హోమ్ /వార్తలు /Explained /

CM Jagan: ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? సీఎం జగన్ ముందు ఆప్షన్లు ఇవే..?

CM Jagan: ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? సీఎం జగన్ ముందు ఆప్షన్లు ఇవే..?

సీఎం జగన్ వ్యూహం ఏంటి?

సీఎం జగన్ వ్యూహం ఏంటి?

CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇటీవల వరుస షాక్ లు తగిలాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో మూడింటికి మూడు టీడీపీ నెగ్గి షాక్ ఇస్తే.. తరువాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బలం లేకుండా టీడీపీ నెగ్గింది. ఇదీ కూడా ఊహించని షాకే.. దీంతో ఎన్నికల సమయంలో ప్రజల్లో రాంగ్ సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అలాంటి సంకేతాలు వెళ్లకూడదు అంటే.. జగన్ ప్రజా బలం నిరూపించుకోవాల్సి ఉంది.. మరి ఆయన ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

CM Jagan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కి రాజకీయాల్లో ఊహించని షాక్ లు వరుసగా తగులుతున్నాయి.  గత నెల ముందు వరకు జీరో అయిపోయింది అనుకున్న టీడీపీ (TDP) అనూహ్యంగా పుంజుకుంది. ఎవరూ ఊహించని విధంగా మూడింటికి మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduate MLC Elections) సీట్లను సొంతం చేసుకుంది. అది నిజంగా అధికార వైసీపీ (YCP) కి ఊహించని షాకే.. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ప్రత్యక్ష ఎన్నికలే.. నేరుగా ఇందులో ఓట్లు వేసేది విద్యావంతులు. ఉత్తరాంధ్ర,  తూర్పు రాయలసీమ, పశ్చిమ  రాయలసీమల్లోనూ  టీడీపీ  విక్టరీ కొట్టింది. ఉత్తరాంధ్ర ఫలితంపై మొదటి నుంచి అనుమానం ఉన్నా.. రాయలసీమ జిల్లాల్లో టీడీపీ విజయాన్ని వైసీపీ అంచనా వేయలేకపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సి ఫలితాలు మరింత దెబ్బ కొట్టాయి.

బలం లేని చోట కూడా టీడీపీ గెలుపొంది. ఆ పార్టీకి వాస్తవంగా 19 ఓట్లు ఉంటే..? 23 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ నుంచి నాలుగు ఓట్లు పడ్డాయి.  దీంతో ప్రజల్లోనే కాదు.. ఎమ్మెల్యేల్లోనూ జగన్ పై వ్యతిరేకత ఉందనే ప్రచారం మొదలైంది. అయితే ఆ ప్రచారాన్ని అలాగే వదిలేస్తే.. నలుగురు ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే అలర్ట్ అయిన సీఎం జగన్ అనుమానం ఉన్న ఆ నలుగురిపై వేటు వేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు..

అయితే వరుసగా నాలుగు ఎమ్మెల్యేల విజయాలతో.. వైసీపీ పని అయిపోయిందని.. ఆ పార్టీపై ప్రజల్లోనూ.. ప్రజా ప్రతినిధుల్లోనూ వ్యతిరేకత పెరిగింది అనడానికి ఇదే నిదర్శనం అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్తే.. వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు.. ఆ ప్రచారాన్ని ఖండించాలి అంటే నేరుగా ప్రజల్లోనే జగన్ తన బలం నిరూపించుకోవాల్సి ఉంది. అది జరగాలి అంటే ఒక్క ఉప ఎన్నికైనా జరిగి.. నెగ్గితే.. వైసీపీకే బలం ఉందని ప్రూవ్ అవుతుంది. మరి ఇఫ్పడు ఏపీలో ఉప ఎన్నిక రావాలి అంటే జగన్ ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి..?

ఇదీ చదవండి : అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే రాపాక.. ఫోన్ స్విచ్ ఆఫ్.. ఈసీ వేటు వేస్తుందా..?

నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి..?                                                                                       ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో నలుగురు వైసీపీ సభ్యులు టీడీపీకి ఓటు వేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీ బలం లేకున్నా నెగ్గింది. అయితే ఆ నలుగురు ఎవరు అన్నది వైసీపీ ఈజీగా గుర్తించింది. రెబల్ ఎమ్మెల్యేలు  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. వీరిద్దరికి తోడు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. వీరే పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఓటు వేశారని.. వారికి కేటాయించిన కోడ్ ల ద్వారా వైసీపీ గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే వీరిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు.. ఎందుకంటే..? ఇది సీక్రెట్ బ్యాలెట్ ఎన్నిక.. కాబట్టి వారు ఎవరికి ఓటు వేశారన్నది రహస్యంగానే ఉంటుంది. అది నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు ఉండవు.. అలా చేసి ఈసీ అధికార పార్టీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే వారిని సస్పెండ్ చేసి.. ఇతర ఎమ్మెల్యేలు చే జారిపోకుండా చూసుకుంది..

ఇదీ చదవండి: సీఎం జగన్ మారారా..? ఈ మార్పుకు కారణం ఏంటి..? కేడర్ ఏమనుకుంటున్నారు..?

సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరైనా రాజీనామా చేయాలి..?                                                 ప్రస్తుతం సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఎవరు తమ పదవులకు రాజీనామా చేసినా ఉప ఎన్నిక వస్తుంది. అప్పుడు ఎవరి బలం ఏంటో తెల్చుకునే అవకాశం వస్తుంది. ఆ నలుగురు ఎమ్మెల్యేతో టీడీపీలో చేరే అవకాశం ఉన్నా.. ధైర్యంగా వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలను ఫేస్ చేసే అంత సాహసం టీడీపీ చేయకపోవచ్చు. అయితే ఆయ నేతలను మాటలతో రెచ్చగొట్టి.. రాజీనామా చేయించే అవకాశాలు ఉంటాయి.. ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి : తిరుమలలో వైభవంగా కోదండ రామస్వామి రథోత్సవం.. ప్రధాన ఘట్టానికి పోటీ పడ్డ భక్తులు

ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని రుజువు సంపాదించడం                                     క్రాస్ ఓటింగ్ చేశారని రుజువులు చూపించడం అసాధ్యం.. కానీ వారు ఓటింగ్ కు ముందు.. నలుగురు ఎమ్మెల్యేలు భారీగా ముడుపులు తీసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే వాటికి రుజువులు చూపించగలిగితే వారిపై అనర్హత వేటు వేయోచ్చు. లేదా వారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆడియో లేదా.. వీడియో సాక్ష్యాలు అయినా సంపాదించగలగాలి..

ఇదీ చదవండి : రేపు హైదరాబాద్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. భారీగా చేరికలకు ప్లాన్

గంటా రాజీనామా ఆమోదం..! కానీ తేడా కొడితే..                                                                                            ప్రభుత్వం ముందు అన్నిటికన్నా ఈజీ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే  అది గంటా రాజీనామా ఆమోదించడమే.. ఎందుకంటే గతంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ స్పీకర్ కు లేఖ రాశారు. అక్కడితోనే ఆగలేదు స్వయంగా స్పీకర్ ను కలిసి ఆమోదించాలని కోరారు కూడా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే  ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకటి రెండు రోజుల మందే గంటా రాజీనామా ఆమోదిస్తారని ప్రచారం జరిగింది. నిజంగా అలా చేసి ఉంటే.. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా చేసిందని ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. మరోవైపు ఓటర్ల జాబితా వచ్చిన తరువాత.. ఆయన రాజీనామా ఆమోదించడం సాధ్యం కాదు.. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తి అయ్యింది. కాబట్టి గంటా రాజీనామాను ఆమోదించే అవకాశం స్పీకర్ కు ఉంది. ఆయన రాజీనామా లేఖ కూడా స్పీకర్ ఫార్మట్ లో ఉంది కాబట్టి ఏ క్షణమైనా గంటా రాజీనామా ఆమోదించొచ్చు.. అప్పుడు ఉప ఎన్నిక ఖాయం.

ఇదీ చదవండి: రెబల్ ఎమ్మెల్యే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటి..? శ్రీదేవి రాజకీయ అడుగులు ఎటు..?

ఆ ఉప ఎన్నికలో నెగ్గడం అంత ఈజీ కాదు. ఎందుకంటే గంటా చాలా బలమైన అభ్యర్థి.. పార్టీ.. నియోజకవర్గంతో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికలో నెగ్గుకొని వస్తున్న రికార్డు ఆయనకు ఉంది. అందులోనూ విశాఖలో ప్రస్తుతం ఓటర్లంతా టీడీపీ వైపే ఉన్నారనే ప్రచారం ఉంది. మూడు రాజధానుల సెంటిమెంట్ ను కాదని.. ఉత్తరాంధ్ర పట్టబద్ధులు.. టీడీపీకి పట్టకట్టారు. అందులోనూ విశాఖలోనే టీడీపీ అభ్యర్ధికి అత్యధికంగా ఓట్లు పడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గాలి ఉన్నా సరే.. విశాఖ సిటీలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే  సీట్లను సైకిల్ పార్టీ సొంతం చేసుకుంది. దీనికి తోడు గంటా రాజీనామా చేసింది.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు..? సో ఇప్పుడు రాజీనామా ఆమోదించినా.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వారి స్నేహితులు, బంధువుల, ఇతర కార్మిక సంఘాలు గంటాకే మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే మిగిలిన పార్టీలు కూడా  మద్దతు తెలుపుతాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ కు అక్కడ మంచి కేడరే ఉంది. ఆయన సైతం గంటాకే మద్దతు తెలిపే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఏ లెక్కన చూసుకున్నా.. వైసీపీ విజయం సాధించడం అంత ఈజీ కాదు..

ఇదీ చదవండి: తలపై భారం తొలగిందా? రెబల్ ఎమ్మెల్యేలు ముందే ఫిక్స్ అయ్యారా..? వారి మాటలకు అర్థం ఇదేనా..?

మూడు రాజధానులు బిల్లు పెట్టి విప్ జారీ చేయడం..                                                                                      వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులే తమ విధానం అనే ఎంజెండాతోనే ప్రజల్లోకి వైసీపీ వెళ్లే అవకాశం ఉంది. అందుకు ఇప్పుడు అసెంబ్లీలో ప్రత్యేకంగా మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టి విప్ జారీ చేస్తే.. రెబల్ ఎమ్మెల్యేలు బిల్లుకు మద్దతుగానే ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఉండవల్లి శ్రీదేవి తాజా వ్యాఖ్యలను చూస్తే.. ఆమె అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఓటు వేయలేరు. ఇక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా ఆ బిల్లుకు మద్దతుగా ఓటు వేయలేరు. అలాటప్పుడు పార్టీ విప్ ను ధిక్కరించారని వారిపై అనర్హత వేటు వేస్తే.. ఉప ఎన్నిక రావొచ్చు.. కానీ విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు పడుతుందని తెలిసిన ఆ ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయాలనే ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇదీ చదవండి : ఆ రోజు జగన్ ఫోన్ చేశారు.. ఆనం సంచలన వ్యాఖ్యలు.. ఓటు ఎవరికి వేశారంటే..?

అనుకోకుండా కలిసి వచ్చిన రాపాక వీడియో                                                                                                     ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఆడియో వైరల్ అయ్యింది. తాను  దొంగ ఓట్ల కారణంగానే రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గానని.. తన అనుచరులు పది నుంచి  15 వరకు దొంగ ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. అయితే దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు.. న్యాయ పోరాటం  చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. అయితే ఈసీ కానీ. లేదా న్యాయస్థానాలు కానీ దీనిపై చర్యలు తీసుకోవాలి అంటే ఆ వీడియ ఒరిజినల్ అని తేలాలి. అయితే సాధారణంగా ఇలాంటి విషయాల్లో అధికార పార్టీ నేతలు అయితే అది ఒరిజినల్ వీడియో కాదని.. విపక్షాల కుట్ర అని రుజువులు సంపాదించే ప్రయత్నం చేస్తాయి. పోలీసు అధికారులు తమ చేతుల్లోనే ఉంటారు కాబట్టి అలా రుజువు చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. అయితే అధికార పార్టీ నిజంగా ఉప ఎన్నిక కావాలని కోరుకుంటే.. రాపాకది ఒరిజినల్ వీడియో అని తేలిస్తే సరిపోతుంది. కచ్చితంగా రాపక పై అనర్హత వేటు తప్పుదు.. అప్పుడు ఉప ఎన్నిక అనివార్యమవుతుంది.

ఇదీ చదవండి : మొన్నటి వరకు గుండె జగన్ జగన్ అని కొట్టుకుంది? ఇప్పుడేమైంది? అసలు సమస్య ఏంటి?

నిజంగా ఉప ఎన్నిక జరిగి.. తమ బలం ప్రజల్లో ప్రూవ్ చేసుకోవాలని అధికార వైసీపీ కోరుకుంటే.. ఈ ఆప్షన్లు ఉన్నాయి. మరి వీటిలో అధికార పార్టీ దేనికి ఓటేస్తుందో చూడాలి. ఎన్నికల ఏడాది రిస్క్ ఎందుకు అనుకుంటే.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రెబల్ ఎమ్మెల్యేలుగానే వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతారు..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News, AP Politics

ఉత్తమ కథలు