Home /News /explained /

WHY IS TURKEY AGAINST SWEDEN FINLAND JOINING NATO FULL DETAILS HERE TO KNOW GH VB

Explained: స్వీడన్‌, ఫిన్‌లాండ్‌ నాటోలో చేరడాన్ని టర్కీ ఎందుకు వ్యతిరేకిస్తోంది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడు నెలలకు చేరుకుంది. చారిత్రాత్మకంగా సైనిక పొత్తులకు దూరంగా ఉన్న రెండు నార్డిక్ దేశాలు స్వీడన్, ఫిన్‌లాండ్‌ అధికారికంగా నార్త్‌ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(NATO)లో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడు నెలలకు చేరుకుంది. చారిత్రాత్మకంగా సైనిక పొత్తులకు దూరంగా ఉన్న రెండు నార్డిక్ దేశాలు స్వీడన్, ఫిన్‌లాండ్‌ అధికారికంగా నార్త్‌ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(NATO)లో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాయి. రష్యా చుట్టుపక్కల నాటో విస్తరణకు వ్యతిరేకంగా, నాటోలో చేరే యత్నాలు చేస్తున్నందుకు ఉక్రెయిన్‌పై ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24న దాడులకు ఆదేశించగా.. ఇప్పుడు రెండు దేశాలు నాటోలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ నాటోలో వాటి చేరిక సజావుగా ఉండకపోవచ్చు. నార్డిక్‌ దేశాల(Nordic Countries) చేరికను 1952 నుంచి నాటో సభ్యదేశమైన టర్కీ(Turkey) వ్యతిరేకిస్తామని పేర్కొంది. ఆ రెండు దేశాలు ఉగ్రవాద సమూహాలకు ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆరోపిస్తోంది. కుర్దిష్ తిరుగుబాటుదారులకు ఉదాహరణగా సూచిస్తోంది.

దీర్ఘకాలికంగా తటస్థంగా ఉన్న స్వీడన్(Sweden), ఫిన్‌లాండ్‌(Finland) ఏం సూచిస్తున్నాయి?
స్వీడన్ చివరి యుద్ధం 1814లో జరిగింది. అది స్వీడిష్ నార్వేజియన్ యుద్ధం. ఆరేళ్ల క్రితం రష్యా బాల్టిక్ సముద్రంలోని గాట్‌లాండ్ ద్వీపాన్ని ఆక్రమించింది. స్వీడన్లు రష్యన్లను ద్వీపం నుంచి తరిమేశారు.. తరవాతు రష్యన్‌లు ఫిన్‌లాండ్‌ను స్వీడన్ నుంచి దూరంగా తీసుకువెళ్లారు. స్వీడిష్- నార్వేజియన్ యుద్ధం తరువాత, స్వీడన్ తన విదేశాంగ విధానానికి మూలస్తంభంగా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకొంది.

ఫిన్‌లాండ్‌ చరిత్ర మరింత క్లిష్టంగా మారింది. సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ 1939లో ఫిన్‌లాండ్‌పై దండెత్తాడు. స్టాలిన్ కోరిన దానికంటే ఎక్కువ భూభాగాలను ఫిన్‌లాండ్‌ కోల్పోయింది. కానీ ఒక సంవత్సరం తరువాత ఫిన్‌లాండ్‌, జర్మన్ నాజీలతో చేతులు కలిపి సోవియట్ యూనియన్‌పై దాడి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఓడిపోయిన తర్వాత మాత్రమే సుదీర్ఘ సోవియట్-ఫిన్‌లాండ్‌ సరిహద్దుకు శాంతి తిరిగి వచ్చింది. రెండు యుద్ధాల అనంతర ప్రభావాలను చవిచూసిన ఫిన్‌లాండ్ మరో పోటీలోకి దిగాలని కోరుకోలేదు. 19వ శతాబ్దపు స్వీడన్ తరహాలోనే ఫిన్‌లాండ్‌ కూడా తన తటస్థంగా ఉండాలని విదేశాంగ విధానాన్ని స్వీకరించింది.

Viral Video : దళితుడి నోట్లోని ఆహారాన్ని తీసి తిన్న ఎమ్మెల్యే

స్వీడన్‌ NATOలో ఎందుకు చేరాలని భావిస్తోంది?
ఉక్రెయిన్‌పై యుద్ధానికి పుతిన్‌కు ఏ కారణాలు అయినా ఉండవచ్చు. దండయాత్ర రష్యా తన పొరుగున ఉన్న బలహీనమైన దేశం సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని చూసింది. ఉక్రెయిన్ NATOలో చేరిన ఉండి ఉంటే రష్యా యుద్ధాన్ని ప్రారంభించేదా? అనే ప్రశ్నలు కూడా లేవనెత్తింది. ఉక్రెయిన్‌లా కాకుండా, స్వీడన్, ఫిన్‌లాండ్‌లకు రష్యాతో సరిహద్దు వివాదం లేదు. 2014లో కీవ్‌లో పాలన మారే వరకు రష్యాతో ఉక్రెయిన్‌కు పెద్దగా విభేదాలు లేవు. ఈ పరిణామాలను చూసిన స్వీడన్‌ భద్రతా సమీకరణాలతో NATO సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే స్వీడన్, ఫిన్‌లాండ్‌లు పశ్చిమ దేశాలతో లోతైన సంబంధాలను పెంచుకున్నాయి. రష్యా సైనిక ప్రతీకారానికి అవకాశం ఇప్పుడు చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే రష్యా దళాలు ఉక్రెయిన్‌లో సుదీర్ఘమైన యుద్ధంలో పోరాడుతున్నాయి. ఈ పరిస్థితులు స్వీడన్‌కు నాటో తలుపులు తెరిచాయి.

టర్కీ ఎందుకు వ్యతిరేకం?
స్వీడన్‌ నాటోలో చేరే యత్నాలను వ్యతిరేకిస్తామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ పదేపదే చెప్పారు. NATOలో నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకొంటారు. అంటే 30 సభ్యుల కూటమిలోని ప్రతి దేశం వీటోను కలిగి ఉంటుంది. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ(PKK), పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్(YPG)కి సూచనగా స్వీడన్, ఫిన్‌లాండ్‌ "ఉగ్రవాద" గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నాయని టర్కీ చెప్పింది. టర్కీలోని కుర్దిష్ మైనారిటీకి ఎక్కువ స్వయంప్రతిపత్తిని కోరుతున్న PKK, 1980ల మధ్యకాలం నుంచి సాయుధ తిరుగుబాటును చేపట్టింది. YPG అనేది సిరియన్ కుర్దిస్తాన్ సాయుధ విభాగం, ఇది సిరియాలోని కుర్దిష్ ప్రాంతంలోని భాగాలను నియంత్రిస్తుంది. కుర్దిష్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి టర్కీ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది.

ఇటీవలి సంవత్సరాలలో, మిస్టర్ ఎర్డోగాన్ ప్రభుత్వం వామపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (HDP)తో సహా కుర్దిష్ రాజకీయ సమూహాలు, నాయకులపై విరుచుకుపడింది. మాజీ శాసనసభ్యుడు, అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి అయిన ఒక ఆకర్షణీయమైన కుర్దిష్ రాజకీయ నాయకుడు సెలాహటిన్ డెమిర్టాస్ 2016 నుంచి జైలులో ఉన్నారు. PKK, YPG వాటి అనుబంధ రాజకీయ సమూహాలు "ఉగ్రవాదులు" అని పేర్కొంటూ టర్కీ తన చర్యలను సమర్థించుకుంది. స్వీడన్, ఫిన్‌లాండ్‌ కొంత వరకు కుర్దిష్ మిలీషియాలతో, ముఖ్యంగా YPGతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయని టర్కీ పేర్కొంది.

ALSO READ  Bharat Bandh : బిగ్ అలర్ట్..ఈ నెల 25న భారత్ బంద్!

ఏం జరగబోతోంది?
టర్కీ చర్యలు రెండు నార్డిక్ దేశాలను ఇబ్బందికరమైన ప్రదేశంలో వదిలేస్తాయి. వారు NATO రక్షణను పొందలేరు. దరఖాస్తు ఆమోదం పొందినప్పటికీ, అధికారికంగా కూటమిలోకి ప్రవేశించడానికి సమయం పడుతుంది. NATO చివరి విస్తరణ విషయంలో, మార్చి 2020లో ఉత్తర మాసిడోనియా కూటమిలోకి ప్రవేశించినప్పుడు, ప్రక్రియకు 20 నెలలు పట్టింది. 2017 జూన్‌లో NATO సభ్యుడిగా మారిన మాంటెనెగ్రో విషయంలో, ప్రక్రియ 18 నెలలు పట్టింది. ఈ జ్యాప్యంతో పుతిన్‌కు అవకాశం లభిస్తుంది. అతని సేనలు ఉక్రెయిన్‌లో తమ సైనిక లక్ష్యాలను చేరుకోవంపై తర్వాత చర్యలు ఆధారపడి ఉంటాయి.
Published by:Veera Babu
First published:

Tags: Finland, Russia, Sweden, Turkey, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు