Home /News /india-china /

ARMY RELEASES NAMES OF 20 SOLDIERS KILLED IN INDIA CHINA BORDER CLASH BA

India-China Clash | 20 మంది అమర జవాన్ల వివరాలు...

భారత జవాన్లకు టాలీవుడ్ బిగ్ సెల్యూట్  కల్నల్ సంతోష్, కుందన్, పళని (File/Photos)

భారత జవాన్లకు టాలీవుడ్ బిగ్ సెల్యూట్ కల్నల్ సంతోష్, కుందన్, పళని (File/Photos)

India China Latest News | చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్ల వివరాలను భారత సైన్యం ప్రకటించింది.

    చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్ల వివరాలను భారత సైన్యం ప్రకటించింది. ఈనెల 15వ తేదీన గాల్వన్ లోయలో చైనా లిబరేషన్ ఆర్మీతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయినట్టు ఆర్మీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. వారిలో బీహార్ 16వ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్, తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ప్రాణత్యాగం చేశాడు. కల్నల్ సంతోష్ బాబు మృతదేహం రావడానికి కొంత సమయం ఆలస్యం అవుతోంది. చైనా సైనికులతో ఘర్షణలో చనిపోయిన 20 మందిలో మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన దీపక్ సింగ్, ఛత్తీస్‌గఢ్‌‌లోని కాంకేట్‌కు చెందిన గనేష్ కుంజన్ కూడా ఉన్నారు. వారి మృతదేహాలను దించిన తర్వాత కల్నల్ సంతోష్ బాబు మృతదేహం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి రానుంది.

    మరోవైపు గాల్వన్ ర్యాలీలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీతో జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు లెఫ్టినెంట్ గవర్నర్లతో ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ లద్దాక్ అమర జవాన్లకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జవాన్ల బలిదానాలు ఊరికేపోవని, ఈ అంశంపై ఎవరికీ అనుమానం వద్దని స్పష్టం చేశారు. ‘అమరులైన బలిదానాలు ఊరికేపోవు. ఈ అంశంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. భారత్ శాంతి కోరుకుంటోంది. కానీ, సరైన సమయం వస్తే దీటుగా జవాబు ఇవ్వడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అమర జవాన్ల విషయంలోదేశం గర్వ పడుతుంది. వారు పోరాడుతూ ప్రాణాలు అర్పించారు.’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమర జవాన్లకు అంజలి ఘటించారు.

    20 మంది అమర జవాన్ల వివరాలు...























































































    పేరుఊరు
    కల్నల్ సంతోష్ బాబుసూర్యాపేట
    నాయబ్ సుబేదార్ నందురామ్ సోరెన్మయూర్ భంజ్
    నాయబ్ సుబేదార్ మన్‌దీప్ సింగ్పాటియాలా
    నాయబ్ సుబేదార్ (డ్రైవర్) సత్నం సింగ్గురుదాస్ పూర్
    కె. పళనిమధురై
    హవల్దాన్ సునీల్ కుమార్పాట్నా
    హవల్దాన్ బిపుల్ రాయ్మీరట్
    ఎన్‌కే (ఎన్ఏ) దీపక్ కుమార్రేవా
    సిపాయి రాజేష్ ఓరంగ్బీర్ఘుం
    సిపాయి కుందన్ కుమార్ ఓఝాసాహిబ్‌గంజ్
    సిపాయి గణేష్ రామ్కాంకేర్
    సిపాయి చంద్రకాంత ప్రధాన్కందమాల్
    సిపాయి అంకుష్హమీపూర్
    సిపాయి గుర్బీందర్సంగ్రూర్
    సిపాయి గుర్తేజ్ సింగ్మాన్సా
    సిపాయి చందన్ కుమార్భోజ్‌పూర్
    సిపాయి అమన్ కుమార్సమస్తిపూర్
    సిపాయి జై కిశోర్ సింగ్వైశాలి
    సిపాయి గణేష్ హండ్సాఈస్ట్ సింగ్‌భూమి
    సిపాయి కుందన్ కుమార్సహర్ష
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: India-China, Indian Army, Indo China Tension

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు