CHINESE ARMY HANDOVER ABDUCTED 5 BOYS FROM ARUNACHAL PRADESH SU
India-China: ఐదుగురు భారత పౌరులను అప్పగించిన చైనా
చైనా అప్పగించిన ఐదుగురు భారతీయ యువకులు
సెప్టెంబర్ 2న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఐదుగురు వ్యక్తులు వేటకు వెళ్లి దారితప్పడంతో వాస్తవాధీన రేఖ దాటి చైనా సరిహద్దుల్లోకి వెళ్లారు. వీరు కనిపించకపోవడంతో..
భారత్ -చైనాల సరిహద్దుల్లో ఉద్రికత్త కొనసాగుతున్న వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తాము అపహరించిన ఐదుగురు భారత పౌరులను చైనా భద్రతాదళం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. కనిపించకుండా పోయిన ఐదుగురు భారత పౌరులను చైనా బలగాలు భారత్కు అప్పగించినట్టు తేజ్పూర్ డిఫెన్స్ పీఆర్వో ఒక ప్రకటనలో వెల్లడించారు. అప్పగింత ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు.. కిబితు పోస్ట్ గుండా శనివారం భారత్ భూభాగంలోకి ప్రవేశించారని తెలిపారు. అయితే కోవిడ్ నిబంధనలను ప్రకారం వారిని 14 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉంచి అనంతరం కుటుంబ సభ్యలకు అప్పగించనున్నట్టు చెప్పారు.
All the 5 Indian youths from Arunachal Pradesh who were received at Kibithu by our Army from PLA are fit and fine. However, they will be quarantined for a specified period.
I also thank Raksha Mantri @rajnathsingh ji for the concern he had shown. https://t.co/Wpg3pCkObzpic.twitter.com/1IpApYkxZz
సెప్టెంబర్ 2న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఐదుగురు వ్యక్తులు వేటకు వెళ్లి దారితప్పడంతో వాస్తవాధీన రేఖ దాటి చైనా సరిహద్దుల్లోకి వెళ్లారు. వీరు కనిపించకపోవడంతో.. బంధువులు భారత సైన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చాయి. ఇందుకు సంబంధించి భారత బలగాలు.. చైనా ఆర్మీని సంప్రదించగా తమకేం సంబంధం లేదని బుకాయించింది. అయితే మంగళవారం వారు తమ ఆధీనంలోనే ఉన్నట్టు చైనా ఆర్మీ వెల్లడించింది. ఈ క్రమంలోనే నేడు వారిని విడుదల చేసింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.