• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • YOU CAN WITHDRAW MONEY FROM ATMS WITHOUT A DEBIT CARD DO YOU KNOW HOW MK GH

Cardless cash withdrawal: డెబిట్ కార్డు లేకుండానే ATMల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు..ఎలాగో తెలుసా..

Cardless cash withdrawal: డెబిట్ కార్డు లేకుండానే ATMల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు..ఎలాగో తెలుసా..

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రముఖ బ్యాంకులన్నీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యాప్‌ల ద్వారా సేవలను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంకులు కార్డ్‌లెస్ విత్‌డ్రాలకు కూడా అవకాశం కల్పించాయి.

  • Share this:
Cardless cash withdrawal:  అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వ్యవస్థలు పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. మన దేశంలోని ప్రముఖ బ్యాంకులు టెక్నాలజీ సాయంతో కస్టమర్లకు అందిస్తున్న సేవలను సులభతరంగా మార్చాయి. ప్రముఖ బ్యాంకులన్నీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యాప్‌ల ద్వారా సేవలను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ వంటి ప్రముఖ బ్యాంకులు కార్డ్‌లెస్ విత్‌డ్రాలకు కూడా అవకాశం కల్పించాయి. అంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించకుండా కస్టమర్లు ATMల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విధానంలో రోజువారీ ట్రాన్సాక్షన్ల లిమిట్ రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఉంది. సంబంధిత బ్యాంకు మొబైల్ యాప్ ద్వారా కార్డ్ లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం.

SBI
ఖాతాదారులు ముందు SBI ఏటీఎంకు వెళ్లాలి. కార్డు లేకుండా డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి యోనో యాప్‌కు లాగిన్ అవ్వాలి. యాప్‌లో కనిపించే యోనో క్యాష్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఏటీఎంలో మొదటి పేజీలో కనిపించే కార్డ్‌లెస్ విత్‌డ్రాను ఎంచుకోవాలి. ఏటీఎం నుంచి ఎంత డబ్బు విత్‌డ్రా చేయాలో ఎంటర్ చేయాలి. అనంతరం ఖాతాదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబరు వస్తుంది. ఈ నెంబరుతో పాటు కార్డు పిన్ నంబర్లను ఎంటర్ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ICICI
కస్టమర్లు ముందు iMobile యాప్‌లో లాగిన్ కావాలి. సర్వీసెస్ విభాగంలో కనిపించే ‘క్యాష్‌లెస్‌ విత్‌డ్రా ఎట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎటిఎమ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి. అనంతరం అకౌంట్ నంబరు ఎంచుకొని 4 అంకెల టెంపరరీ పిన్ నంబర్‌ను క్రియేట్ చేయాలి. ఆ తరువాత రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఇప్పుడు ఖాతాదారులు ఐసిఐసిఐ బ్యాంక్ ఏటిఎమ్‌కు వెళ్లి, కార్డ్‌లెస్ క్యాష్ విత్ డ్రా ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత పేజీలో మొబైల్ నంబరును, రిఫరెన్స్ OTPని ఎంటర్ చేయాలి. దీంతోపాటు అంతకు ముందు క్రియేట్ చేసిన టెంపరరీ పిన్ నంబర్‌ను ఎంటర్ చేసి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

 బ్యాంక్ ఆఫ్ బరోడా
ఖాతాదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా M-connect మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ అయ్యి, ఆప్షన్లలో కనిపించే ప్రీమియం సర్వీసెస్ ట్యాబ్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత స్క్రీన్‌పై కనిపించే పేజీలో క్యాష్ ఆన్ మొబైల్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ అకౌంట్ నంబర్‌ను, విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ఈ రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు OTP వస్తుంది. ఇప్పుడు కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంకు వెళ్లి.. క్యాష్ ఆన్ మొబైల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత పేజీలో OTPని, విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేసి డబ్బు తీసుకోవచ్చు.

కొటక్ మహీంద్రా బ్యాంక్
ఖాతాదారులు ముందు కొటక్ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ అవ్వాలి. కార్డు లేకుండా డబ్బు తీసుకునేందుకు లబ్ధిదారుని పేరు, మొబైల్ నంబరు, అడ్రస్‌ను నమోదు చేయాలి. ఆ తరువాత కొటక్ మహీంద్రా ఏటీఎంకు వెళ్లి.. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా లేదా ఇన్‌స్టాంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ముందుగా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్ నెంబరు, ఫోన్ నంబర్, ఎస్‌ఎంఎస్ కోడ్‌లను, విత్‌డ్రా చేయాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి డబ్బు తీసుకోవచ్చు.
First published:

అగ్ర కథనాలు