Home /News /explained /

WORLD HEART DAY 2021 KNOW THE DIFFERENT TYPES OF HEART DISEASES AND THEIR SYMPTOMS GH SK

World Heart Day: గుండె జబ్బులు ఎన్ని రకాలు? సకాలంలో ఎలా గుర్తించాలి? తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

World Heart Day: గుండె జబ్బులను సకాలంలో గుర్తించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి, ప్రతియేటా సెప్టెంబర్ 29న ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ జరుపుతున్నారు. మరి గుండె జబ్బుల్లో ఎన్ని రకాలున్నాయి? వాటిని సకాలంలో ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా చదవండి ...
తల్లి కడుపులో ఉన్న సమయం నుంచి చనిపోయేంత వరకూ నిరంతరం పనిచేసే గుప్పెడంత గుండె (Heart) ను సంరక్షించుకోవడం చాలా అవసరం. పిడికిలి పరిమాణంలో ఉండే గుండె శరీరంలోని అన్ని అవయవాలకు ప్రతిక్షణం రక్తాన్ని చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కొందరు దురలవాట్లతో, అనారోగ్యకరమైన జీవనశైలితో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా.. ఏటా 1 కోటి 86 లక్షల మందికిపైగా గుండెజబ్బులతో (cardiovascular disease) అకాల మరణం చెందుతున్నారు. గుండె, రక్తనాళాల వ్యాధుల సమూహాలను కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌లు అని అంటారు. గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న 80% కంటే ఎక్కువ మంది గుండెపోటుతో బాధపడుతున్నారు. కార్డియోవాస్కులర్‌ డిసీజ్‌లు ఉన్న రోగుల్లో మూడింట ఒక వంతు రోగులు అకాల మరణం చెందుతారు.

ఈ వ్యాధులను సకాలంలో గుర్తించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి, ప్రతియేటా సెప్టెంబర్ 29న ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ జరుపుతున్నారు. హృదయ వ్యాధుల ప్రారంభ సంకేతాల (early signs)ను త్వరగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు. అయితే ఈ సంకేతాలు లేదా లక్షణాలు హృదయ వ్యాధుల రకాలను బట్టి మారుతుంటాయి. ఏ రకం గుండె జబ్బు వస్తే ఏ రకమైన లక్షణాలు మొదటగా బయట పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Heart Diseases: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు..!

* గుండె జబ్బుల రకాలు:

1. రక్తనాళ వ్యాధి- కొరోనరీ ఆర్టరీ (హృదయ ధమని) ఆరోగ్యం దెబ్బ తిన్నట్లుగా ఈ వ్యాధి సంభవిస్తుంది.

2. అరిథ్మియాస్- ఇది అసాధారణ హృదయ స్పందనను సూచిస్తుంది.

3. పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు- దీనిని పుట్టుకతో వచ్చే గుండె లోపాలు అని పిలుస్తారు. ఈ జబ్బు బారిన పడిన వారిలో గుండె అసాధారణంగా పనిచేస్తుంది

4. గుండె కవాటాల వ్యాధి (Disease of a heart valve)

5. గుండె కండరాల వ్యాధి (Heart muscle disease)

6. గుండె ఇన్‌ఫెక్షన్ (heart infection)

* పైన పేర్కొన్న వివిధ రకాల గుండె జబ్బుల కారణంగా మొదటగా బయటపడే లక్షణాలు (early symptoms)

మైగ్రేన్‌తో బాధపడేవారు ఈ 7 రకాల ఫుడ్స్‌ను తింటే..!

రక్త నాళాలలో గుండె జబ్బులు.. ఛాతీలో నొప్పి, బిగుతు లేదా ఒత్తిడి.. చేతులు లేదా కాళ్లలో నొప్పి.. బలహీనత.. జలుబు.. కాళ్లు లేదా చేతుల్లో తిమ్మిరి.. శ్వాస ఆడకపోవుట, మెడ, దవడ, గొంతు, పొత్తికడుపు, వెన్నెముక భాగంలో నొప్పి. ఈ లక్షణాలు మీలో కనిపించినట్లయితే వైద్యున్ని సంప్రదించి హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది.

* అరిథ్మియాస్
ఛాతీలో దడ.. అతి వేగమైన హృదయ స్పందన (టాచీకార్డియా).. స్లో హార్ట్ బీట్ (బ్రాడీకార్డియా).. ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం.. శ్వాస ఆడకపోవుట, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.. మూర్ఛపోవడం (సింకోప్) వంటి లక్షణాలు అరిథ్మియాస్ గుండె జబ్బు ఉన్న వారిలో కనిపిస్తాయి.

* పుట్టుకతో వచ్చే గుండె జబ్బు (Congenital heart defects)
చర్మం రంగు లేత లేదా నీలం (సైనోసిస్) గా మారడం.. ఉదరం, కాళ్లు లేదా కళ్ల చుట్టూ వాపు రావడం.. తినేటప్పుడు చిన్నారుల్లో శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఫ్రిజ్‌లో పెట్టిన లెమన్స్‌ వాడితే ఏమవుతుందో తెలుసా?

* గుండె కండరాల వ్యాధి (కార్డియోమయోపతి - cardiomyopathy)
విశ్రాంతి సమయంలో లేదా చురుకుగా ఉన్నప్పుడు ఊపిరి ఆడకపోవడం.. అలసట.. కాళ్లు, పాదాలు, మడమల్లో(ankles)లో వాపు.. అస్తవ్యస్తమైన హృదయ లయ, వేగవంతమైన, కొట్టుకునే లేదా కొట్టుకునే హృదయ స్పందనలు.. మైకము.. మూర్ఛపోవడం లక్షణాలు కనిపిస్తే కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం తక్షణావసరం.

* హార్ట్ ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధి (ఎండోకార్డిటిస్ - endocarditis)
జ్వరం.. అలసట లేదా బలహీనత.. ఉదరం లేదా కాళ్ళలో వాపు.. శ్వాస ఆడకపోవుట.. హృదయ స్పందనలో మార్పులు.. పొడి దగ్గు లేదా నిరంతర దగ్గు.. చర్మంపై అసాధారణమైన మచ్చలు లేదా దద్దుర్లు.

ఈ 10 ఫ్రూట్స్‌ను డయాబెటీస్‌ పేషెంట్స్‌ నిస్సందేహంగా తినవచ్చట!

* గుండె కవాటాల సమస్యల వల్ల వచ్చే వ్యాధి (valvular heart disease)
అస్తవ్యస్తమైన హృదయ స్పందన.. శ్వాస ఆడకపోవుట.. అలసట.. చీలమండలు లేదా పాదాలలో వాపు ఛాతీలో నొప్పి.. మూర్ఛపోవడం (సింకోప్).

ముఖ్యంగా ఛాతి నొప్పి, శ్వాస ఆడకపోవుట, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Health, Health benefits, Heart, Heart Attack, Life Style, Lifestyle

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు