Home /News /explained /

మలేరియా వ్యాక్సిన్‌‌కు WHO గ్రీన్‌సిగ్నల్.. అక్కడి చిన్నారులకు ఎక్కువగా ఉపయోగం

మలేరియా వ్యాక్సిన్‌‌కు WHO గ్రీన్‌సిగ్నల్.. అక్కడి చిన్నారులకు ఎక్కువగా ఉపయోగం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆఫ్రికా సహ మలేరియా సంక్రమణ మధ్యస్థాయి నుంచి అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్‌ ఉపయోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి మంజూరు చేసింది. ఇది ఒక చారిత్రక క్షణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అదనోమ్‌ గెబ్రెయేసిస్‌ అన్నారు.

ఇంకా చదవండి ...
ఎన్నో దశాబ్దాలుగా మానవాళికి శాపంగా పరిణమిస్తోంది మలేరియా వ్యాధి. చిన్నపిల్లలు, శిశువులను ఈ వ్యాధి కబలిస్తోంది. అయితే విస్తృతమైన ప్రయోగాల తరువాత ఈ ప్రాణాంతక వ్యాధికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ పేరు ఆర్‌టీఎస్‌ ఎస్‌ (RTS,S). ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆరేళ్ల క్రితమే రుజువైంది. వైద్యరంగం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటి.ఘనా, కెన్యా, మావీ వంటి ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అది విజయవంతం కావడంతో సబ్‌-సహార, ఆఫ్రికా సహ మలేరియా సంక్రమణ మధ్యస్థాయి నుంచి అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్‌ ఉపయోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి మంజూరు చేసింది. ఇది ఒక చారిత్రక క్షణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అదనోమ్‌ గెబ్రెయేసిస్‌ అన్నారు.

పిల్లలకు మలేరియా టీకా అన్నది నిజంగా ఒక గొప్ప వరం. మలేరియా బారిన పడి ఏటా వేల సంఖ్యలో కన్నుమూస్తున్న చిన్నారులను ఈ వ్యాక్సిన్ కాపాడనుంది. 2019లో ఆఫ్రికా ప్రాంతంలో 2,60,000 మంది చిన్నారులు మలేరియాతో చనిపోయారంటే.. అక్కడ వ్యాధి సృష్టిస్తున్న బీభత్సం అర్థం చేసుకోవచ్చు.

* ప్రాణాంతక పరాన్నజీవి
మనుషుల రక్తం పీల్చే దోమను ఆశ్రయించి ఉండే ప్లాస్మోడియం అనే ఏకకణ పరాన్నజీవి ద్వారా మలేరియా సంక్రమిస్తుంది. అది శరీరంలోకి చొరబడిన వెంటనే తనను తాను విస్తరింపజేసుకునేందుకు మన శరీరంలోని రక్తకణాలను నాశనం చేస్తుంది. ఈ పరాన్నజీవిని చంపేందుకు ఉన్న ఔషధాలు, దోమలు కుట్టుకుండా రక్షణగా నిలిచే తెరలు, దోమలను చంపే కీటకనాశినిల వంటివి మలేరియా వ్యాప్తిని అరికట్టడంలో ఉపయోగపడుతున్నాయి.

ఆఫ్రికా దేశమైన ఘనాలో సామూహిక వ్యాక్సినేషన్‌ సాధ్యమా, అది ప్రభావవంతంగా ఉంటుందా అనేదానిపై డాక్టర్‌ క్వామే అంపోన్సా అచియానో అనే వైద్య నిపుణుడు ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు ఫలించాయి. భారీ స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపడితే మలేరియా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన గుర్తించారు. చిన్నతనంలో తరచూ మలేరియా బారిన పడుతుండటం.. క్వామేను డాక్టర్‌ అయ్యేలా చేసింది.

* ఏ వేరియంట్‌పై ప్రయోగాలు చేశారు?
మలేరియా పరాన్న జీవుల్లో 100కు పైగా రకాలున్నాయి. కొత్తగా రూపొందించిన వ్యాక్సిన్‌ ఆర్‌టీఎస్‌ ఎస్‌ రకం.. ఆఫ్రికాలో అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత సాధారణంగా ఉండే ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే రకాన్ని నిర్వీర్యం చేస్తుంది. 2015లో నిర్వహించిన వ్యాక్సిన్‌ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి 10 మందిలో నలుగురికి మలేరియా రాకుండా నివారించవచ్చని, అలాగే ప్రతి పది తీవ్రమైన కేసుల్లో ముగ్గురు పిల్లలకు రక్తమార్పిడి అవకాశాలు తగ్గించవచ్చని తేలింది.

ఈ వ్యాక్సిన్‌ నాలుగు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి మూడు డోసులను చిన్నారులకు ఐదు, ఆరు, ఏడు నెలల వయస్సుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. చివరి బూస్టర్‌ డోసు 18 నెలలకు ఇవ్వాలి. ఈ ప్రయోగాత్మకం ప్రాజెక్టు ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన రెండు నిపుణుల సలహా బృందాలు చర్చించాయి. దాదాపు 2.3 మిలియన్‌ డోసులు ఈ ఫలితాలను సూచించాయి.

* ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
ఈ వ్యాక్సిన్ సురక్షితమని, దీని ద్వారా తీవ్రమైన మలేరియా కేసుల సంఖ్య 30% తగ్గిందని అధికారులు చెబుతున్నారు. దోమ తెరలు లేని చిన్నారుల్లో మూడింట రెండొంతుల మందికి ఇది చేరువైంది. మలేరియా నివారణకు చేపట్టిన ఇతర చర్యలు లేదా ఇతర వ్యాక్సిన్లపై ఈ వ్యాక్సిన్‌ ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదు. దీనికి తోడు ఈ వ్యాక్సిన్‌ ఖరీదు సైతం తక్కువే. వాస్తవానికి దాదాపు శతాబ్ద కాలంగా ఆఫ్రికా వాసులు మలేరియా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త వ్యాక్సిన్‌ రావడం, అది కూడా ప్రభావవంతంగా ఉండటం అక్కడి వారికి సంతోషం కలిగిస్తోంది.

* మలేరియాను అదుపు చేయడం అంత కష్టమా?
కొవిడ్‌కు అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్‌ను కనుగొన్న ప్రపంచం మరి మలేరియా విషయంలో ఎందుకు ఇంత సమయం తీసుకుంది? ఈ ప్రశ్నకు నిపుణులు సమాధానం ఇచ్చారు. కొవిడ్‌ కారక వైరస్‌తో పోలిస్తే.. మలేరియాకు కారణమైన పరాన్నజీవి ఎన్నో రెట్లు కపటమైనది, అత్యాధునికమైనదని చెప్పాలి. పోలికపరంగా చెప్పాలంటే నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా వీటి మధ్య ఉంది.

మలేరియా పరాన్నజీవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని తట్టుకునేలా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతిసారి పట్టుకోవాల్సి ఉంటుంది. దీని జీవిత చక్రం సైతం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇది దోమలు, మనుషుల్లో ఎదుగుతుంది. అంతే కాదు మన శరీరంలోకి చొరబడిన తర్వాత లివర్‌ సెల్స్‌ ఎర్రరక్తకణాలపై దాడి చేస్తూ రకరకాల మార్పులు సంతరించుకుంటుంది.

Chiranjeevi: క్లైమాక్స్‌కు చేరుకుంటున్న మా ఎన్నికలు.. లాస్ట్ పంచ్ మెగాస్టార్‌దేనా.. ఆయన మాటలకు అర్థమేంటి ?

Fake Banking Apps: బ్యాంకింగ్ యాప్స్‌తో జరభద్రం.. ఫేక్ యాప్స్‌ను ఇలా గుర్తించండి..

దీనికి వ్యాక్సిన్‌ కనుగొనడం చాలా క్లిష్టమైన పని. ఇప్పుడు తయారు చేసిన ఆర్‌టీఎస్‌ ఎస్‌ అనే వ్యాక్సిన్‌ కూడా పరాన్నజీవి జీవకణంగా ఉన్న దశలో (అంటే దోమ కరిచిన దశ నుంచి ఆ పరాన్నజీవి కాలేయానికి చేరే దశలో) మాత్రమే పనిచేస్తుంది. అంటే ఈ వ్యాక్సిన్‌ 40% మాత్రమే ప్రభావశాలి అని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఇది అత్యంత ప్రభావవంతమైనదని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని సమర్థవంతమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు ఇది దోహదపడుతుంది.

* ప్రస్తుతానికి అక్కడే వినియోగం
గ్లాస్కో స్మిత్‌క్లైన్‌ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ రాకతో మలేరియా నియంత్రణకు చేపడుతున్న ఇతర చర్యలేవి ఆగిపోవు. వాటితో పాటు దీన్ని ఉపయోగిస్తారు. ఈ వ్యాక్సిన్‌ను కేవలం ఆప్రికాలో మాత్రమే ఉపయోగిస్తారు. మిగిలిన చోట్ల ఉండే ఇతర రకాల మలేరియాపై ఇది పనిచేయదు. ఏటా నమోదవుతున్న మలేరియా కేసులు 229 మిలియన్లు కాగా, అందులో 94% ఆఫ్రికాలోనే వెలుగుచూస్తున్నాయి. అందువల్ల ఇక్కడి అవసరాల కోసమే ప్రాథమికంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. మలేరియా బారిన పడిన ప్రతి 10 మందిలో నలుగురిని ఈ వ్యాక్సిన్ రక్షించగలదు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Mosquito

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు