అలా కూడా కారోనా వ్యాప్తి... సంచలన విషయాలు వెల్లడించిన నిపుణులు

ఇప్పటివరకూ కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. నిపుణులు మాత్రం... గాలి ద్వారా కూడా అది వ్యాపిస్తోందని అంటున్నారు.

news18-telugu
Updated: July 6, 2020, 11:04 AM IST
అలా కూడా  కారోనా వ్యాప్తి... సంచలన విషయాలు వెల్లడించిన నిపుణులు
ప్రతీకాత్మక చిత్రం (credit - NIAID)
  • Share this:
కరోనా వైరస్‌లు గాలిలో ఎగురుతూ... వ్యాధి వ్యాప్తికి కారణం అవుతున్నాయి అనే వాదనను... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మొదటి నుంచి ఖండిస్తోంది. వ్యక్తి ముక్కు, నోటి నుంచి వచ్చే తుంపర్లలో మాత్రమే వైరస్ ఉంటుందనీ... ఆ తుంపర్లు మాగ్జిమం 13 అడుగుల వరకూ వెళ్తాయని WHO అంటోంది. కానీ ప్రపంచంలోని 239 మంది ప్రముఖ నిపుణులు మాత్రం కరోనా వైరస్ గాలిలో కూడా ఉంటుందని అంటున్నారు. దీనిపై WHO మరింత లోతుగా పరిశోధన చెయ్యాలని కోరుతున్నారు. వాళ్లు చెబుతున్నట్లే... ప్రపంచవ్యాప్తంగా బార్లు, హోటళ్లు, షాపులు, మార్కెట్లు, ఆఫీసులు, క్యాసినోలు... ఇలా అన్ని చోట్లా కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. గాలిలో ఎగురుతూ ఉండే కరోనా వైరస్... దానికి దగ్గరగా ఉండే వారికి వ్యాపిస్తోందని నిపుణులు వాదిస్తున్నారు.

ఈ కొత్త వాదనే నిజమైతే... కరోనా వైరస్‌ని కంట్రోల్ చెయ్యడం మరింత కష్టం. ఇళ్లలో ఉండేవారు సైతం... మాస్కులు ధరించాల్సిందే. ఇళ్లలో కూడా సోషల్ డిస్టాన్స్ పాటించాల్సిందే. హెల్త్ కేర్ వర్కర్లంతా... తప్పనిసరిగా N95 మాస్కులు ధరించాల్సి ఉంటుంది. స్వల్ప లక్షణాలు ఉన్న పేషెంట్ల విషయంలోనూ అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే... స్కూళ్లు, నర్సింగ్ హోమ్‌లు, ఇళ్లు, ఆఫీసుల్లో గాలి వచ్చే కిటికీలు, తలుపులను మరింత చిన్నవిగా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే... కిటికీలు, తలుపులకు ఫిల్టర్లు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే... అల్ట్రావయలెట్ లైట్లను వేసుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం... వ్యక్తుల నుంచి వచ్చే తుంపర్లు... ఎక్కువ దూరం గాలిలో ప్రయాణించవనీ... వెంటనే అవి కింద పడిపోతాయని అంటోంది. నిపుణులేమో... ఆ డ్రాప్‌లెట్స్ అలా గాల్లో ఎగురుతూ... ఇళ్లలోకి వెళ్తున్నాయని అంటున్నారు. మొత్తం 32 దేశాలకు చెందిన 239 మంది సైంటిస్టులు... చిన్న చిన్న తుంపర్లు... ఇళ్లు, ఆఫీసుల్లోకి వెళ్లి మనుషులకు కరోనా సోకేలా చేస్తున్నాయని WHOకి లేఖరాశారు. తన పరిశోధన వివరాల్ని వచ్చే వారం ఓ సైంటిఫిక్ జర్నల్‌లో రాస్తామని చెప్పారు. WHO ఈ దిశగా పరిశోధన చెయ్యాలని కోరారు.

WHO తాజాగా చెప్పిన దాని ప్రకారం... 5 మైక్రాన్లు (అంటే... ఒక మైక్రాన్... మీటర్‌లో 10 లక్షలవ వంతు ఉంటుంది) ఉండే తుంపర్లు మాత్రమే... గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించి... గాలి ద్వారా కరోనా వైరస్ వచ్చేందుకు కారణం అవ్వగలవని చెప్పింది. కానీ అలాంటి పరిస్థితి లేదని అంటోంది.

భారత కేంద్ర ప్రభుత్వం కూడా... గాలి (అతి చిన్న తుంపర్ల) ద్వారా కరోనా వైరస్ రాదని చెప్పింది. కానీ దీనిపై కచ్చితమైన ఆధారం లేదని కూడా చెప్పింది. అందువల్ల గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందా అనేది ఇప్పటికీ డౌటుగానే ఉంది.
Published by: Krishna Kumar N
First published: July 6, 2020, 11:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading