Amit Shah on News18: చైనా దూకుడుపై అమిత్ షా ఏమన్నారంటే...

Home Minister Amit Shah Exclusive Interview: ఇక సరిహద్దుల్లో చైనా దూకుడుపై స్పందిస్తూ ఎల్‌ఏసి(Line of Actual Control)వద్ద హింసాత్మక స్వభావాన్ని ఏ సార్వభౌమ దేశం తేలికగా తీసుకోదని అన్నారు.

news18-telugu
Updated: June 1, 2020, 9:56 PM IST
Amit Shah on News18: చైనా దూకుడుపై అమిత్ షా ఏమన్నారంటే...
న్యూస్ 18తో అమిత్ షా ఇంటర్వ్యూ
  • Share this:
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2.0 మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషి దేశ హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, అలాగే అన్‌లాక్ 1.0 సవాళ్లు, కరోనాపై యుద్ధం, లాక్ డౌన్ అనంతరం వలస కార్మికుల పరిస్థితి, సహా పలు సమస్యలపై ఆయన సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా వోకల్ ఫర్ లోకల్ గురించి అడిగినప్పుడు, అమిత్ షా స్పందిస్తూ మన దేశంలో 130 కోట్ల జనాభా శక్తి ఉందని. ఇది ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు భారతదేశంలో పెట్టుబడులను ఏ మాత్రం తగ్గించే అవకాశం లేదన్నారు. అంతేకాదు ఈ పరిస్థితి వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. కేవలం భారతీయులు దేశీయ ఉత్పత్తులను ఉపయోగించాలని నిర్ణయించుకుంటే చాలు, అది భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మారుస్తుందన్నారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త బలాన్ని ఇస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక సరిహద్దుల్లో చైనా దూకుడుపై స్పందిస్తూ ఎల్‌ఏసి(Line of Actual Control)వద్ద హింసాత్మక స్వభావాన్ని ఏ సార్వభౌమ దేశం తేలికగా తీసుకోదని అన్నారు. దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నాయని, అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయంలో రాజీ పడదని, ఈ విషయంలో గట్టిగా నిలబడతామన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. చైనాపై కోపంగా ఉన్నారా అని అడిగినప్పుడు, ఆ అవసరం తమకు లేదని అన్నారు. ఇక కరోనా విస్తరణలో తబ్లిఘి జమాత్ పాత్ర మౌలానా సాద్ పరారీ గురించి ప్రశ్నించగా, ఇప్పుడు తమ ప్రాధాన్యత కరోనాకు వ్యతిరేకంగా పోరాటమే అని పేర్కొన్నారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని విడిచిపెట్టమని తెలిపారు.
First published: June 1, 2020, 9:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading