ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అవుతోంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్ పర్సన్ లు ఉండేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏపీ రాజకీయల్లో కొత్త ఫార్ములాకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖలో మేయర్ గా మహిళకు అవకాశంఇచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మున్సిపాలిటీల్లో మహిళలకే పట్టం కట్టారు. ఇలా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అవుతోంది. అందుకే ఆయనకు రోజు రోజుకూ ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అందుకు ఇటీవల వచ్చిన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం..
తాజాగా ఓ కూరగాయల వ్యాపారిని అందలం ఎక్కించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఎవరిపైనైనా నమ్మకం కలిగితే ఆ వ్యక్తి హోదా, స్థాయి పట్టించుకోకుండా జగన్ ఉన్నత పదవుల్లో కూర్చోపెడతారని వైసీపీ శ్రేణులు చెబుతూ ఉంటాయి. మరోసారి అది రుజువు అయ్యింది. తాజాగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయచోటి చైర్మన్‌గా కూరగాయలు అమ్మేవ్యక్తిని ఎన్నుకుని.. అందరికీ ఆదర్శంగా నిలిచింది. షేక్ బాష అనే వ్యక్తి డిగ్రీవరకు చదువుకున్నారు. అయితే ఆయన చదువకున్న చదువుకు మంచి ఉద్యోగం రాలేదు. చిన్న చితక ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక.. కుటుంబ పోషణ కోసం. తన గ్రామంలోనే ఒక కూరగాయల షాపు పెట్టుకుని.. వాటిని అమ్ముతూ జీవిస్తున్నారు. తన కాళ్లపై తాను నిలబడాలనే లక్ష్యంతో ఇలా సొంత ఊళ్లోనే కూరగాయల వ్యాపారీగా మారారు బాషా. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో బాషాకు వైఎస్సాసీపీ ప్రభుత్వం కౌన్సిలర్ టికెట్ కేటాయించింది. అయితే కూరగాయల వ్యాపారిగా అందరితో చనువుగా ఉండడం.. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడంతో.. మొన్నటి ఎన్నికల్లో బాషా గెలుపునకు ఉపయోగపడింది. స్థానికులంతా మంచి మెజార్టీతో షేక్ బాషను గెలిపించారు.
ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణను సీఎం జగన్ గుర్తించారు. అందుకే ఎంతమంది ఆశావాహులు ఉన్నా? స్థానిక నాయకుల నుంచి పూర్తి స్థాయి ఒత్తిళ్లు ఉన్నా.. అవేవీ పట్టించుకోకుండా..సామాజిక సమీకరణాలు.. స్థానికంగా ఉన్న ప్రజా ఆమోదాన్ని గుర్తించి కూరగాయాల వ్యాపారిని, హోదా, స్థాయి లాంటివి ఏవీ పట్టించుకోకుండా చైర్మన్ గా చేశారు సీఎం జగన్. సాధరణ కూరగాయల వ్యాపారి అయిన తనపై నమ్మకం ఉంచి.. అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు షేక్ బాష ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి అధిక శాతం సీట్లు కేటాయించిందని బాషా ఆనందం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ 86 కు గాను, 84స్థానాలలో విజయకేతనం ఎగరవేసిందని బాషా గుర్తు చేశారు. ఈ ఎన్నికలలో మహిళలకు 60.47 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,వెనుకబడిన వర్గాల వారికి 78 శాతం పోస్టులను కేటాయించడం గొప్పవిషయమని బాష అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా చోట్ల వాలింటీర్లను కౌన్సిలర్ గా చేయడం సంచలనంగా మారితే.. ఒక కూరగాయల వ్యాపారీని చైర్మన్ చేయడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, AP News, Kadapa, Municipal Elections, Ycp, Ys jagan