Home /News /explained /

WHY UKRAINE CRISIS EXPLODING INTO A NUCLEAR WAR AS PUTIN SAYS UKRAINE JOINING NATO WOULD MAKE NUCLEAR WAR MKS

Ukraine Crisis: అణు యుద్దం తప్పదన్న పుతిన్.. అదే జరిగితే ప్రపంచ విధ్వంసం ఇలా..

ప్రతీకాత్మక ఊహా చిత్రం

ప్రతీకాత్మక ఊహా చిత్రం

ఉక్రెయిన్ గనుక నాటోలో చేరి క్రిమియాను కలుపుకోడానికి ప్రయత్నిస్తే.. ఆ పరిస్థితి అణుయుద్దానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెగేసి చెప్పాడు. అదే జరిగితే ప్రపంచ విధ్వంసం మరెంతో దూరం లేదన్నట్టే..

మొదటి, రెండో ప్రపంచ యుద్దాల్లాగానే మూడోదైన ప్రపంచ అణుయుద్దానికి కూడా యూరప్ ఖండంలోనే బీజం పడుతుందా? అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలను బట్టి అవుననే భావన వ్యక్తమవుతోంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ద పరిస్థితులు నెలకొన్న క్రమంలో, ఉక్రెయిన్ సంక్షోభానికి దారితీసిన వాటిలో ఆ దేశం నాటోలో చేరిక, క్రిమియా ఆక్రమణ ప్రధాన కారణాలు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ప్రోద్బలంతో ఉక్రెయిన్ గనుక నాటో సభ్యత్వం తీసుకొని ఆ తర్వాత క్రిమియాను కలుపుకోడానికి ప్రయత్నిస్తే గనుక.. ఆ పరిస్థితి అణుయుద్దానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెగేసి చెప్పాడు. నిజంగా అదే జరిగితే ప్రపంచ విధ్వంసం మరెంతో దూరంలో లేదన్నట్టే. ఎలాగంటే..

ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రపంచ కూటముల్లో అతి బలమైనదిగా భావించే నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్(NATO)లో సభ్యురాలైన ఏ దేశంమీదైనా దాడి జరిగితే.. అది మొత్తం నాటోపైనే దాడిగా పరిగణిస్తారు. కూటమిలోని అన్ని దేశాలూ కలిసి సంయుక్తంగా ప్రత్యర్థిపై యుద్ధానికి దిగుతాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ప్రోద్బలంతో ఉక్రెయిన్ నాటోలో చేరిపోయి, ఆ వెంటనే (రష్యా ఆధీనంలోని) క్రిమియాను కలుపుకోడానికి ప్రయత్నిస్తే రష్యా ప్రతిఘటిస్తుంది. అప్పుడు నాటో సభ్యురాలైన ఉక్రెయిన్ పై దాడికి పాల్పడిన కారణంగా రష్యా చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలా జరగకూడదంటే ఉక్రెయిన్ నాటోలో చేరొద్దని, అసలు క్రిమియా వైపు కన్నెత్తి చూడొద్దని పుతిన్ వార్నింగ్ ఇస్తున్నారు.

Sangareddy : వీళ్ల ప్రేమ కథ ఇలా ముగుస్తుందని ఊహించలేరు.. 14 పేజీల లేఖలో అంతులేని విషాదం..అణుశాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్న ఎన్జీవో సంస్థ ‘బులెటిన్ ఆఫ్ అటామిక్ సైంటిస్ట్స్‌’ ప్రచురించిన నోట్స్ ప్రకారం..
-రష్యా వద్ద 4, 497 అణ్వాయుధాలు ఉన్నాయి
-వీటిలో 1760 అణ్వాయుధాలు ఉపయోగంలో లేవు లేదా ఇంకా తొలగించలేదు
-రష్యా 1700 అణ్వాయుధాలను మోహరించింది. అంతేకాదు, మరో 2,897 ఆయుధాలను రిజర్వ్‌లో ఉంచింది.
-మరోవైపు NATO కూటమికీ భారీ అణ్వాయుధ సంపత్తి ఉంది. వాటిలో ఎక్కువ భాగం అమెరికాలో ఉన్నాయి.
-అమెరికా వద్ద 3,800 అణ్వాయుధాలు ఉన్నాయి. వాటిలో 1750 ఆయుధాలను నిర్వీర్యం చేశారు.
-రష్యా కంటే అమెరికా 100 ఎక్కువ ఆయుధాలను మోహరించింది.
-అదే సమయంలో, NATOలోని మరో రెండు సభ్యదేశాలైన ఫ్రాన్స్ వద్ద 290, బ్రిటన్ వద్ద 225 అణ్వాయుధాలు ఉన్నాయి.

Zaheerabad: ప్రేమికుల రోజు ఏకాంతమంటూ దారుణం.. దిండ్లు పేర్చి నిద్రపోతున్నట్లు నమ్మించి!!భూమ్మీద మానవజాతి అంతం..
అంటే, ఉక్రెయిన్ నాటోలో చేరాక క్రిమియా విషయంలో రష్యాతో గొడవ తలెత్తినా, క్రిమియా అంశం లేకుండానే ఉక్రెయిన్-రష్యాల మధ్య ఘర్షణ జరిగినా నాటో రంగప్రవేశం జరుగుతుంది. తద్వారా అణ్వాయుధ సంపత్తి కలిగిన నాటో, రష్యాల మధ్య అణుయుద్దం తప్పని పరిస్థిత ఏర్పడుంది. ఆ విషయాన్నే పుతిన్ ఉటంకించారు.

నిజానికి అణ్వాయుధాల ముప్పు ఎంత భయానకమైనదంటే, అణు యుద్దమే జరిగితే ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. భూమ్మీద మానవజాతి అరుదుగా మిగిలిపోతుంది. అయితే ఇప్పటిదాకా ప్రపంచంలో ఒకే ఒక్కసారి ఒక దేశం మరో దేశంపై స్వల్ప వ్యవధిలో రెండు సార్లు అణ్వాయుధాలతో దాడి చేసింది. దాని ప్రభావం 70ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతోంది..

Ukraine Crisis: ఉక్రెయిన్ వీడాలంటూ భారతీయులకు సూచన.. కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయం ప్రకటన2బాంబులతో 2లక్షల మరణాలు.. ఏడు తరాల వెతలు
-రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, అమెరికా 1945, ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు వేసింది.
-మరో మూడు రోజులకే, అంటే, 1945, ఆగస్టు 9న అదే అమెరికా అదే జాపాన్ లోని నాగసాకి నగరంపై రెండో అణుబాంబు దాడి చేసింది.
-అణుబాంబులు వేసిన తర్వాతే జపాన్ అమెరికాకు లొంగిపోయింది. అయితే, జపాన్‌లో అణువిధ్వంస ప్రభావం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.
-యుఎస్ వార్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం, హిరోషిమాపై అణుబాంబు వేసినప్పుడు ఆ నగరంలోని సగం మంది జనాభా(1.35లక్షల మంది) చనిపోయారు. నాగసాకిలో 64వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇతర నివేదికలు మరణాల సంఖ్యను 2.5లక్షలుగా చెబుతాయి.
-అమెరికా జపాన్‌పై వేసిన రెండు అణుబాంబుల వల్ల ఆ రెండు నగరాల్లో 70% కంటే ఎక్కువ భవంతులు ధ్వంసమైపోయాయి.
-అణుబాంబులు వేసిన తర్వాత జపాన్ లో రేడియేషన్ వల్ల ప్రజలు దీర్ఘకాలిక ప్రభావాలకు లోనయ్యారు. ఆ రెండు నగరాల్లో తర్వాతి కాలంలో పుట్టిన పిల్లు కూడా లోపాల బారిన పడ్డారు.

Delhi: వాడు మనిషికాదు కామపిశాచి! -మంచానికే పరిమితమైన 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారంవిధ్వంసాన్ని ఎవరూ అడ్డుకోలేరు..
70 ఏళ్ల కిందట జపాన్ పైకి అమెరికా జారవిడిన ఆటంబాంబుల్లో నాగసాకిపై వేసిన బాంబు పరిమాణం 21కిలోటన్నులుకాగా, హిరోషిమాపై వేసిన బాంబు 15కిలోటన్నులది. ఆ మాత్రం పరిమాణాలకే జపాన్ లోని రెండు నగరాలు నాశనమైపోతే.. ప్రస్తుత(2022) సమయంలో ప్రపంచ దేశాల వద్ద వేలాది కిలోటన్నుల అణ్వాయుధాలున్నాయి. ఓ నివేదిక ప్రకారం అణ్వస్త్రసామర్థ్యం కలిగిన టాప్ 9 దేశాల వద్దే 13,150 అణ్వాయుధాలున్నాయి. వాటిల్లో 3,650 బాంబులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులోనూ 2 వేల అణ్వాయుధాలను హై అలర్ట్‌లో ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడుగానీ అణుయుద్ధం వస్తే ప్రపంచ విధ్వంసాన్ని ఎవరూ అడ్డుకోలేరు.
Published by:Madhu Kota
First published:

Tags: International news, Russia, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు