చైనా కంపెనీలకు భారతదేశం నుంచి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్, హెలో సహా 59 చైనా యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసింది. ఈ నిషేధం ఇంతటితో ఆగట్లేదు. మరిన్ని చైనా యాప్స్ బ్యాన్ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. హెలో లైట్, షేర్ఇట్ లైట్, బిగో లైట్, వీఎఫ్‌వై లైట్ యాప్స్‌ని గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఇప్పటికే తొలగించారు. గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు అమరవీరులైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యాంటీ చైనా సెంటిమెంట్ భారతదేశంలో పెరిగింది. చైనా వస్తువులు, యాప్స్, స్మార్ట్ఫోన్లు నిషేధించాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా మూలాలున్న 59 యాప్స్‌ని నిషేధించింది.
Loan: చిరువ్యాపారులకు మోదీ ప్రభుత్వం లోన్... అప్లై చేయండిలా
WhatsApp: మీ ఫోన్లో వాట్సప్ ఉందా? అయితే అప్పు తీసుకోవచ్చు
ఒకేసారి 59 చైనా యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేధించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత అమెరికా కూడా ఇదే దిశలో ఆలోచనలు జరపడం చైనా కంపెనీల్లో గుబులు పెంచింది. దీంతో చైనాతో తెగదెంపులు చేసుకోవాలని టిక్‌టాక్, హెలో పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే భారతదేశం నిషేధం విధించిన తర్వాత కూడా చైనా కంపెనీలు లైట్ వర్షన్ యాప్స్ నిర్వహిస్తుండటం భారత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే వాటి లైట్ వర్షన్ యాప్స్‌ని యాప్ స్టోర్ల నుంచి తొలగించింది. అంతేకాదు... చైనా విషయంలో భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. భారతదేశంలో రహదారుల నిర్మాణానికి చైనా కాంట్రాక్టులు లేవని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, China Products, India-China, Indo China Tension, Mobile App, Playstore, Tiktok