హోమ్ /వార్తలు /Explained /

Russia: మే 9 రష్యాకు ఎందుకు ప్రత్యేకం..? ఆరోజే పుతిన్ యుద్ధ ప్రకటన ఎందుకు చేయాలనుకుంటున్నారు..?

Russia: మే 9 రష్యాకు ఎందుకు ప్రత్యేకం..? ఆరోజే పుతిన్ యుద్ధ ప్రకటన ఎందుకు చేయాలనుకుంటున్నారు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రష్యా (Russia) ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది. అయితే ఆ దాడులను ‘స్పెషల్‌ మిలిటరీ ఆపరేషన్‌’గా (Special Military Operation) రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. యుద్ధం చేస్తున్నట్లు అధికారికంగా పేర్కొనలేదు.

రష్యా (Russia) ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది. అయితే ఆ దాడులను ‘స్పెషల్‌ మిలిటరీ ఆపరేషన్‌’గా (Special Military Operation) రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. యుద్ధం చేస్తున్నట్లు అధికారికంగా పేర్కొనలేదు. అయితే మే 9న రష్యా పంథా మారవచ్చని, అధికారికంగా యుద్ధ ప్రకటనతో పుతిన్(Putin) తన వ్యూహాలను వేగవంతం చేసేందుకు మార్గం సుగమం అవుతుందని పాశ్చాత్య దేశాల అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు.

మే 9 ప్రత్యేకత ఏంటి?

మే 9వ తేదీన రష్యాలో "విక్టరీ డే"(Victory Day) నిర్వహిస్తారు. 1945లో నాజీలను ఓడించినందుకు జ్ఞాపకార్థంగా రష్యాలో ఈ వేడుక జరుపుతారు. ఈ సందర్భంగా మాస్కోలో సైనిక కవాతు నిర్వహిస్తారు. రష్యన్ నాయకులు సాంప్రదాయకంగా రెడ్ స్క్వేర్‌లోని వ్లాదిమిర్ లెనిన్ సమాధిపై నిలబడి కవాతును వీక్షిస్తారు. చాథమ్ హౌస్‌లోని రష్యా-యురేషియా ప్రోగ్రామ్ డైరెక్టర్ జేమ్స్ నిక్సీ CNNతో మాట్లాడుతూ..మే 9వ తేదీని దేశ ప్రజలకు నమ్మకం కలిగించడానికి, ప్రతిపక్షాలను భయపెట్టడానికి, ఆ కాలపు నియంతను సంతోషపెట్టడానికి నిర్వహిస్తారని చెప్పారు. ఉక్రెయిన్‌లో సైనిక విజయాన్ని ప్రకటించడానికి పుతిన్ విక్టరీ డే సందర్భాన్ని ఉపయోగించుకుంటారని పాశ్చాత్య అధికారులు నమ్ముతున్నారు. రష్యాలో మరో కీలకమైన సైనిక దినోత్సవం అయిన డిఫెండర్ ఆఫ్ ఫాదర్‌ల్యాండ్ డే మరుసటి రోజు ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు దండయాత్ర ప్రారంభించేందుకు ఆసక్తి చూపారు.

UK Vs Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. యూకేపై అణు దాడి చేయాలని వ్యాఖ్యానించిన రష్యన్ స్టేట్ మీడియా..


సమీకరణకు సిద్ధమవుతున్నారా?

పుతిన్ టేబుల్‌పై చాలా ఆప్షన్లు ఉన్నాయని, అందులో యుద్ధం ప్రకటించడం అత్యంత కఠినమైన నిర్ణయమని క్రైసిస్ గ్రూప్‌లో రష్యా సీనియర్ విశ్లేషకుడు ఒలేగ్ ఇగ్నాటోవ్ చెప్పారు. రష్యాపై అధికారికంగా యుద్ధం ప్రకటించని ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఫిబ్రవరి చివరలో రష్యా దాడి ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు.

పుతిన్ ముందు ఉన్న మరో అవకాశం రష్యా సమీకరణ చట్టాన్ని అమలు చేయడం. ఇది సాధారణ లేదా పాక్షిక సైనిక సమీకరణను ప్రారంభించడానికి ఉపయోగపడుతుంది. రష్యన్ ఫెడరేషన్‌పై దూకుడు, ప్రత్యక్ష ముప్పు, రష్యన్ ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటాల వ్యాప్తి వంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఇది ప్రభుత్వం సైనికులను సమీకరించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యన్ దళాలు కనీసం 15,000 మంది సైనికులను కోల్పోయాయి. ఉక్రెయిన్‌లో మాస్కో తన లక్ష్యాలను సాధించాలంటే ఇంకా సైనికులు అవసరమవుతారు. సమీకరణ అంటే ప్రస్తుతం సాయుధ దళాలలో ఉన్న సైనికులకు నిర్బంధాన్ని పొడిగించడం, రిజర్వ్‌లను పిలవడం లేదా సైనిక శిక్షణ పొందిన పోరాట వయస్సు గల పురుషులను తీసుకురావడం అని ఇగ్నాటోవ్ చెప్పారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఆ చట్టం అమలు పుతిన్ ప్రభుత్వానికి పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుంది. మొత్తం క్రెమ్లిన్ కథనాన్ని మారుస్తుంది. ఉక్రెయిన్ దాడి ప్రణాళిక ప్రకారం జరగలేదని పుతిన్‌ అంగీకరించేలా చేస్తుంది. ఇది చాలా ప్రమాదకర నిర్ణయం. పూర్తి స్థాయి సమీకరణ రష్యా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. అదనంగా, కొంతమంది రష్యన్లు వ్యక్తిగతంగా వెళ్లి పోరాడాలని కోరుకోకుండా ఉక్రెయిన్ ఆక్రమణకు మద్దతు ఇస్తున్నందున పుతిన్‌కు మద్దతును తగ్గిస్తుంది. వారు పూర్తి స్థాయి సమీకరణను ప్రకటిస్తే కొంతమందికి అది ఇష్టం ఉండదు. ఉక్రెయిన్‌పై అధికారికంగా యుద్ధం ప్రకటించకుండానే పుతిన్ సమీకరణ చట్టాన్ని అమలు చేయడం ఇప్పటికీ సాధ్యమవుతుంది. పుతిన్ రష్యాలో యుద్ధ చట్టాన్ని కూడా విధించవచ్చు. ఎన్నికలను నిలిపివేయవచ్చు. తన చేతుల్లో అధికారాన్ని మరింత కేంద్రీకరించవచ్చు.’ అని విశ్లేషించారు.

Smart Bomb: కొత్త షిప్ కిల్లింగ్ స్మార్ట్ బాంబ్‌ను పరీక్షించిన యూఎస్‌.. ఈ బాంబ్ ఎలా పనిచేస్తుందంటే..


ఇంకా ఏం జరగవచ్చు?

పుతిన్ యుద్ధం ప్రకటించకపోతే, విక్టరీ డే రోజును గుర్తుచేసుకోవడానికి మరో కీలక ప్రకటన ఏదైనా చేసే అవకాశం ఉంది. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డొనెట్స్క్ విడిపోయిన భూభాగాలను కలుపుకోవడం, దక్షిణాన ఒడెసా కోసం లేదా దక్షిణ ఓడరేవు నగరం మారియుపోల్‌పై పూర్తి నియంత్రణను ప్రకటించడం వంటివి ఉన్నాయి. ఆగ్నేయ నగరమైన ఖెర్సన్‌ను రష్యా "పీపుల్స్ రిపబ్లిక్"గా ప్రకటించి, కలుపుకోవాలని యోచిస్తున్నట్లు కూడా సూచనలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం కొన్ని విజయాలు సాధించిందని పుతిన్ ప్రకటించగలరని ఇగ్నాటోవ్ తెలిపారు. అయితే రష్యా, అధ్యక్షుడు ఏం చేస్తారో ఊహించడం కష్టం.

US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ సోమవారం మాట్లాడుతూ.. ‘ప్రచార ప్రయోజనాల కోసం మే 9న రష్యన్‌లు తాము చేయగలిగినదంతా చేస్తారు. ఉక్రెయిన్‌లోని యుద్దభూమిలో వారి వ్యూహాత్మక వైఫల్యాల నుండి దృష్టి మరల్చడానికి ప్రచార ప్రయత్నాలను రెట్టింపు చేయడాన్ని మేము చూశాం’ అని చెప్పారు.

First published:

Tags: Explained, Russia, Russia-Ukraine War

ఉత్తమ కథలు