Home /News /explained /

WITH METAVERSE FACEBOOK AIMS ENTRY INTO VIRTUAL REALITY SPHERE BUT WHAT DOES IT ENTAIL MK GH

Explained: మెటావర్స్ ద్వారా వర్చువల్‌ రియాలిటీలోకి ప్రవేశించడం ఫేస్‌బుక్‌ ఎలాంటి ప్రయోగాలు చేస్తోంది...

meta

meta

మెటావర్స్ అనేది ఒక అంతు తెలియని ప్రపంచం. వర్చువల్‌ రియాల్టీ హెడ్‌సెట్స్‌, ఆగ్మెంటెడ్‌ రియాల్టీ గ్లాసులు, స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌ లేదా ఇతర డివైజ్‌ల ద్వారా ఒకదానికి ఒకటిగా ఉంటే వర్చువల్‌ కమ్యూనిటీలలో జనాలను కలుసుకోవడం, పనిచేయడం, ఆడుకోవడం వంటివన్నీ ఈ మెటావర్స్‌ ప్రపంచంలో చేయవచ్చు.

ఇంకా చదవండి ...
టెక్నాలజీ రంగంలో మెటావర్స్‌ అనే పదం ఈ మధ్య కాలంలో మార్మోగిపోతోంది. తమ భవిష్యత్తు ఆలోచనలను అందిపుచ్చుకునేందుకు ఫేస్‌బుక్ కంపెనీ పేరును మెటా ఫ్లాట్‌ఫామ్స్‌ ఇన్‌కార్పొరేషన్‌ లేదా పొట్టిగా చెప్పాలంటే మెటా అని మార్చారు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్. వర్చువల్‌ రియాలిటీ, ఇతర టెక్నాలజీలను మేళవించేందుకు కృషి చేస్తున్న వారిలో జుకర్ బర్గ్, ఆయన బృందంలోని టెక్‌ విజనరీలు కృషి చేస్తున్నారు. మెటావర్స్‌ అనేది ఒక వర్చువల్‌ ప్రపంచం అని Zuckerberg అభివర్ణిస్తారు. స్క్రీన్‌లో దాన్ని చూడటమే కాదు దీని లోపలికి కూడా వెళ్లవచ్చు.

మెటావర్స్ అనేది ఒక అంతు తెలియని ప్రపంచం. వర్చువల్‌ రియాల్టీ హెడ్‌సెట్స్‌, ఆగ్మెంటెడ్‌ రియాల్టీ గ్లాసులు, స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌ లేదా ఇతర డివైజ్‌ల ద్వారా ఒకదానికి ఒకటిగా ఉంటే వర్చువల్‌ కమ్యూనిటీలలో జనాలను కలుసుకోవడం, పనిచేయడం, ఆడుకోవడం వంటివన్నీ ఈ మెటావర్స్‌ ప్రపంచంలో చేయవచ్చు. జీవితంలో ముడిపడిన ఆన్‌లైన్‌ పనులు అంటే షాపింగ్‌, సోషల్‌ మీడియా వంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇది కనెక్టివిటీలో కొత్త పరిణామం. ఎటువంటి అవాంతరాలు, అడ్డంకులు లేకుండా అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. మీరు నిజ జీవితంలో భౌతికంగా ఎలా జీవిస్తున్నారో ఈ వర్చువల్‌ జీవితంలోనూ అలాగే జీవించవచ్చు.

మెటావర్స్‌లో ఏమేం చేయవచ్చు?
వర్చువల్‌ కన్సర్ట్‌కు వెళ్లడం, ఆన్‌లైన్‌లో ట్రిప్‌కు వెళ్లడం, కళారూపాలు సృష్టించడం లేదా రూపొందించడం, డిజిటల్‌ దుస్తులు ధరించడం లేదా కొనుగోలు చేయడం వంటివన్నీ చేయవచ్చు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విషయంలోనూ మెటావర్స్‌ సమూల మార్పులు తీసుకురావచ్చు. వీడియో కాల్‌ గ్రిడ్‌లో తోటి ఉద్యోగులను చూడటానికి బదులు మెటావర్స్‌ ద్వారా వర్చువల్‌ ఆఫీసులో ఉద్యోగులు జాయిన్‌ అవ్వొచ్చు.

కంపెనీల కోసం హోరైజన్‌ వర్క్‌రూమ్స్‌ పేరుతో ఒక మీటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఫేస్‌బుక్‌ గతంలో లాంచ్ చేసింది. వీటిని ఆక్యూలస్‌ VR హెడ్‌ సెట్స్‌తో ఉపయోగించాలి. అయితే వీటిని సంబంధించిన ప్రారంభ రివ్యూలు అంత గొప్పగా లేవు. ఈ హెడ్‌ సెట్స్‌ ధర $300 కంటే ఎక్కువే ఉంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ ఖర్చు చాలా మందిని మెటావర్స్‌ను దూరం పెట్టేలా ఉంది. అంత మొత్తం భరించగలిగిన స్థోమత కలిగిన వారు వేర్వేరు కంపెనీలు సృష్టించిన వర్చువల్‌ ప్రపంచాన్ని తమ అవతారాలతో దర్శించవచ్చు.

ఫేస్‌బుక్‌ మొత్తం మెటావర్స్‌ వైపే వెళ్తుందా?
ఒక అనుభూతిని నుంచి మరో అనుభూతికి టెలిపోర్టు కావచ్చని అంటున్నారు Zuckerberg.
ఆన్‌లైన్‌ వేదికలతో పరస్పరం ఎలా కనెక్ట్‌ కావాలనే దానిపై టెక్‌ కంపెనీలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి. దీని కోసం పోటీపడేందుకు పరస్పర ఆమోదయోగ్యమైన టెక్నాలజీ వేదికలు అవసరం. దీన్ని ఇంటర్నెట్‌లో కొత్త తరంగా Zuckerberg భావిస్తున్నారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఇది కీలక భాగమవుతుందని ఆయన నమ్ముతున్నారు.

మరో వైపు ఫేస్‌బుక్‌ తాను ఎదుర్కొంటున్న సంక్షోభం, విశ్వాసఘాతుక చర్యలు, మాజీ ఉద్యోగుల విజిల్‌ బ్లోయింగ్‌ చర్యలు, తప్పుడు సమాచారాన్ని హ్యాండిల్‌ చేస్తున్న తీరుపై వ్యక్తమవుతున్న ఆందోళనల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చారని విమర్శకులు అంటున్నారు. ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్స్ పిల్లలకు హానికరమని, రాజకీయ హింసను అవి ప్రేరేపించేలా ఉన్నాయని ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సిస్‌ హగెన్‌ ఆరోపించారు. ఆ విషయాలను ఆయన U.S.సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు కూడా.

మెటావర్స్ కేవలం ఫేస్‌బుక్‌ ప్రాజెక్టేనా?
కాదు, మైక్రోసాఫ్ట్‌, చిప్‌ తయారీ సంస్థ Nvidia వంటి సంస్థలు మెటావర్స్‌ను అందిపుచ్చుకున్నాయి.
ఇంటర్నెట్‌లో కంపెనీలు పనిచేస్తున్న తరహాలోనే మెటావర్స్‌లో వర్చువల్‌ ప్రపంచాన్ని నిర్మించేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తాయని Nvidia Omniverse ఫ్లాట్‌ఫామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిచర్డ్స్‌ కెర్రీస్‌ అభిప్రాయపడ్డారు. ఇది బహిరంగంగా, విస్తరించేందుకు వీలుగా ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి వెళ్లేలా టెలిపోర్టు కలిగి ఉండాలి. ఒక వెబ్‌ పేజీ నుంచి మరో వెబ్‌ పేజీకి వెళ్తున్నట్టు ఆ ప్రపంచాలను ఒకే కంపెనీ సృష్టించవచ్చు లేదా ఇతర కంపెనీలు సృష్టించవచ్చు.

వీడియో గేమింగ్‌ కంపెనీలు ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నాయి. ప్రఖ్యాత Fortnite వీడియో గేమ్‌ వెనుకున్న Epic Games సంస్థ మెటావర్స్‌ను నిర్మించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా పెట్టుబడిదారుల నుంచి $1 బిలియన్‌ సేకరించింది. మరో ప్రముఖ గేమింగ్‌ సంస్థ Roblox కూడా ఈ విషయంలో ముందడుగు వేస్తోంది. నేర్చుకునేందుకు, పని చేసేందుకు, ఆడుకునేందుకు, సృష్టించేందుకు, కలిసిమెలిసిపోయేందుకు లక్షలాది 3D అనుభవాలను జనాలు పొందవచ్చని సంస్థ అంటోంది.

వినియోగ వస్తువుల బ్రాండ్లు కూడా ఈ విషయంలో దీటుగా నిలుస్తున్నాయి. ఇటాలియన్‌ ఫ్యాషన్ సంస్థ గూసీ గత సంవత్సరం జూన్‌లో డిజిటల్‌గా మాత్రమే ఉపయోగించగలిగే యాక్సెసరీలు అందించేందుకు Robloxతో ఒప్పందం కుదుర్చుకుంది. మెటావర్స్‌కు పునాదిరాళ్లుగా భావించే డిజిటల్‌ టోకెన్లను కోకా-కోలా, క్లినిక్‌ వంటి సంస్థలు విక్రయిస్తున్నాయి.

డేటా పొందేందుకు ఇదో కొత్త ఉపాయమా?
Zuckerberg మాటలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి తరహాలో ప్రజల అకౌంట్లు, ఫొటోలు, పోస్టులు, ప్లేలిస్టులు ద్వారా సమాచారాన్ని సేకరించి వాటిని అమ్మడం తరహాలో కాకుండా ఆన్‌లైన్‌ సంస్కృతి నుంచి విముక్తి ఉండాలనే భావనను చాలా మంది ఔత్సాహికులు వ్యక్తం చేస్తున్నారు. కానీ వ్యక్తిగత డేటాను ఉపయోగించి లక్ష్యిత ప్రకటన సంస్థలకు అమ్మే తన వ్యాపార విధానాన్ని మెటావర్స్‌లోనూ అమలు చేయేలానే స్పష్టమైన ఆలోచన ఫేస్‌బుక్‌లో కనిపిస్తోంది. “సోషల్‌ మీడియాలో మనం చేపట్టే అన్ని పనుల్లో ప్రకటనలన్నివీ వ్యూహాత్మకంగా కీలక భాగంగా నిలుస్తాయి, అదే సూత్రం మెటావర్స్‌కు కూడా వర్తింపజేయడం సహేతుకమవుతుంది” అని ఇటీవల కంపెనీ ఆదాయానికి సంబంధించి Zuckerberg తన అబిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Facebook

తదుపరి వార్తలు