండేవి. చర్చలతో పరిష్కారమయ్యే మార్గాలు ఎంచుకునేవాళ్లం. ఆ స్ఫూర్తి దాదాపు పూర్తిగా ఆవిరైపోయింది. చైనా వైపు నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేకపోవడమే ఇందుకు కారణం.
దౌత్యపరమైన పరిష్కారంతో పాటు, LAC వెంట సైనిక కార్యకలాపాల కోసం కొన్ని కొత్త ప్రోటోకాల్‌లను రూపొందించడంపై కూడా మన దేశం దృష్టి పెట్టాలి. పాత నియమ నిబంధనలు ప్రస్తుత పరిస్థితుల్లో పనికొచ్చేవిలా కనిపించడంలేదు. ఎల్ఐసి వెంట పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, ఈ ఉద్రిక్తతలు కొనసాగితే, ఇరు దేశాలు కొన్ని అనాలోచిత పరిణామాలను ఎదుర్కొంటాయని ఆర్మీ స్టాఫ్ చీఫ్ గుర్తించారు. ఇది భవిష్యత్తులో మరిన్ని పరిణామాలకు దారితీయొచ్చు. దీనిని నివారించాలంటే, మొదటి అడుగు ముందుకు వేసిన చైనానే మొదటి అడుగు వెనక్కి తీసుకోవాలి. ఒక చిన్న, వేగవంతమైన విజయం అనేది... నెత్తుటి సంఘర్షణ ప్రతిఫలం అని చైనా అధ్యక్షుడు జి గుర్తుంచుకోవాలి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.