ఇండియా, చైనా ఉద్రిక్తతలపై గల్వాన్ మనవడు ఏమన్నారంటే...

లద్దాఖ్‌కు తూర్పు ప్రాంతంలో గల్వాన్ లోయ ఉంది. అక్కడ 80 కి.మీ. పొడవైన గల్వాన్ నది ప్రవహిస్తోంది. ప్రముఖ సాహసికుడు గులాం రసూల్ గల్వాన్ పేరు మీదుగా ఈ లోయ, నదికి ఆ పేరు వచ్చింది.

news18-telugu
Updated: June 18, 2020, 3:13 PM IST
ఇండియా, చైనా ఉద్రిక్తతలపై గల్వాన్ మనవడు ఏమన్నారంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లద్దాఖ్‌లోని ఇండియా, చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. ఈ ఘటన తర్వాత ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల వైరంపై గల్వాన్ మనవడు అమీన్ గల్వాన్ స్పందించారు. ఇరుదేశాలు సంయమనం పాటించి.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

గల్వాన్ వ్యాలీలో కొన్ని రోజులుగా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. 200 ఏళ్లుగా ఈ ప్రాంతంలో మాకు చెందినది. యుద్ధం పరిష్కారం కాదు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి. కూర్చొని మాట్లాడుకోవాలి.
అమీన్ గల్వాన్, గులాం రసూల్ గల్వాన్ మనవడులద్దాఖ్‌కు తూర్పు ప్రాంతంలో గల్వాన్ లోయ ఉంది. అక్కడ 80 కి.మీ. పొడవైన గల్వాన్ నది ప్రవహిస్తోంది. ప్రముఖ సాహసికుడు గులాం రసూల్ గల్వాన్ పేరు మీదుగా ఈ లోయ, నదికి ఆ పేరు వచ్చింది. లద్దాఖ్‌కు చెందిన గులాం రసూల్ గల్వాన్ అక్కడి కొండ, కోనల్లో ఎన్నో సాహస యాత్రలు చేశారు. లద్దాఖ్ అందాలను ప్రపంచానికి పరిచయం చేశారు. అంతేకాదు 19వ శతాబ్ధంలో ఎంతో మంది యూరోపియన్ టూరిస్టులు, సాహసికులు లద్దాఖ్ ప్రాంతంలో పర్యటించడంలో సాయం చేశారు.
First published: June 18, 2020, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading