Modi in USA: అమెరికా పర్యటనలో మోదీ ప్రిడేటర్ డ్రోన్స్‌పై ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? వాటివల్ల భారత్‌కు ఉపయోగం ఏంటి..?

ప్రధాని మోదీ ఆసక్తి చూపిస్తున్న ప్రిడేటర్ డ్రోన్ వల్ల ఉపయోగం ఏమిటి? (ప్రతీకాత్మక చిత్రం)

ప్రధాని కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ ప్రిడెటర్ డ్రోన్స్‌ను అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను పట్టుకునేందుకు ఉపయోగించారు.

  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా పర్యటన (America Tour) కొనసాగుతోంది. ఈ పర్యటనలో మోదీ రక్షణ, భద్రత, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన తదితర అంశాల గురించి అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Haris) లతో చర్చలు జరుపుతున్నారు. అలాగే భారతదేశ సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌ల కొనుగోళ్లకు 3 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ ఓ యూఎస్ విమాన తయారీ కంపెనీ సీఈఓని కలిశారు.

ప్రధాని కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ ప్రిడెటర్ డ్రోన్స్‌ను అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ను పట్టుకునేందుకు ఉపయోగించారు. ఇరాక్ దేశ జెట్‌ల ఘర్షణలోనూ వీటినే యూజ్ చేశారు. సైనిక సిబ్బందికి హాని తలపెట్టకుండా నిఘా వేయడానికి.. స్ట్రైక్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మిలిటరీ డ్రోన్‌లను అత్యంత శక్తివంతంగా తయారుచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే యుద్ధ సంబంధిత మిలిటరీ డ్రోన్‌లు స్మార్ట్, ఎఫెక్టివ్ గా అభివృద్ధి చెందాయి. ఇలాంటి ప్రిడేటర్ డ్రోన్లు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం కొనుగోలు చేయాలనేది మోదీ యూఎస్ పర్యటన ఎజెండాలో ఒక భాగం.

* భారతదేశం డ్రోన్స్ డీల్ వివరాలు ఏంటి?
30 డ్రోన్‌లు లేదా రిమోట్‌గా పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లను (ఆర్‌పిఎఎస్) కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తున్నట్లు మార్చి 2021లో నివేదికలు పేర్కొన్నాయి. మానవరహిత వైమానిక యుద్ధ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చాయి. ఇండియా కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రిడేటర్ MQ-9B సిస్టమ్ ను శాన్ డియాగో ఆధారిత జనరల్ అటామిక్స్(San Diego-based General Atomics) తయారు చేసింది. దీనికి భారత సంతతికి చెందిన సీఈఓ వివేక్ లాల్ నాయకత్వం వహిస్తున్నారు.

అడ్వాన్సుడ్ సిస్టమ్స్, వెపన్స్ ప్యాకేజీతో సుదూర ప్రాంతాలపై నిఘా వేయగల, గురితప్పని దాడులు చేయగల డ్రోన్‌ల కోసం భారత్ 3 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుందని సమాచారం. విమానం నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి సంబంధించి ఈ డీల్‌పై భారత్ మరింత స్పష్టత కోరుతున్నట్లు తెలిసింది. యూఎస్ కంపెనీలు, యూఎస్ కంపెనీలలోని తన సహచరులు భారతదేశాన్ని డ్రోన్ల తయారీకి గమ్యం మంచి గమ్యస్థానంగా భావిస్తున్నారని సీఈఓ వివేక్ లాల్ తెలిపారు.

భారతదేశం డ్రోన్ షాపింగ్ లిస్టులో MQ-9B సీగార్డియన్/స్కైగార్డియన్ వేరియంట్‌లు ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒక్కొక్కటి 10 డ్రోన్స్ పొందనున్నారని సమాచారం. భారత నావికాదళం ఇప్పటికే యూఎస్ నుంచి గతేడాది లీజుకు తీసుకున్న రెండు నిరాయుధ సీగార్డియన్ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. వీటిని హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నారు.

* ప్రిడేటర్ MQ-9B అంటే ఏమిటి?
మొదటి ప్రెడేటర్ డ్రోన్‌ను 90ల కాలంలోనే ప్రయోగించారు. వీటిని 1997 నాటికి ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఈ డ్రోన్‌లకు నిఘా సమాచారాన్ని అందించే వ్యవస్థను చంపే సామర్థ్యం ఉండేలా అభివృద్ధి చేయాలని భావించినట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రిడేటర్ సిస్టమ్ లో అనేక వెర్షన్‌లు, అప్‌డేట్‌లు వచ్చాయి. 9/11 దాడుల కంటే ముందుగానే ఈ డ్రోన్స్ అందుబాటులోకి వచ్చాయి. 1995లో నాటో, యూఎన్, యూఎస్ కి మద్దతుగా బోస్నియాలో ఇవి తమ సేవలను అందించారు. తొలుత నిఘా వ్యవస్థలుగా పనిచేసిన ఇవి 2005 నాటికి, లక్ష్యాలను దెబ్బతీసే సామర్ధ్యాన్ని పొందాయి. అఫ్ఘనిస్తాన్, ఇరాక్ దేశాల్లోనూ వీటిని ఉపయోగించారు. మొట్టమొదటి ప్రిడేటర్ సిస్టమ్‌లను RQ గా అభివర్ణించారు. ఇక్కడ 'R' అనేది 'నిఘా'ని సూచిస్తే.. 'Q'ను రిమోట్‌గా పైలట్ విమాన వ్యవస్థ సూచిస్తుంది. 2002లోనే రెండు పనులను చేయగల డ్రోన్స్ అందుబాటులోకి వచ్చాయి.

* ఈ డ్రోన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ డ్రోన్‌లు చాలా తెలివైనవి. ఇవి నిఘా వేయడంతో పాటు నిఘా కార్యకలాపాలను చేపట్టగలవు. యుద్ధ అన్వేషణ, రక్షణ అందించడంతో సహా కచ్చితమైన దాడులను నిర్వహించగలవు. ఇవి కాన్వాయ్‌ల కదలికను పర్యవేక్షించడానికి.. నిర్దిష్ట లక్ష్యాలు నిక్కచ్చిగా స్ట్రైక్స్ చేయడంలో సహాయపడతాయి. ఇవి మానవరహిత యుద్ధ పరికరాలే కానీ వాటి పనితీరు ఇతర యుద్ధ పరికరాలను కూడా అద్భుతంగా ఉంటుంది. జనరల్ అటామిక్స్ ప్రకారం, ఈ డ్రోన్లు 40 గంటల ఎగరగలవు. 40,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తును చేరుకోగలవు. దీని పొడవు 38 అడుగులు, దాని రెక్కల పొడవు 79 అడుగులు. ఈ డ్రోన్ నాలుగు హెల్‌ఫైర్ II యాంటీ-ఆర్మర్ క్షిపణులు, రెండు లేజర్-గైడెడ్ బాంబులను మోసుకెళ్లగలదు.

* ఏ దేశాల వద్ద ఈ డ్రోన్లు ఉన్నాయి?
నివేదికల ప్రకారం, యూఎస్, ఇజ్రాయెల్, యూకే, పాకిస్తాన్, ఇరాన్, టర్కీ, రష్యా సహా అనేక దేశాలు ఈ డ్రోన్‌లను కలిగి ఉన్నాయి. డ్రోన్‌లను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలలో భారతదేశం ఉందని నివేదికలు వచ్చాయి. కానీ ఇండియాకి సొంత డ్రోన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ ఉంది. అలాగే ఇండియా నవంబర్ 2016లో, రుస్తుమ్-2 అనే మీడియం-అల్టిట్యూడ్ , లాంగ్-ఎండ్యూరన్స్ (MALE) డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది.

* ఈ ప్రిడేటర్ డ్రోన్ భారతదేశానికి ఎలా సహాయం చేస్తుంది?
ఉగ్రవాదుల డ్రోన్స్ పసిగట్టడానికి ఈ ప్రిడేటర్ డ్రోన్లు ఉపయోగించవచ్చు. లెఫ్ట్-వింగ్ ఎక్స్‌ట్రీమిజం (LWE) ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌లు కూడా ఉపయోగించవచ్చు.
Published by:John Naveen Kora
First published: