టోక్యో ఒలింపిక్స్‌కు ముందు కలకలం రేగింది. నల్లజాతి స్విమ్మర్లు ధరించే స్విమ్మింగ్ సౌల్ క్యాప్‌లపై అంతర్జాతీయ స్విమ్మింగ్ ఫెడరేషన్ (ఫినా) నిషేధం విధించింది. ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వర్ణ వివక్ష ఆరోపణలు మొదలయ్యాయి. ఈ విషయం చినికిచినికి గాలివానగా మారి వివాదానికి దారి తీసింది. అయితే బ్లాక్ స్మిమ్మర్లు ధరించే క్యాప్‌లపై ఫినా ఎందుకు నిషేధం విధించింది..? స్విమ్మర్లు ఈ క్యాప్‌లను ఎందుకు వాడతారు..?
జుట్టు నల్లగా, పొడవుగా, ఒత్తుగా ఉన్న నల్లజాతి స్విమ్మర్ల కోసం బ్రిటన్‌కు చెందిన సౌల్క్యాప్ అనే సంస్థ స్మిమ్మింగ్ క్యాప్‌లను తయారు చేస్తోంది. నల్లజాతి వారి జుట్టు ఎక్కువ పొడిగా ఉంటుంది. జుట్టులోని కొన్ని కణాల పొరలే ఇందుకు కారణం. దీంతో స్విమ్మింగ్ చేసే సమయంలో సోడియం హైపోక్లోరైట్, బ్లీచ్ నీళ్లలో ఉండడంతో నల్లజుట్టుకు నష్టం వాటిల్లుతుంది. వెంట్రుకలు రాలడం తదితరాలుగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నల్లజాతి స్విమ్మర్లు సౌల్ క్యాప్‌లను ధరిస్తారు. అలాగే పొడవుగా ఉండే జట్టు స్మిమ్ చేస్తున్న సమయంలో అడ్డు రాకుండా కూడా ఈ క్యాప్‌లు ఉపయోగపడతాయి. అయితే ఈ సౌల్ క్యాప్‌లనే ధరించకూడదని ఫినా నిబంధన తెచ్చింది.
నిషేధం ఎందుకు?
వివిధ రకాల సైజులో, సదుపాయాలు ఉన్న క్యాప్‌లను అంతర్జాతీయ టోర్నీల్లో స్విమ్మర్లు వాడకూడదని, అసలు వాటి అవసరమే లేదని అంతర్జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య (ఫినా) అభిప్రాయపడింది. సాధారణ తలలకు ఇది ధరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని, అందుకే నిషేధం విధిస్తున్నామని చెప్పుకొచ్చింది.
ఫినా చేసిన ఈ ప్రకటనతో అథ్లెట్లతో పాటు పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకల్ స్థాయిలో పోటీ పడుతున్న నల్లజాతి అథ్లెట్లను కూడా నిరాశ పరిచేలా క్యాప్‌ల నిషేధ నిర్ణయం ఉందని, దీనిద్వారా కొందరు స్విమ్మింగ్‌కు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుందని సౌల్క్యాప్ కంపెనీ అభిప్రాయపడింది. అలాగే దేశానికి, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి కూడా ఈ నిషేధం నష్టం చేకూరుస్తుందని వెల్లడించింది. అలాగే అథ్లెట్లు సైతం కొందరు గళం విప్పారు. దీంతో సౌల్క్యాప్ల నిషేధం విషయాన్ని సమీక్షిస్తామని ఫినా వెల్లడించింది. ప్రత్యేకతను, ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని ప్రకటించింది.
పొడవుగా, ఒత్తుగా, ఉంగరాల జట్టు ఉన్న వారి కోసం ఈ సౌల్క్యాప్లు చాలా పెద్దగా, అనుకూలంగా ఉంటాయి. స్విమ్ చేసే సమయంలో వెంట్రుకలు అడ్డురాకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. అలాగే నల్లజుట్టు పొడిగా ఉంటుండడంతో నీటిలో ఉండే సోడియం హైపోక్లోరైట్, బ్లీచ్ వల్ల జట్టు దెబ్బతినకుండా రక్షిస్తుంది. కౌకాషియన్ (గోధుమ రంగు) జట్టు ఉండే వారిని దృష్టిలో ఉంచుకొని స్పీడో 50 అనే సంస్థ స్విమ్మింగ్ క్యాప్‌లను తయారు చేస్తుంది. చాలా మంది వీటిని వాడతారు. కౌకాషియన్ క్యాప్‌లపై నిషేధం లేదు. అయితే ఎక్కువ జట్టు ఉండే నల్ల వెంట్రుకలు ఉన్న వారికి ఇవి సూటుకావని కొందరు చెబుతున్నారు. “కౌకాషియన్ లాంటి క్యాప్స్లు ఆఫ్రో (నల్ల) హెయిర్‌కు పనికి రావు. క్యాప్‌లో ఎక్కువ స్థలం, ఎక్కువ వాల్యూమ్ ఉండాలి. సౌల్క్యాప్లా ఉండాలి” అని బ్లాక్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఫౌండింగ్ మెంబర్ డానిలీ ఒబె చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tokyo Olympics