చైనా చెలరేగితే తిప్పికొట్టండి.. సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ !

ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె,నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్.కే.ఎష్ బదౌరియా హాజరయ్యారు.

news18-telugu
Updated: June 21, 2020, 3:49 PM IST
చైనా చెలరేగితే తిప్పికొట్టండి.. సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ !
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గాల్వన్ లోయ ఘర్షణను భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో కవిస్తున్న చైనా పట్ల మరింత దూకుడుగా వ్యవహరించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే చైనా విషయంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం. ఎల్ఏసీ వెంబడి చైనా ఆర్మీ దురాక్రమణలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ఆదేశాలు ఇచ్చారు. లద్దాఖ్ సరిహద్దులో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె,నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్.కే.ఎష్ బదౌరియా హాజరయ్యారు.

సరిహద్దులో చైనా ఎలాంటి కవ్వింపులక పాల్పడినా.. ధీటుగా జవాబు ఇవ్వాలని సైన్యానికి మంత్రి రాజ్‌నాథ్ సూచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గాల్వన్ ఘటన నేపథ్యంలో ఇకపై సరిహద్దులో భిన్నమైన వ్యూహాన్ని అవలంభించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. భూ సరిహద్దుతో పాటు గగనతలం, వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో చైనా కదలికలపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎల్ఏసీ వెంబడి మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఐతే ఇప్పటికే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఎల్ఏసీకి సమీపంలో తమ సామర్థ్యాన్ని పంచుకుంటున్నాయి. ఇటీవల గాల్వన్ నదిపై ఆర్మీ వాహనాలు వెళ్లేలా బ్రిడ్జిని కూడా నిర్మించారు.

జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో కల్నల్ సంతోష్ బాబ సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43 మంది సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐతే చైనా మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఐతే 20 మంది సైనికులు మరణించడాన్ని భారత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చైనాను ఎలా దెబ్బకొట్టాలన్న దానిపై వ్యూహాలు రచిస్తోంది. తామ శాంతికాముకులమని.. కానీ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఇప్పటికే హెచ్చరించారు. ఐనప్పటికీ చైనా మాత్రం గల్వాన్ లోయ తమదేనని పదే పదే వాగుతోంది. ఈ క్రమంలోనే చైనా దురాక్రమణలను తిప్పికొట్టేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది.
First published: June 21, 2020, 3:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading