భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న చైనా.. మణిపూర్ ఉగ్రదాడి వెనక..

ఉగ్రదాడికి తమదే బాధ్యత అంటూ మణిపూర్‌ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (MNPF), పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA), ఉల్ఫా-ఇండిపెండెంట్‌ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఐతే ఈ మూడు ఉగ్రవాద సంస్ధలకూ చైనాతో సన్నిహిత సంబంధాలున్నాయి.

news18-telugu
Updated: July 31, 2020, 6:58 AM IST
భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న చైనా.. మణిపూర్ ఉగ్రదాడి వెనక..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సరిహద్దుల్లో చెలరేగిపోతున్న చైనా భారత్‌పై కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్ తరహాలోనే భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్‌పైకి ఉసిగొల్పుతోంది. దానికి మణిపూర్‌లో జరిగిన ఉగ్రదాడే ఉదాహరణ. బుధవారం సాయంత్రం మణిపుర్‌లో అసోం రైఫిల్స్ బలగాలపై తీవ్ర వాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మయన్మార్ సరిహద్దులో ఉన్న చండేల్ జిల్లా సాదిక్తంపాక్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని తీవ్రవాదులు జరిపిన దాడిలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పెట్రోలింగ్ విధుల అనంతరం తిరిగి క్యాంప్‌కు వెళ్తున్న అసోం రైఫిల్స్ జవాన్లే టార్గెట్‌గా ఉగ్రవాదులు మొదట బాంబు పేల్చారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనకు తమదే బాధ్యత అంటూ మణిపూర్‌ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (MNPF), పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA), ఉల్ఫా-ఇండిపెండెంట్‌ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఐతే ఈ మూడు ఉగ్రవాద సంస్ధలకూ చైనాతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈశాన్య భారతంలోని తీవ్రవాద సంస్థలన్నీ కలిపి యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియాగా ఏర్పాటయ్యాయి. ఈ మిలిటెంట్ గ్రూప్‌లకు సాయం చేస్తూ భారత్‌పై కుట్రలు చేస్తోంది చైనా. ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేస్తూ ఇండియన్ ఆర్మీపైకి ఉసిగొల్పుతోంది.

కాగా, ఇప్పటికే లద్దాఖ్ సరిహద్దులో చైనా కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. జూన్‌లో గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్లు ఘర్షణ పడ్డారు. ఆ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగిందని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. కానీ దానిపై చైనా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. ఆ తర్వాత ఇరుదేశాల సైనికాధికారుల మధ్య దశలవారీగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల సైన్యాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఐతే చైనా మాత్రం వెనక్కి వెళ్తున్నట్లు ప్రకటించినా పలు ప్రాంతాల్లో ఇంకా చైనా సైనికులు ఉన్నారని ఆర్మీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. ఇక అరుణాచల్‌పై ఎప్పటి నుంచో కన్నేసిన చైనా.. ఈశాన్య భారత్‌లో నేరుగా ఎదర్కోలేక ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: July 31, 2020, 6:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading