Home /News /explained /

YOUTUBE RECOMMENDATIONS EXPLAINED GH VB

Explained: యూట్యూబ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఎలా వస్తాయి.. దాని కోసం ఏం చేయాలి.. పూర్తి వివరాలివే..

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ప్రస్తుతం యూట్యూబ్ యూజర్లు రెండు రకాలుగా రికమండేషన్స్ అందుకుంటున్నారు. యూట్యూబ్ వీడియో క్లిక్ చేసిన తరువాత.. కుడివైపు వచ్చే మిక్స్ ద్వారా, అప్ నెస్ట్ ఆప్షన్ ద్వారా రికమండేషన్స్ ఇస్తున్నారు.

వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. యూట్యూబ్‌లో ప్రతి రోజూ లక్షలాది వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. కోట్లాది మంది ఇలా ఇప్పటికే బిలయన్ల కొద్దీ వీడియోలను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. ఒక వీడియో చూసి యూట్యూబ్ నుంచి బయటకు రావడం సాధ్యం కాని పని. ఎందుకంటే మనం ఎలాంటి వీడియోల కోసం వెతుకుతున్నామో.. అలాంటి వీడియో ఒకటి క్లిక్ చేయగానే దానికి సంబంధించిన బోలెడు వీడియోలు ప్రత్యక్షం అవుతాయి. ఇలా అప్ లోడ్ చేస్తున్న కోట్లాది వీడియోల నుంచి మనకు కావాల్సిన వాటిని యూట్యూబ్ ఎలా రికమండ్ చేస్తుందో తెలుసుకుందాం.

Global Hunger Index: ఏం తమాషాలు చేస్తున్నారా.. ఇండెక్స్‌లో ఎందుకు ఈ అవకతవకలంటూ..


సబ్‌స్క్రిప్షన్లు, సెర్చ్ కన్నా రికమండేషన్ల ద్వారానే వీడియోలకు లక్షలాది వ్యూస్ వస్తుంటాయని చెబుతున్నారు యూట్యూబ్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోస్ గుడ్రో. వీక్షకులు వారు కోరుకున్న హై క్వాలిటీ కంటెంట్ అందించడమే తమ లక్ష్యమని, దీంతో పాటు వారిని అనవసరమైన సమస్యాత్మక కంటెంట్‌కు సాధ్యమైనంత దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వీక్షకులు గౌరవ ప్రదంగా, వారు ఏమి కోరుకుంటున్నారో అలాంటి వీడియోలు అందుబాటులోకి వచ్చే విధంగా తమ విధానం ఉంటుందని వివరించారు.

పెళ్లయిన వెంటనే ఆట ఆడారు.. దానిలో వరుడికి తగలకూడని చోట దెబ్బతగిలింది.. గిలగిల కొట్టుకుంటూ.. వీడియో వైరల్..


ప్రస్తుతం యూట్యూబ్ యూజర్లు రెండు రకాలుగా రికమండేషన్స్ అందుకుంటున్నారు. యూట్యూబ్ వీడియో క్లిక్ చేసిన తరువాత.. కుడివైపు వచ్చే మిక్స్ ద్వారా, అప్ నెస్ట్ ఆప్షన్ ద్వారా రికమండేషన్స్ ఇస్తున్నారు. 2008 నుంచి య్యూట్యూబ్ రికమండేషన్ వ్యవస్థలో వచ్చిన మార్పులు మనం పరిశీలించినట్లయితే...

యూట్యూబ్ రికమండేషన్స్ ఇలా ...

2008లో పాపులారిటీ ఆధారంగా రికమండేషన్స్ ప్రారంభించారు

2011లో వివక్ష, హింసాత్మక వీడియోలను గుర్తించి వాటిని రికమండేషన్స్ కు దూరంగా ఉంచారు

2012లో ఇన్ కార్పొరేటెడ్ రికమండేషన్స్‌ను పర్సనలైజేషన్ చేయడం ద్వారా స్వల్ప కాలంలో వాచ్ టైమ్ వేగంగా పడిపోయినా, దీర్ఘ కాలంలో రికమండేషన్స్ క్వాలిటీ మెరుగుపరచడానికి ఉపయోగపడేలా చేశారు.

2015లో హోమ్ పేజ్ నుంచి సెన్సేషనల్ కంటెంట్‌ను తగ్గించారు

2016లో వాచ్ టైమ్ పరిగణనలోకి తీసుకుని వీక్షకులకు మెరుగైన వీడియోలు అందిస్తున్నారు. సమస్యాత్మక వీడియోలను తొలగించడం ద్వారా రికమండేషన్స్ మెరుగుపరిచారు.

Photo Viral: ఆ బామ్మ చేసే పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇంతకు ఆమె ఏం చేస్తుందో తెలుసా..


2017 నుంచి వార్తలు, సమాచారం సరైనదా కాదా పరిశీలించడం ప్రారంభించారు. మెషీన్ లెర్నింగ్ విధానం ద్వారా వీక్షకులకు కచ్చితమైన సమాచారం అందిస్తున్నారు.

2019లో బోర్డర్ లైన్ కంటెంట్‌ను తగ్గించడం ద్వారా నాన్ సబ్‌స్క్రైబ్ వీక్షకుల వాచ్ టైమ్‌ను 70 శాతం తగ్గించారు.

రికమండేషన్స్ ను యూట్యూట్ ఆల్గారిథమ్ ఎలా నిర్ణయిస్తుంది?
వీక్షకులు ప్రస్తుతం ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అనే దాని ఆధారంగానే ఈ అల్గారిథమ్ పనిచేస్తుంది. ఇతర సోషల్ నెట్ వర్క్ ప్లాట్‌ఫాంలు సూచించే వీడియోలను యూట్యూట్ రికమండ్ చేయదు. మిక్స్ నుంచి వీడియో చూసే వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ద్వారా, సర్వేలు నిర్వహించడం ద్వారా, వీడియోలపై క్లిక్కులు, వాచ్ టైమ్, వీడియో షేర్స్ చేసిన విధానాన్ని బట్టి రికమండేషన్స్‌ను యూట్యూట్ అంచనా వేస్తుంది.

Samantha Stylist: ప్రీతమ్ జుకల్కర్ ఒక గే.. అతడితో సమంత అలా చేస్తుందా.. నిజాన్ని బయటపెట్టిన..


రికమండేషన్స్ స్విచాఫ్ చేయవచ్చా?
రికమండేషన్స్ స్విచాఫ్ చేయవచ్చు. వీక్షకులు వీడియోలు చూసిన తరువాత వారు హిస్టరీ డిలీట్ చేస్తే, వారికి రికమండేషన్స్ కూడా స్విచాఫ్ అవుతాయి.

బోర్డర్ లైన్ కంటెంట్‌ను యూట్యూబ్ ఎలా దూరంగా ఉంచుతుంది?
2011లో రికమండేషన్స్ ద్వారా ఎక్కువగా వీక్షించిన తక్కువ క్వాలిటీ కలిగిన కంటెంట్‌ను అదుపు చేసింది. 2015లో మైనర్లను సమస్యల్లో పడవేస్తాయని భావించిన వీడియోలను రికమండేషన్స్ నుంచి తొలగించారు. ఇటీవలి కాలంలో సమస్యాత్మక తప్పుడు సమాచారాన్ని, బోర్డర్ లైన్ కంటెంట్ ను గుర్తించి వాటిని నిరోధిస్తున్నారు. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని పర్వవేక్షకులను సంస్థ నియమించుకుంది.

ఆంటీని హగ్ చేసుకోవాలి.. పర్మిషన్ ఇవ్వండి.. అంటూ ఆ పసిపాప ఏం చేసిందో చూడండి.. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా..


వీడియోలను రికమండ్ చేయడంలో భాష ఎలా ప్రభావితం చేస్తుంది?
భాష ఆధారంగా రికమండేషన్స్ ఉండవు. వీక్షకులు చూసే వీడియోల ఆధారంగా అనేక వీడియోలను రికమండ్ చేస్తామని క్రిస్టోస్ గుడ్రో తెలిపారు. అంటే ఒక వ్యక్తి ఏ భాషలో ఎక్కువగా వీడియోలు వీక్షిస్తే ఆ తరువాత కోడ్ ఆధారంగా అవే వస్తాయని గుడ్రో వెల్లడించారు.

వీక్షకులు ఇన్ కాగ్నిటో మోడ్‌లో ఉంటే రికమండేషన్స్ ఎలా వస్తాయి?
ఇన్ కాగ్నిటో మోడ్‌లో డివైజ్ ఉంటే ఆ ప్రాంతంలో ఏ కంటెంట్ బాగా వీక్షిస్తున్నారో వాటిని యూట్యూబ్ రికమండ్ చేస్తుంది.

యూట్యూబ్ సెర్ఛ్ ఎలా పనిచేస్తుంది
గూగుల్ సెర్చ్, క్రోమ్ మాదిరిగానే యూట్యూబ్ సెర్చ్ పనిచేస్తుంది. అయితే ఆథరైడ్జ్ వీడియోలకు మాత్రం ఈ జాబితాలో ప్రాధాన్యం ఉంటుంది. ఎవరైనా యూట్యూబ్ లో కంటెంట్ కోసం సెర్చ్ చేసినప్పుడు నమ్మకమైన అథారిటీ ఉన్న వర్గాల వీడియోలను మొదటి వరుసలో వచ్చేలా చేస్తారు. అంతగా నమ్మకం లేని, అన్ ఆథరైజ్డ్ వీడియోలు తరువాత వరుసలో వస్తాయి.
Published by:Veera Babu
First published:

Tags: Explained, Youtube

తదుపరి వార్తలు