ఎల్లుండి చైనా సరిహద్దులో రక్షణమంత్రి రాజ్‌నాథ్, ఆర్మీ చీఫ్ పర్యటన

మే నుంచి ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి నేపథ్యంలో.. రక్షణ మంత్రి లద్దాఖ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అటు ఆర్మీ చీఫ్ నరవాణే వారం వ్యవధిలో రెండో సారి లద్దాఖ్‌లో పర్యటించనున్నారు.

news18-telugu
Updated: July 1, 2020, 6:10 PM IST
ఎల్లుండి చైనా సరిహద్దులో రక్షణమంత్రి రాజ్‌నాథ్, ఆర్మీ చీఫ్ పర్యటన
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  • Share this:
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఇండియా, చైనా సరిహద్దుల్లో పర్యటించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణెతో కలిసి లద్దాఖ్‌కు వెళ్లనున్నారు. చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. ఇప్పటికే ఆర్మీ వర్గాలు ఆ ఏర్పాట్లలో ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే రక్షణ మంత్రి పర్యటన ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మే నుంచి ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి నేపథ్యంలో.. రక్షణ మంత్రి లద్దాఖ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. అటు ఆర్మీ చీఫ్ నరవాణే వారం వ్యవధిలో రెండో సారి లద్దాఖ్‌లో పర్యటించనున్నారు.


మరోవైపు ఇండియా, చైనా సైన్యం మధ్య మూడో దఫా చర్చలు జరిగాయి. మంగళవారం సుమారు 12 గంటల పాటు చర్చించారు. ఈ చర్చల్లో భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా ఆర్మీ తరపున సౌత్ జింజియాంగ్ మిలటరీ రీజియన్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ పాల్గొన్నారు. గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్ ఏరియా మధ్య ఉన్న పెట్రోలింగ్ పాయింట్స్ 14, 15, 17 నుంచి ఇరుదేశాల సైన్యాలు వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి దశల వారీగా సైన్యాలను తగ్గించుకోవాలని పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

కాగా, జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ సహా 21 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అటు 43 మంది చైనీయులు కూడా చనిపోయారని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. కానీ చైనా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఆ ఘటన తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే రెండు రోజుల పాటు లద్దాఖ్‌లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు.


First published: July 1, 2020, 6:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading