Border Tensions: LAC వద్ద భారీగా భారత బలగాల మోహరింపు.. అధునాతన యుద్ధ అస్త్రాలను తరలించిన సైన్యం

India- China (ప్రతీకాత్మక చిత్రం)

Border Tensions: LAC వద్ద ఇరు వర్గాలు బలగాలను మోహరిస్తున్నాయి. మానవహిత విమానాలు, అత్యాధునిక హోవిట్జర్లు, ఆధునీకరించిన బోఫోర్స్‌ తుపాకులను సరిహద్దులకు భారత్‌ తరలించింది.

  • Share this:
Border Tensions : చైనాతో పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల మధ్య సరిహద్దుల్లో సైనికశక్తిని భారత్‌ మరింత పటిష్ఠం చేసింది. భారత్‌-చైనా సరిహద్దు అయిన లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ LAC వద్ద ఇరు వర్గాలు బలగాలను మోహరిస్తున్నాయి. మానవహిత విమానాలు, అత్యాధునిక హోవిట్జర్లు, ఆధునీకరించిన బోఫోర్స్‌ తుపాకులను సరిహద్దులకు భారత్‌ తరలించింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో LAC పరిధిలో నిఘా సామర్ధ్యాన్ని పెంచుకోవడంపై భారత్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. సరిహద్దు భద్రతలో భాగంగా మానవరహిత నిఘా వాహనాలతో పాటు దేశీయంగా అభివృద్ధిపరచిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మోహరిస్తోంది. అంతే కాదు ఈ ప్రాంతంలో రోడ్లు, బ్రిడ్జిలు, ఎయిర్‌బేసులు, సొరంగాల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధిపరుస్తూ ఆవాసాలకు అనుగుణంగా ఉండేలా తీర్చిదిద్దుతోంది.

శత్రువులకు చెందిన డ్రోన్లు లేదా హెలికాప్టర్టు లేదా తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను పడగొట్టేందుకు LACకి అత్యంత సమీపంలో ఆధునీకరించిన L-70 ఎయిర్‌ డిఫెన్స్ గన్స్‌ను మోహరించింది. 1960 నుంచి వాయు రక్షణలో ప్రధానంగా ఎయిర్‌ డిఫెన్స్‌ గన్స్‌కు స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడించిన వాటిని ఆధునిక ఆయుధాలుగా తీర్చిదిద్దడం జరిగిందని సైనికాధికారులు చెబుతున్నారు.

Chiranjeevi Old Titles: ’రాజా విక్రమార్క’ సహా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..

ఆధునీకరణతో లక్ష్యాన్ని మెరుగ్గా అంచనా వేయగలగడం, ఆటోమ్యాటిక్‌ టార్గెట్‌ ట్రాకింగ్‌ సామర్ధ్యంతో పాటు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వాటిని నవీకరించారు. వీటిలో ఇప్పుడు హై-రెజల్యూషన్‌ ఎలక్ట్రో ఆప్టికల్‌ సెన్సర్లు, డే లైట్‌ టెలివిజన్ కెమెరాలు, థర్మల్‌ ఇమేజింగ్‌ కెమెరాలు, లేజర్‌ రేంజ్‌ ఫైండర్స్‌, వెలాసిటీ రాడర్స్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

‘ఆహా’ ఓటీటీ కోసం బాలకృష్ణ వర్కింగ్ స్టిల్స్.. సోషల్ మీడియాలో వైరల్..

వారసత్వ ఆయుధాలను అత్యాధునిక ఎయిర్‌ డిపెన్స్ ఆయుధ వ్యవస్థగా మార్చామని ఎయిర్‌ డిఫెన్స్‌ అధికారులు తెలిపారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఆధునిక గన్‌ సిస్టమ్‌తో ఆధునీకరించిన L-70 గన్స్‌ సరితూగుతాయి. ఈ గన్స్‌కు ఫ్లైక్యాచర్‌ రాడర్‌ వ్యవస్థ కూడా ఉంది.

67th National Film Awards: కంగనా సహా ఇప్పటి వరకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న నటీమణులు వీళ్లే..

ప్యాంగంగ్‌ సరస్సు సమీపంలో గతేడాది మే 5న భారత్‌, చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో సరిహద్దు ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ సంఘటన తర్వాత రెండు దేశాలు సరిహద్దుల వెంబడి వేలాది మంది సైనికులను, భారీ ఆయుధాలను మోహరించాయి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య అనేక దఫాలు చర్చలు జరిగినా పెద్దగా ఫలితం రాలేదు.
ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ (BEL) లో దాదాపు 300 గన్స్‌ ఆధునీకరించే పని దాదాపు చివరి దశకు వచ్చింది.

Kota Srinivasa Rao - Naga Babu : చిరంజీవి, పవన్ లేకపోతే నాగబాబు నథింగ్.. మెగా బ్రదర్ పై కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు..


అలాగే 1980లో భారత సైన్యంలో చేరిన స్వీడన్‌ తయారీ బోఫొర్స్‌ గన్స్‌ LAC లోని మారుమూల ప్రాంతాల్లో మోహరించారు. ఈ గన్స్‌ను ఇప్పుడు శక్తి సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ చేశారు. వీటికి అదనంగా మూడు రెజిమెంట్ల ఆధునిక M777 ఆల్ట్రాలైట్‌ హోవిట్జర్లను కూడా LAC దగ్గర మోహరించారు. ఒక్కొక్కటి 4200 కేజీల బరువు ఉండే ఈ ఫిరంగులను పర్వత శిఖరాలపై నుంచి ఉపయోగించేలా తీర్చిదిద్దారు. ఈ సంవత్సరం చివరి నాటికి సైన్యానికి 145 హోవిట్జర్లు అందుతాయని తెలుస్తోంది.

Nayanthara : పెళ్లి కోసం ఐశ్వర్య రాయ్ బాటలో ఆ పని చేయబోతున్న నయనతార..


తూర్పు ప్రాంతంలో అత్యంత అధిక రక్షణాత్మక ప్రదేశమైన తవాంగ్‌ ప్రాంతంలో వీటిని మోహరిస్తున్నారు. మరో వైపు సముద్రమట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో LAC వెంబడి మైనస్‌ 3 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రాంతాల్లో భారీగా బలగాలను భారత సైన్యం మోహరించింది. ఈ ప్రాంతంలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్‌ 25 డిగ్రీలకు కూడా పడిపోతాయి.
Published by:Prabhakar Vaddi
First published: