హోమ్ /వార్తలు /Explained /

Vizag Steel Plant: తమ్ముడి కోసమే మెగాస్టార్ గళమెత్తారా? స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చిరంజీవి జైకొట్టడానికి అదే కారణమా?

Vizag Steel Plant: తమ్ముడి కోసమే మెగాస్టార్ గళమెత్తారా? స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చిరంజీవి జైకొట్టడానికి అదే కారణమా?

ప్రతీకాత్మక చిత్రం (చిరంజీవి,పవన్ కళ్యాణ్) (Twitter/Photo)

ప్రతీకాత్మక చిత్రం (చిరంజీవి,పవన్ కళ్యాణ్) (Twitter/Photo)

విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపించే నాయకుడు ఎవరు? ఇంతకాలం ఉద్యమం సాగుతున్నా.. ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించే నాయకుడు లేడనే లోటు ఉంది. ఇప్పుడు అందరి ఫోకస్ పవన్ పై పడింది. ఆయన ఉద్యమంలో ముందుకు రావాలనే ఢిమాండ్ పెరుగుతోంది. కానీ అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి తెరపైకి వచ్చారు?

ఇంకా చదవండి ...

విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమైంది. అయితే ఇప్పటి వరకు కేవలం కార్మిక సంఘాలు మాత్రమే విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. కార్మిక సంఘాలు ప్రజా, విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలుపుతూనే ఉన్నాయి. ఏపీలో రాజీకాయ పార్టీలు విశాఖ ఉద్యమానికి మద్దతు ఇస్తాన్నామని ప్రకటిస్తున్నాయి కానీ.. ఏ పార్టీకి ఆ పార్టీ అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ క్రెడిట్ కోసమే ఉద్యమాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప.. వారి పోరాటంలో నిజాయతీ లేదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. మరి  ఉద్యమం విజయవంతం కావాలంటే స్వప్రయోజనాలను పక్కన పెట్టి.. రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలి. ఏపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

విశాఖ ఉద్యమం ఉవ్వెతున ఎగసిపడుతున్నా.. ఉద్యామాన్ని ముందుకు తీసుకెళ్లే సరైనా లీడర్ లేడనే చెప్పాలి. ఇలాంటి సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టడంతో పరిస్థితి మారింది.  ఏపీలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరగడం ఖాయం. పక్క రాష్ట్రమే మద్దతు తెలిపినప్పుడు.. మీరు పోరాడకపోతే ఎలా అని.. కార్మిక సంఘాలను ప్రజా ప్రతినిధులను నిలదీసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు ఉద్యమంలో చురుగ్గానే ఉన్నారు. విశాఖ ఉద్యమం పేరుతో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న ఆయన ప్రస్తుతానికి అయితే పార్టీ మారలేదు కాబట్టి.. గంటా పోరాటం టీడీపీ కిందకే వస్తుంది. ఇక మొన్నటి వరకు అధికార వైసీపీ ఉద్యమాన్ని ముందు ఉండి లీడ్ చేయాలి అనుకుంది. కానీ లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన తరువాత వైసీపీ మాటలను స్థానికులు నమ్మే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికార పార్టీకి తెలిసే అంతా జరుగుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. దీంతో తమపై విమర్శలకు సమాధానం ఇవ్వడానికే వైసీపీ పరిమితం అవుతోంది?

వైసీపీ, టీడీపీలను వదిలిస్తే ఇక అందరి ఫోకస్ జనసేన అధినేత పవన్ పైనే ఉంది. పవన్ వచ్చి ఉద్యమాన్ని లీడ్ చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు ఇప్పటికే పవన్ కళ్యాన్ ఉద్యమాన్ని ముందుడి నడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వైసీపీ మంత్రులు, కీలక నేతలు సైతం పవన్ ఎందుకు స్పదించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలా అన్ని రకాలా పవన్ పై ఒత్తిడి పెరుగుతోంది. విశాఖ ఉద్యమంపై పవన్ మాట్లాడాలి అంటూ డిమాండ్ పెరుగుతోంది. కానీ ప్రస్తుతం పవన్ పరిస్థితి చూస్తే విశాఖ ఉక్కు ఉద్యమంపై నేరుగా మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి కేంద్రాన్ని విమర్శించే పరిస్థితి లేదు. ఆ కారణంగానే ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా రాలేకపోయారు..

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టిన కేటీఆర్? కానీ ఓ కండిషన్

స్టీల్ ప్లాంట్ ఉద్యమం తీవ్ర ఉధృతమైన వేళ అందరూ పవన్ రావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పవన్ ఏదో ఒక స్టేట్ మెంట్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తోంది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలి? అదే జరిగితే పొత్తును వదులుకోవాల్సి వస్తోంది. బీజేపీ పొత్తుకు జై కొట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడితే.. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ఎలా ముందుకు వెళ్లాలి తెలియక పవన్ తలపట్టుకుంటున్నారు.

తమ్ముడిపై ఒత్తిడి పెరుగుతుండడంతోనే ఇప్పుడు చిరంజీవి విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చిరంజీవి ఇలా ట్వీట్ కే పరిమితం కాకుండా నేరుగా వచ్చి ఉద్యమానికి జై కొడితే అప్పడు ఆయనే ఉద్యమానికి నాయకుడు అవుతారు. అప్పుడు పవన్ గురించి ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు.. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యమానికి జై కొట్టడంతో.. టాలీవుడ్ హీరోలు మాత్రం విశాఖ ఉద్యమంపై స్పందించకపోతే.. ఆ ప్రభావం వారి సినిమాలపైనా పడుతుంది. అందుకే తప్పని సరిపరిస్థితుల్లోనే చిరంజీవి విశాఖ ఉద్యమానికి జై కొట్టాల్సి వచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ఉద్యమంపై తొలిసారి స్పందించిన మెగాస్టార్

అందుకే విశాఖ ఉద్యమానికి మద్దతుగా అంత ఘాటుగా ట్వీట్ చేశారు చిరంజీవి. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్‌ గనులు కేటాయించకపోవడం, నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదని మెగాస్టార్ అన్నారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను అన్నారు. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి అన్నారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రధాన కర్తవ్యమని పిలుపు ఇఛ్చారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం అని చిరంజీవి పిలుపునిచ్చారు.

కారణం ఏదైనా మెగాస్టార్ చిరంజీవి ఉక్కు ఉద్యమానికి మద్దతు పలకడంతో.. ఇతర టాలీవుడ్ నేతలు కూడా ఇకపై ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలా ట్వీట్ లకు పరిమితం కాకుండా నేరుగా ఆయన వచ్చి తమతో కలసి పోరాడాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

First published:

Tags: KTR, Megastar, Megastar Chiranjeevi, Pawan kalyan, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు