Shirt Buttons: చొక్కా గుండీలు పురుషులకు కుడి వైపున.. మహిళలకు ఎడమవైపున ఉంటాయి.. ఎందుకో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం (Image Credit : Youtube)

Shirt Buttons: ఎన్ని విషయాలు తెలిసినా.. కొత్తవి తెలుసుకోవాలనే ఆరాటం సగటు మానవుడికి ఉంటుంది. తెలిసిన విషయాలను ఇతరులకు చెబుతూ.. కొత్త విషయాలను ఇతరుల నుంచి గ్రహిస్తాడు. అయితే జీవన గమనంలో మనం అలవాటులో ఎన్నో చేస్తుంటాం. అలాంటి వాటిలో మనం ఇక్కడ ఒకటి తెలుసుకోబోతున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  ఎన్ని విషయాలు తెలిసినా.. కొత్తవి తెలుసుకోవాలనే ఆరాటం సగటు మానవుడికి ఉంటుంది. తెలిసిన విషయాలను ఇతరులకు చెబుతూ.. కొత్త విషయాలను ఇతరుల నుంచి గ్రహిస్తాడు. అయితే జీవన గమనంలో మనం అలవాటులో ఎన్నో చేస్తుంటాం. కానీ వాటిని అలా ఎందుకు చేస్తామో తెలియదు. చిన్నతనం నుంచి ఇలానే ఉంటుంన్నాం కాబట్టీ.. వాటి గురించి పెద్దగా పట్టించుకోం. ఆ కోవలోకే చెందుతుంది ఇప్పుడు మనం చెప్పుకునేది. మగవాళ్లు సాధారణంగా టీషర్ట్ (T Shirt) ధరిస్తారు.. షర్ట్స్(Shirt) కూడా ధరిస్తారు. పూర్వం అయితే పురుషులు ధోతి కుర్తా, మహిళలు అయితే చీరలు ధరించేవారు. ప్రస్తుతం పాశ్చ్యాత్య సంస్కృతి అలవాటై పోయింది. మగవాళ్ల కంటే కూడా.. ఆడవాళ్లు జీన్స్ లు, షర్ట్స్ వేసుకుంటున్నారు.

  Height Growth Tips: పొట్టిగా ఉన్నారని బాధపడుతున్నారా.. అయితే వీటిని పాటిస్తూ ఎత్తు పెరగండి..


  మారుతున్న కాలంతో పాటు చాలా విషయాల్లో మార్పు వచ్చింది. ఫ్యాషన్ పరిశ్రమ వచ్చిన తరువాత దుస్తుల రంగు, వాటి శైలి, వాటిని ధరించే పద్దతి అన్నీ మారిపోయాయి. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళలకు వివిధ రకాల దుస్తులు ఎంచుకుంటే, పురుషులకు కూడా అనేక రకాల దుస్తులు ఉంటున్నాయి. ఈ రోజు దుస్తులకు సంబంధించి ఫ్యాషన్ షోలు కూడా నిర్వహిస్తున్నారు.

  ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయిస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే.. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. దుస్తులు ధరించేటప్పుడు లేదా కొనేటప్పుడు మహిళల షర్ట్ బటన్స్ ఎల్లప్పుడు ఎడమ వైపున ఉంటాయి. పురుషుల షర్ట్ బటన్స్ కుడి వైపున ఉంటాయి. అయితే ఇవి అలా ఎందుకు ఉంటాయో చాలామందికి తెలియదు.

  Fridge-Free Insulin: ఫ్రిజ్‌తో పని లేకుండా ఇన్సులిన్‌ వాడొచ్చు.. సైంటిస్టుల మరో ఆవిష్కరణ..


  కొన్నామా.. ధరించామా.. ఆ రోజు అలా గడిచిపోయిందా అన్నట్లే ఉంటాం. కానీ దాని గురించి ఎన్నడూ ఆలోచించి ఉండం. అయితే ఇలా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయట.. ఒక ప్రసిద్ధ సిద్ధాంతం ప్రకారం.. పూర్వకాలంలో పురుషులు ఆయుధాలను చేపట్టడానికి వీలుగా ఉండటానికి చొక్కా బటన్లు కుడి వైపున అమర్చారు. మహిళలు గుర్రపు స్వారీ చేసే టైంలో ఎదురుగా వచ్చే గాలితో ఇబ్బంది పడేవారు. అయితే బటన్లను ఎడమవైపుకు పెట్టడం వల్ల గాలితో వారి చొక్కా ఒంటికి అమరినట్టు ఉండేది. దీంతో వారికి సౌకర్యంగా ఉండేది.

  ఇలా ఒక సిద్దాంతం ప్రకారం చెబితే.. మరో సిద్దాంతంలో .. పూర్వ కాలం సామాన్య ప్రజలు ధనవంతుల వలె దుస్తులు ధరించాలని కోరుకునేవారు. ఆ సమయంలో ధనిక మహిళల చొక్కాలకు ఎడమ వైపున బటన్లు ఉండేవి. ఈ పద్దతి ప్రజలను ఆకర్షించింది. దీంతో మహిళలందరూ అలాగే దుస్తులు ధరించడం ప్రారంభించారు.

  Sleep For Six Hours: రోజూ మీరు 6 గంటలు నిద్ర పోవడం లేదా..? అయితే ఈ విషయాలను తెలుసుకోండి..


  ఇది ఒకరిని చూసి ఒకరు అనుకరించుకుంటూ వస్తున్నదే అని చెబుతారు. మరి కొంత మంది ఇలా కూడా చెబుతున్నారు.. మగవాళ్లకు చొక్కాలకు కుడివైపు బటన్లు పెట్టడం ఎందుకంటే.. జనాభాలో ఎక్కువ శాతం మందిది కుడి చేయి వాటమే ఉంటుంది. కుడి వైపు బటన్లు ఉంటే గుండీలను పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకే మగవాళ్లకు కుడి వైపు బటన్లు కుట్టేవారు.

  ఇక ఆడ వాళ్ల విషయానికొస్తే.. మగవాళ్ల చొక్కాల నుంచి వేరుగా చూపించడానికి మహిళల చొక్కాలకు ఎడమ వైపు బటన్లు కుట్టేవారు. ఇదే తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. జనాలకు అలా అలవాటైపోయిందన మరో వాదన. అయితే దీనికి బలమైన కారణం అంటూ ఏది లేదు కానీ.. వాటిని అలా అనుసరించుకుంటూ వస్తున్నారు. కొన్ని అలవాట్లను ఇలా మనకు తెలియకుండానే పాటిస్తూ ఉంటుంన్నాం.
  Published by:Veera Babu
  First published: