ఇండియా, చైనా సరిహద్దు వివాదంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్

సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఇరుదేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్.

news18-telugu
Updated: May 27, 2020, 5:20 PM IST
ఇండియా, చైనా సరిహద్దు వివాదంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్, జింపింగ్
  • Share this:
ఇండియా,చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. లద్దాఖ్ సహా పలు ప్రాంతాల్లో ఇరుదేశాల బలగాలు పోటాపోటీగా మోహరించాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోన్న టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో చైనా, భారత్ సరిహద్దు వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఇరుదేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్.


సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ మంగలవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల ప్రధాన అధికారి (CDS) బిపిన్ రావత్‌లో కీలక చర్చలు జరిపారు. అంతేకాదు విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌తో మంతనాలు జరిపారు మోదీ. లద్దాఖ్‌తో ఇరు దేశ సైన్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలపై చర్చించారు. అంతకుముందు త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఆ భేటీ ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కాగా, మే 5న తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాకి చెందిన 250 మంది సైనికులు కొట్టుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ గొడవలో రెండువైపులా 100 సైనికులు గాయపడ్డారు. ఆ తర్వాతి రోజు రెండు వైపులా కమాండర్లు మాట్లాడుకోవడం ద్వారా మేటర్ సెటిలైంది. 4 రోజుల తర్వాత ఉత్తర సిక్కింలో నాథులా పాస్ వద్ద మరోసారి గొడవ జరిగింది. ఆ ఘటనలో రెండువైపులా 10 మంది సైనికులు గాయపడ్డారు. తాజాగా చైనా తూర్పు లఢక్ దగ్గర వాస్తవాధీన రేఖ వెంట 5000 బలగాల్ని వేర్వేరు లొకేషన్లలో మోహరించింది. పాంగ్యాంగ్ సరస్సు, గల్వాన్ లోయ సమీపంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. ఇది గమనించిన ఇండియా కూడా భారీగా మోహరించింది. ఇలా పోటా పోటీగా సైన్యాలను మోహరించడంతో సరిహద్దులలో అసలేం జరుగుతోందనని అంతటా ఉత్కంఠ నెలకొంది.