Home /News /india-china /

1962 WAR CHINA PROVED LIAR TO TELL HE WILL NEVER ATTACK AGAINST INDIA WANT ONLY TALKS MK

India-China: 1962 యుద్ధానికి ముందు చైనా తీరు...ఇదే...అప్పుడు కూడా చర్చలు అంటూనే దొంగదెబ్బ...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

యుద్ధానికి కొన్ని నెలల ముందు, చైనా ప్రధాన మంత్రి చౌ ఎన్ లై భారతదేశానికి వచ్చారు, అప్పుడు కూడా సరిహద్దుపై వివాదం అలాగే ఉంది. కానీ ఈ వివాదం చర్చల ద్వారా పరిష్కరించబడుతుందని నమ్మబలికారు. అయితే, ఇంతలో, అరుణాచల్‌ ప్రదేశ్ లోకి చైనా సైన్యాలు ముందుకు సాగాయి.

ఇంకా చదవండి ...
  1962లో చేసిన మోసమే మరోసారి చైనా చేసింది. అప్పుడు కూడా చర్చలు అంటూనే దాడి చేసి భారత్ పై దొంగ దెబ్బ తీసింది. ఇప్పుడు కూడా చర్చలు అంటూ కాలయాపన చేసి కాలసర్పంలా కాటు వేసింది. అయితే గడిచిన రెండు-మూడు సంవత్సరాలుగా, చైనా పూర్తిగా యుద్ధ సన్నాహాల్లో ఉంది. సరిహద్దుల్లో తనను తాను బలోపేతం చేసుకోవడంలో బిజీగా ఉంది. సరిగ్గా 60 ఏళ్ల క్రితం దలైలామా భారతదేశంలో ఆశ్రయం పొందినప్పటి నుండి, ఇరు దేశాల మధ్య వివాదాలు వస్తూనే ఉన్నాయి.

  టిబెట్ తో సరిహద్దు ఒప్పందమే...చిచ్చుకు కారణం...
  భారత్, చైనా సరిహద్దు వివాదం ఈనాటిది కాదు. దేశ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొనసాగుతోంది. బ్రిటిష్ భారత్, టిబెట్ రాజ్యం మధ్య 1913లో ఒక సరిహద్దు ఒప్పందం జరిగింది. దీని ఆధారంగా మెక్‌మోహన్ లైన్ అని సరిహద్దు రేఖని ఇరువర్గాలు అంగీకరించాయి. కానీ మావో సారథ్యంలోని చైనా 1950వ దశకంలో టిబెట్ ను స్వాధీనం చేసుకుంది. అయితే పాత టిబెట్ రాజ్యంతో భారత్ చేసుకున్న మెక్ మోహన్ లైన్‌ ఒప్పందాన్ని చైనా అంగీకరించలేదు. దానికి బదులుగా భారతదేశంలో ఎక్కువ భూ భాగాన్ని దాని పటంలో చూపించింది. లడఖ్‌లోని అక్సయ్ చిన్ ప్రాంతాన్ని నెమ్మదిగా ఆక్రమించింది. అక్కడ ఒక రహదారిని చేశారు. దీనికి ప్రతిస్పందనగా, మెక్‌మోహన్ లైన్‌లో భారతీయ సైనిక పోస్టులను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని నెహ్రూ ఆదేశించారు. దీని కింద లడఖ్ ప్రాంతంలో 24 పోస్టులు, పశ్చిమ ప్రాంతంలో 64, తూర్పు ప్రాంతంలో 64 పోస్టులు ఏర్పాటు చేశారు.

  50 వ దశకంలోనే చైనా నిశ్శబ్దంగా లడఖ్‌లోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది
  అయితే 1950వ దశకం నుంచే లడఖ్‌లోని పలు ప్రాంతాలను చైనా రహస్యంగా స్వాధీనం చేసుకుంది. అక్సాయ్ చిన్ ఆక్రమణకు నిరసనగా, భారతదేశం ఈ ప్రాంతాలను దేశ పటంలో చూపించింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు రేఖ వెంబడి నెలకొన్న గందరగోళాన్ని బలహీనతగా భావించి, చైనా తమ పటాన్ని తెరపైకి తెచ్చి వివాదం పెద్దది చేసింది. అయితే ఇరుదేశాల మధ్య సమస్యను చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఇరు వర్గాలు తీర్మానించుకున్నాయి.

  బీజింగ్ ప్రభుత్వ ప్రచురణ అయిన చైనా పిక్టోరియా కొత్త పటాలను ముద్రించి, అందులో చైనాలోని ఈశాన్య లడఖ్‌ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని చైనా ప్రాంతంగా చూపించినప్పుడు ప్రధాని నెహ్రూ షాక్ అయ్యారు. అందువల్ల నెహ్రూ ఫార్వర్డ్ పాలసీని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. దీని వెనుక నెహ్రూ విధానం ఏమిటంటే, సరిహద్దుపై తమ వాదనను బలంగా వినిపంచాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి ప్రతిస్పందనగా చైనా పూర్తి సన్నాహాలతో దాడి చేస్తుందని భారతదేశానికి ఊహించలేదు. అప్పుడు కూడా, చైనా చర్చలు మాత్రమే అంటూ దాడి చేయడానికి నిరాకరించింది.

  నాటి ప్రధానమంత్రి నెహ్రూ, రక్షణ మంత్రి కృష్ణ మీనన్ చైనా వైఖరిలో మార్పు ఉన్నప్పటికీ, చైనా దాడి చేయదు అనే భ్రమలో ఉన్నారు. సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి చైనా శక్తిని ఉపయోగించదని జెనీవాలో చైనా ప్రధాని చౌ ఎన్ లై నుంచి హామీ పొందారు. అయితే 1959 లో, రష్యాకు కూడా చైనా ఇలాంటి హామీనే ఇచ్చింది. తర్వాత వారితో కయ్యానికి దిగింది.

  పంచశీలకు తూట్లు..

  చైనాతో సంధి కుదుర్చుకొనే సందర్భంలో 1954 మే 29న భారతదేశ పంచశీల సూత్రాన్ని రూపొందించటం జరిగింది.  పంచశీల సూత్రాల్లో ప్రధానంగా, రాజ్యాల ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వం పట్ల పరస్పర అవగాహన, దురాక్రమణకు పాల్పడకపోవడం, ఇతర రాజ్యాల అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాలు, శాంతియుత సహజీవనం అంతర్జాతీయ సంబంధాల్లో ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన కానుకగా పంచశీలను భావిస్తారు. కానీ ఈ పంచశీలకు తూట్లు పొడుస్తూ చైనా ముందుకు కదిలింది. టిబెట్ వివాదం ఇరు దేశాల మధ్య అగాథం పెంచింది. దలైలామా టిబెట్ దాటి భారత్ లోకి శరణార్థిగా ప్రవేశించడం. అందుకు భారత్ అంగీకరించడంతో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

  అరుణాచల్ పై డ్రాగన్ కన్ను...
  యుద్ధానికి కొన్ని నెలల ముందు, చైనా ప్రధాన మంత్రి చౌ ఎన్ లై భారతదేశానికి వచ్చారు, అప్పుడు కూడా సరిహద్దుపై వివాదం అలాగే ఉంది. కానీ ఈ వివాదం చర్చల ద్వారా పరిష్కరించబడుతుందని నమ్మబలికారు. అయితే, ఇంతలో, అరుణాచల్‌ ప్రదేశ్ లోకి చైనా సైన్యాలు ముందుకు సాగాయి. అయితే ఈ ప్రాంతంలో భారత సైన్యానికి ఆయుధాలు, లాజిస్టిక్స్ అంతగా లేవు. అరుణాచల్‌లో సైన్యం కమాండ్ నాయకత్వంపై స్పష్టత లేదు. దీంతో ఆ యుద్ధంలో భారత్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది.

  చైనాను కంట్రోల్ చేయాలని నిర్ణయం తీసుకునే లోపే...

  1962 అక్టోబర్ 11 న, ఉన్నత సైనిక అధికారులు ప్రధానమంత్రి నెహ్రూ, రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. భారత సరిహద్దు ప్రాంతంలోని ధో-లా నుండి చైనీయులను తరలించడం అసాధ్యమని, ఎందుకంటే సైన్యంలో తగినంత సైనికులు పరికరాలు లేవని తెలిపారు. ఈ సమావేశంలో, శత్రువుల తరలింపు (ఆపరేషన్ ఎవిక్షన్) వచ్చే వేసవి వరకు వాయిదా వేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేశారు. కానీ అప్పటికే చైనా భారత్ పై దాడి చేయాలని పూర్తి సన్నాహాల్లో ఉంది.

  నెహ్రూ ప్రకటన ఎనిమిదో రోజున చైనా దాడి...
  13 అక్టోబర్ 1962 న నెహ్రూ శ్రీలంక వెళ్ళవలసి ఉంది. దారిలో, ఆయన మద్రాసులో (ఇప్పుడు చెన్నై) ఆగి, మీడియాకు ఒక ప్రకటన ఇచ్చాడు. భారత సరిహద్దు నుండి చైనీయులను తరిమివేయాలని సైన్యాన్ని ఆదేశించానని. అయితే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ఎనిమిది రోజులకే చైనీయులు మెరుపు దాడి చేశారు. వాళ్లు అప్పటికే యుద్ధ సన్నాహాలలో ఎప్పటి నుంచో నిమగ్నమయ్యారు.

  చైనాకు ఇది తొలిసారి కాదు...
  పెద్ద దాడికి ముందు చైనా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. అదే సమయంలో సరిహద్దులో సంఘర్షణలకు ఆజ్యం పోస్తోంది. 1962 దాడికి ముందు, చైనా ఇలాంటి వ్యూహమే అవలంబించింది. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలని చెబుతూనే ఉన్నారు. కానీ చేయాల్సిన దాడి చేసేసింది.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: India-China, Indo China Tension

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు