గతేడాదిలో టెక్ వరల్డ్(Tech World) ఎలా మారబోతోందనే విషయంలో అందరూ సులభంగా అంచనాలు వేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత ఇంటి నుంచి పని చేసే సౌలభ్యం కల్పించేలా టెక్నాలజీ మెరుగుపడుతుందని అందరూ భావించారు. ఆ విధంగానే ఇంటి నుంచే దాదాపు అన్ని పనులు పూర్తి చేసేలా టెక్నాలజీ(Technology)లో ప్రగతి కనిపించింది. 2021లో విద్యార్థులు, వైద్యులు(Doctors), ఇంజనీర్లు(Engineers), తదితర వర్కర్లందరూ వీడియో కాన్ఫరెన్సింగ్(Video Conference) సాఫ్ట్వేర్లను బాగా వినియోగించారు. ఈ క్రమంలో వీడియోకాన్ఫరెన్సింగ్ టెక్నాలజీ మరింత మెరుగుపడిందనే చెప్పాలి. ఐతే ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ భారతదేశంలో మాత్రం అందుబాటులోకి రాలేదు. కానీ ఈ ఏడాది కొన్ని నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ ఏడాదిలో టెక్నాలజీలో అబ్బురపరిచే మార్పులు వచ్చే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి 2022లో సాంకేతిక ప్రపంచం ఎలా మారబోతోందో ఇప్పుడు చూద్దాం.
1. బిల్డింగ్ ద మెటావర్స్
ఇటీవల కాలంలో సాంకేతిక ప్రపంచంలో కొత్తగా వినిపిస్తున్న పేరు మెటావర్స్. వాస్తవానికి మనలో చాలా మంది ఇప్పటికే ఏదో ఒక విధంగా మెటావర్స్‌లో ఉన్నారు. ముఖ్యంగా Minecraft వంటి గేమ్‌లు ఆడే ప్లేయర్లు వారి స్వంత ప్రపంచాలను నిర్మించుకుంటూ దాదాపు మెటావర్స్ లాంటి వర్చువల్ ప్రపంచంలో గడిపేస్తున్నారు. పాండెమిక్ సమయంలో కూడా వారు గేమ్‌ల ద్వారానే ఆన్లైన్ ప్రపంచంలో కమ్యూనికేట్ చేసుకున్నారు. గేమ్స్‌తో తమకంటూ ఒక కొత్త ఆన్లైన్ రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు.
అయితే ఇదే తరహాలో కొత్త ఏడాదిలో చాలా టెక్ దిగ్గజాలు మెటావర్స్‌తో కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి తొలి అడుగులు వేసే ప్రయత్నాలను మనం చూడొచ్చు. కానీ మెటావర్స్ అభివృద్ధికి ఇటీవలే బీజం పడింది కాబట్టి ప్రస్తుతం కంపెనీలకు దీన్ని నిర్మించడం అంత తేలికైన పని కాకపోవచ్చు. కాబట్టి వర్చువల్ ప్రపంచాన్ని వచ్చే ఏడాదిలో ఆస్వాదించడం అసాధ్యం. అయితే మెటావర్స్కు కనెక్ట్ చేయగల VR/AR హెడ్సెట్లను లాంటి కొన్ని టూల్స్‌కు మరింత యాక్సెసిబిలిటీ లభించే అవకాశం ఉంటుంది.
2. స్మార్ట్ఫోన్లు.. అంతకు మించి
ప్రతి ఏటా స్మార్ట్ఫోన్లలో ఎన్నో సరికొత్త టెక్నాలజీలు పరిచయం అవుతున్నాయి. దీన్నిబట్టి స్మార్ట్ఫోన్లు అనేవి డిస్రప్టివ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే 2022లో బిగ్గెస్ట్ స్మార్ట్‌ఫోన్ డిస్రప్టర్ను చూసినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసే, ఇతరులతో కమ్యూనికేట్ చేసే, పని చేసే విధానం పూర్తిగా మారిపోయినా మారిపోవచ్చు. బహుశా ఈ ఏడాది తాకగలిగే స్క్రీన్ లేకుండానే స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వినియోగించే కొత్త టెక్నాలజీ కూడా రావచ్చు.
3. 5జీ ఈ ఏడాదిలోనైనా వస్తుందా
హై-స్పీడ్, తక్కువ-లేటెన్సీ, జీరో-డౌన్‌టైమ్ 5G నెట్‌వర్క్‌లకు యాక్సెస్ లభిస్తేనే మెటావర్స్ టెక్నాలజీ తీసుకురావడం సాధ్యమవుతుంది. ఐతే భారతదేశంలో కూడా ఎట్టకేలకు కొన్ని నగరాల్లో 5జీ రోల్అవుట్ కోసం టైమ్‌లైన్‌ను కేంద్రం ప్రకటించింది. మెటావర్స్ టెక్నాలజీ నిజం అయ్యేలోపు 5జీ అనేది అన్ని దేశాల్లో అందుబాటులోకి రావచ్చు. 5జీ అందుబాటులోకి వస్తే మెడిసిన్, ఆటోమొబైల్స్ ఇలా అన్ని రంగాల్లో భారీ మార్పులు వస్తాయి.
4. హైబ్రిడ్ వర్క్‌ఫోర్స్
హైబ్రిడ్ వర్క్‌ఫోర్స్ టెక్నాలజీ అనేది ఇల్లు, ఆఫీస్ మధ్య వర్కర్లు సులభంగా స్విచ్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఇంట్లో ఉన్నా ఆఫీస్‌కు వెళ్లినా లేదా మరే ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లినా సహోద్యోగులతో క్షణాల్లోనే కమ్యూనికేట్ చేయగల హైబ్రిడ్ వర్క్‌ఫోర్స్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. ఇది 5జీ సేవలతో 2022లో పూర్తిస్థాయిలో వృద్ధి చెంది అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగులకు తాము చేసే పని మరింత సులభతరం అవుతుంది. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనులు చేసుకోవడం సాధ్యమవుతుంది.
5. కన్స్యూమర్లు లాభపడవచ్చు
ఒకప్పుడు ప్రీమియంగా ఉన్న ఫీచర్లు ఇప్పుడు సాధారణ యూజర్లకు అందుబాటు ధరలలోనే లభిస్తున్నాయి. 2021లో నాయిస్ క్యాన్సిలేషన్, హై-రిఫ్రెష్ రేట్ స్క్రీన్లు, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి సాంకేతికతలు మరింత సరసమైన ధరలకు దిగొచ్చాయి. కొత్త సంవత్సరంలో ఫోల్డబుల్ డివైజెస్ తక్కువ ధరకే లభించవచ్చు. అదేవిధంగా, అడాప్టివ్ రిఫ్రెష్ రేట్లు, వైర్లెస్ ఛార్జింగ్, 5జీ వంటి ఫీచర్స్ మిడిల్-రేంజ్ ఫోన్స్ లో అందుబాటులోకి రావడం చూడొచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.