Home /News /india-china /

BIG NEWS CHINA AS MODI GOVERMENT TO IMPOSE ANTI DUMPING DUTY ON IMPORT OF ANILINE OIL FROM CHINA MK

India - China: చైనాకు ప్రధాని మోదీ షాక్ ఇచ్చే చాన్స్...ఇక డ్రాగన్ కు చుక్కలే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశం ఏటా చైనా నుంచి 90 నుంచి 95 KMT అనిలిన్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. దేశంలో 98 శాతం అనిలిన్ ఆయిల్ చైనా నుంచి దిగుమతి అవుతుంది. అనిలిన్ ఆయిల్‌ ఒక మెట్రిక్ టన్నుపై 150.80 డాలర్లు యాంటీ డంపింగ్ సుంకాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది.

ఇంకా చదవండి ...
    చైనా నుంచి దిగుమతి చేసుకునే Aniline Oilపై మోడీ ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీ (Anti Dumping Duty) విధించనుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసుపై యాంటీ డంపింగ్ సుంకం విధిస్తున్నారు. Aniline Oil ఔషధ, ఫార్మా, డైయింగ్ పరిశ్రమలలో ఉపయోగిస్తారు. భారతదేశం ఏటా చైనా నుంచి 90 నుంచి 95 KMT అనిలిన్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. దేశంలో 98 శాతం అనిలిన్ ఆయిల్ చైనా నుంచి దిగుమతి అవుతుంది. అనిలిన్ ఆయిల్‌ ఒక మెట్రిక్ టన్నుపై 150.80 డాలర్లు యాంటీ డంపింగ్ సుంకాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది.

    వాస్తవానికి, చైనా మరియు ఇతర దేశాల నుండి అనిలిన్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల దేశీయ పరిశ్రమలు నష్టపోతున్నాయని Gujarat Narmada Valley Fertilizers and Chemicals- GNFC ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. జిఎన్‌ఎఫ్‌సి ఫిర్యాదు మేరకు ట్రేడ్ బాడీ డైరెక్టర్ జనరల్ ఈ దర్యాప్తును జనవరిలో ప్రారంభించారు. దాదాపు ఆరు నెలలుగా కఠినమైన దర్యాప్తు జరిపిన ఆయన దర్యాప్తు తర్వాత 51 పేజీల నివేదికను వాణిజ్య మంత్రిత్వ శాఖకు సమర్పించారు.

    చైనా సంస్థపై మెట్రిక్ టన్నుకు 56 డాలర్లు, మిగతా కంపెనీలకు మెట్రిక్ టన్నుకు 151 డాలర్లు చొప్పున విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. ఇప్పుడు ఈ మొత్తం ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద ఉంది. దీనిపై త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు భావిస్తున్నారు.

    25 వస్తువులపై యాంటీ డంపింగ్ సుంకం పెరగవచ్చు
    దేశీయ సంస్థలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చైనా నుండి దిగుమతి చేసుకున్న 25 వస్తువులపై యాంటీ డంపింగ్ సుంకాలను పెంచే వీలుంది. కాలిక్యులేటర్లు, యుఎస్‌బి డ్రైవ్‌ లు, స్టీల్, సోలార్ సెల్స్ విటమిన్ ఇ క్యాప్సుల్స్ వరకు రెండు డజనుకు పైగా చైనీస్ వస్తువులపై యాంటీ డంపింగ్ సుంకాలు ఈ సంవత్సరం ముగిశాయి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: India-China

    తదుపరి వార్తలు