Hyderabad: ఒంటిపై బట్టలు లేకుండా రక్తపు మడుగులో మహిళ.. పారిపోతున్న నిందితుడి పట్టుకున్న స్థానికులు..ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

Narsingi: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వారి సంసారాన్ని ఆగం చేసింది. ఏకంగా కట్టుకున్న భర్తే తన భార్యను అతికిరాతకంగా చంపాడు. ఆ శవాన్ని ఇంట్లో పడేసి భయటకు వెళ్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అసలేం జరిగిందంటే..

  • Share this:
    భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వారి సంసారాన్ని ఆగం చేసింది. ఏకంగా కట్టుకున్న భర్తే తన భార్యను అతికిరాతకంగా చంపాడు. ఆ శవాన్ని ఇంట్లో పడేసి భయటకు వెళ్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అసలేం జరిగిందంటే..కట్టుకున్న భర్తే అతికిరాతకంగా భార్యను హత్య చేశాడు. చిన్నపాటి మనస్పర్థలతో భార్యను తిరిగిరాని లోకాలకు పంపాడు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. భార్యను చంపడమే కాకుండా ఒంటిపై బట్టలు లేకుండా రక్తపు మడుగులో పడేసి ఇంటికి తాళం వేసి వెళ్లాడు. నార్సింగి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని హైదర్‌షాకోట్‌లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఎప్పటి నుంచో మనస్పర్థలు ఉన్నాయి. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవారన్నారు.అయితే గురువారం మాత్రం ఇంత దారుణం చోటు చేసుకుంటుందని ఇరుగుపొరుగు వారు అనుకోలేదు. భర్త బసప్ప భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే శవాన్ని పెట్టి  తాళం వేసి పారిపోయే ప్రయత్నం చేశాడు.

    ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ విలేజ్‌లో చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు బసప్పను పట్టుకొని ఇంటి వద్దకు బయలు దేరి వెళ్లారు. అక్కడ తాళం వేసిన గదిని తెరిపించారు. అందులోకి వెళ్లి చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. గది మొత్తం రక్తంతో నిండిపోయింది. హత్యకు గురైన బసప్ప భార్యపై ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా కనిపించింది.

    husband kills wife
    ప్రతీకాత్మక చిత్రం


    అతికిరాతకంగా హత్య చేసిన బసప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యను ఇంట్లో పడేసి ఎలాంటి శబ్ధం రాకుండా కొట్టి చంపినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బసప్పను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
    Published by:Veera Babu
    First published: