గత కొన్ని రోజులుగా భారత్ చైనా సరిహద్దు టెన్షన్, తాజాగా ఈనెల 15న లద్దాక్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైన్యం చనిపోయిన తర్వాత బాయ్ కాట్ చైనా అనే నినాదం జోరందుకుంది. చైనాలో ఉత్పత్తి అయిన వస్తువులను బహిష్కరించాలని, వాటిని కొనవద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గుజరాత్లో ఓ వ్యక్తి మేడిన్ చైనా టీవీని పగలగొట్టి తన నిరసన తెలిపాడు. ఇక ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన పనిలేదు. Boycott China అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రెండింగ్ చేస్తున్నారు. చైనా యాప్స్‌ను, మేడిన్ చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుందే కానీ, వాస్తవంలో పరిస్థితి భిన్నంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. వ్యాపారవర్గాల లెక్కల ప్రకారం చైనీస్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు అయిన షావోమీ, రియల్ మీ, హయర్ వంటి ఫోన్ల సేల్స్ పెద్దగా తగ్గలేదు. తమ కంపెనీ సేల్స్ మీద ఏ మాత్రం ప్రభావం లేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. అయితే, అధికారికంగా వారు దీనిపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. కానీ, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మాత్రం 'Boycott China', 'Go China', 'Go Chinese Go' అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో నడుస్తున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.