హోమ్ /వార్తలు /Explained /

Liquid-mirror Telescope: ప్రపంచంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్‌.. మన దేశంలోనే ఏర్పాటు.. స్పేస్ గుట్టు విప్పేనా!

Liquid-mirror Telescope: ప్రపంచంలోనే తొలి లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్‌.. మన దేశంలోనే ఏర్పాటు.. స్పేస్ గుట్టు విప్పేనా!

Liquid-mirror Telescope (PC : Twitter)

Liquid-mirror Telescope (PC : Twitter)

Liquid-mirror Telescope: గతంలో అభివృద్ధి చేసిన కొన్ని లిక్విడ్-టెలిస్కోప్‌లు ఉపగ్రహాలను ట్రాక్ చేశాయి లేదా సైనిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ, ఈ సారి మాత్రం..

ఖగోళ వస్తువుల (Celestial Objects)ను సమర్థవంతంగా గుర్తించడంలో భారతదేశం ఎన్నో అధునాతన పరికరాలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తాజాగా దేశంలో తొలి లిక్విడ్-మిర్రర్ టెలిస్కోప్‌ (Liquid-mirror Telescope)ను ఏర్పాటు చేసింది. అంతరిక్షం నుంచి దూసుకొచ్చే అంతరిక్ష శిథిలాలు, గ్రహశకలాలతో పాటు సూపర్‌నోవా వంటి అస్థిరమైన వస్తువులను ఈ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్‌ గుర్తిస్తుంది. ఈ టెలిస్కోప్‌ ఆసియాలోనే అతి పెద్ద టెలిస్కోప్‌గా నిలవడం విశేషం. దీన్ని ఉత్తరాఖండ్‌లోని కొండ దేవస్థాల్‌ (Devasthal)లో ఏర్పాటు చేశారు. సముద్రమట్టం నుంచి 2,450 మీటర్ల ఎత్తులో దీనిని అమర్చారు.

* లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అంటే ఏంటి?

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ARIES) యాజమాన్యంలోని దేవస్థాల్ అబ్జర్వేటరీ క్యాంపస్‌లో ఇంటర్నేషనల్ లిక్విడ్-మిర్రర్ టెలిస్కోప్ (ILMT) ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి 2,450 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టెలిస్కోప్ ఖగోళ శాస్త్ర పరిశోధన కోసం అభివృద్ధి చేశారు. ఈ టెలిస్కోప్‌ ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగల ఏకైక టెలిస్కోప్‌గా అవతరించింది.

గతంలో అభివృద్ధి చేసిన కొన్ని లిక్విడ్-టెలిస్కోప్‌లు ఉపగ్రహాలను ట్రాక్ చేశాయి లేదా సైనిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడ్డాయి. ఐఎల్ఎంటీ (ILMT) అనేది దేవస్థాల్‌లో వచ్చిన మూడవ టెలిస్కోప్ కావడం విశేషం. దేవస్థాల్‌లో ఎప్పటినుంచో ఖగోళ పరిశీలన పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఐఎల్ఎంటీ ఈ ఏడాది అక్టోబర్‌లో పూర్తి స్థాయి సైంటిఫిక్ యాక్టివిటీస్ ప్రారంభించనుంది. ఈ టెలిస్కోప్ ఇండియన్ బిగ్గెస్ట్ టెలిస్కోప్‌ అయిన 3.6-మీటర్ల దేవస్థాల్ ఆప్టికల్ టెలిస్కోప్ (DOT)తో కలిసి పని చేస్తుంది.

* సాధారణ టెలిస్కోప్‌కు, ఈ టెలిస్కోప్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి

సాధారణ టెలిస్కోప్ అనేది పరిశీలనల కోసం ఆకాశంలో ఆసక్తిని కలిగించే ఖగోళ మూలం వైపుకు తిరుగుతుంది. మరోవైపు, లిక్విడ్-మిర్రర్ టెలిస్కోప్‌లు ఎటూ కదలని నిశ్చల టెలిస్కోప్‌లు. ఇవి రాత్రుళ్లు ఒక నిర్దిష్ట సమయంలో అత్యున్నత స్థాయి వద్ద ఉన్న ఆకాశంలోని ఖగోళ వస్తువులను పరిశీలిస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, నక్షత్రాలు, గెలాక్సీలు, సూపర్నోవా పేలుళ్లు, గ్రహశకలాలు నుంచి అంతరిక్ష శిధిలాల వరకు అన్ని ఖగోళ వస్తువులను లిక్విడ్-మిర్రర్ టెలిస్కోప్ పరీక్షిస్తుంది. దీనివల్ల అనేక గెలాక్సీలు, ఇతర ఖగోళ సోర్సెస్ గమనించడం సాధ్యపడుతుంది. అలాగే ఖగోళ వస్తువులను గుర్తించడం సులభమవుతుంది.

ఇది కూాడా చదవండి : అమిత్ షా వరుస భేటీలు.. కశ్మీర్‌లో వారి భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా ?

సాధారణ టెలిస్కోప్‌కు భిన్నంగా లిక్విడ్-టెలిస్కోప్ ప్రతిబింబ ద్రవం అద్దాల (Reflective Liquid Mirrors)తో తయారవుతుంది. దీనిలో ప్రతిబింబ ద్రవంగా పాదరసం లేదా మెర్క్యురీ వాడతారు. మెర్క్యురీకి అత్యధికంగా కాంతిని ప్రతిబింబించే సామర్థ్యం ఉంటుంది. కంటైనర్‌లో నింపిన దాదాపు 50 లీటర్లు (700కేజీలకి సమానం) పాదరసం ఐఎల్ఎంటీ నిటారు అక్షం (Vertical Axis) వెంట స్థిరమైన వేగంతో రొటేట్ అవుతుంది. ఈ ప్రక్రియలో, పాదరసం కంటైనర్‌లో పలుచని పొరగా వ్యాపించి పారాబొలాయిడ్ ఆకారపు ప్రతిబింబ ఉపరితలాన్ని ఏర్పరుస్తుంది.

అది అప్పుడు అద్దంలా పనిచేస్తుంది. ఈ ఉపరితలం కాంతిని సేకరించడానికి, కాంతిపై ఫోకస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ అద్దం వ్యాసం 4 మీటర్లు ఉంటుంది.సాధారణ టెలిస్కోప్‌లు అధ్యయన అవసరాలు, నిర్దిష్ట సమయం ప్రకారం నిర్దిష్ట గంటలపాటు నిర్దిష్ట నక్షత్ర మూలాలను గమనిస్తే.. ఐఎల్ఎంటీ మాత్రం అక్టోబర్ 2022 నుంచి వచ్చే ఐదేళ్లపాటు అన్ని రాత్రులు అంతరిక్ష చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. వర్షాకాలంలో తేమ నుంచి రక్షించడానికి, జూన్, ఆగస్టు మధ్య ఐఎల్ఎంటీని క్లోజ్ చేస్తారు.

* టెలిస్కోప్ అభివృద్ధిలో ఏ దేశాలు పాల్గొంటున్నాయి?

భారతదేశం, బెల్జియం, కెనడా, పోలాండ్, ఉజ్బెకిస్థాన్‌లు ఐఎల్ఎంటీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ టెలిస్కోప్ అడ్వాన్స్‌డ్ మెకానికల్ అండ్ ఆప్టికల్ సిస్టమ్స్ కార్పొరేషన్, బెల్జియంలోని సెంటర్ స్పేషియల్ డి లీజ్‌లో తయారు చేశారు. దీనికోసం కెనడా, బెల్జియం సంయుక్తంగా రూ.30-రూ.40 కోట్ల నిధులు అందించాయి.

* ఐఎల్ఎంటీ ఉత్పత్తి చేసే డేటా ఏంటి.. అది ఎలా యూజ్ అవుతుంది?ఐఎల్ఎంటీ 10-15 జీబీ డేటాను ఒక రాత్రికి ప్రొడ్యూస్ చేయగలదు. అక్టోబరు 2022 నుంచి వచ్చే ఐదేళ్లపాటు ఏడాదికి తొమ్మిది నెలల పాటు ప్రతి రాత్రి కార్యకలాపాల కోసం ఐఎల్ఎంటీ భారీ వాల్యూమ్‌లలో డేటాను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, ప్రాథమిక నిర్ణీత వ్యవధిలో, ఈ భాగస్వామ్య సంస్థల పరిశోధకులుకు డేటా యాక్సెస్ లభిస్తుంది.

తరువాతి దశలో, డేటా అన్ని గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీలకు అందుబాటులో ఉంటుంది. పెద్ద డేటాసెట్‌లను జల్లెడ పట్టడానికి, ప్రాసెస్ చేయడానికి, విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి టూల్స్‌ను ఐఎల్ఎంటీ యూజ్ చేస్తుంది. ఈ డేటాపై స్పెక్ట్రోగ్రాఫ్‌లను ఉపయోగించి తదుపరి ఫోకస్డ్ స్టడీస్ కోసం ఫాలో-అప్ చేయవచ్చు. DOTలో ఉన్న ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ తో కూడా ఈ డేటాను మరింత పరిశీలించవచ్చు.

First published:

Tags: Haryana, India, Space, Telescope

ఉత్తమ కథలు