Home /News /explained /

WHY INDIA FACING COAL SHORTAGE HOW WILL CHINA COAL CRISIS IMPACT IN BHARAT POWER AND OTHER TARIFF MAY INCREASE MKS

Explained: భారత్‌లోనూ బొగ్గు సంక్షోభం -చైనా తరహా చీకటి రోజులు? -విద్యుత్ చార్జీల బాదుడు, ఇంకా వీటిపై ఎఫెక్ట్

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

China coal crisis impact on India: బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనాలో విద్యుత్ కోతలు భారీగా అమలవుతున్నాయి. భారత్ లోనూ బొగ్గు కొరత ఏర్పడటంతో చైనా లాంటి పరిస్థితులే మన దగ్గరా ఉత్పన్నం కాబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బొగ్గు సంక్షోభం (coal crisis) ఇప్పుడు భారత్ ను కూడా చుట్టుముట్టింది. పొరుగు దేశం చైనాలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోయి, పరిశ్రమలతోపాటు ఇళ్లకు సైతం కరెంటు సరఫరా నిలిచిపోవడం, ఆ దేశంలోని మెజార్టీ ప్రాంతాలు దాదాపు చీకట్లోనే మగ్గుతున్న నేపథ్యంలో భారత్ లో ఇంకెలాంటి దుస్థితి తలెత్తుతుందోననే ఆందోళనలు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు సంక్షోభం తలెత్తినప్పటికీ, వినియోగం, ఉత్పత్తి పరంగా టాప్-2 దేశాలైన భారత్, చైనాలపైనే ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEA), కోల్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చెబుతోన్న లెక్కలు, దాని ప్రభావంతో దేశంలో చోటుచేసుకోడానికి అవకాశమున్న అంశాలు, తదితర వివరాలిలా ఉన్నాయి..

పారిశ్రామిక, గృహ అవసరాల కోసం భారత్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో 70 శాతం కంటే ఎక్కువ వాటా బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్ పవర్ దే అన్న సంగతి తెలిసిందే. ఎన్టీపీసీ( NTPC), టాటా పవర్ (TTPW), టొరెంట్ పవర్ (TOPO) ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని చిన్నా పెద్దా కలిపి 135 విద్యుత్ ప్లాంట్లు ఉండగా అవన్నీ ఇప్పుడు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. సెప్టెంబర్ చివరినాటికే 16 ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోగా, మిగతా వాటిలో 80 శాతం ప్లాంట్ల వద్ద వారానికి సరిపడా నిల్వలు కూడా లేవని సాక్ష్యాత్తూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEA)తెలిపింది.

చేతులు కాలాక ఆకులు?

పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి కొద్ది రోజుల్లో భారత్ అసాధారణ విద్యుత్ సంక్షోభాన్ని చవిచూడటం ఖాయం. అదే జరిగితే కరెంటుతో ముడిపడి ఉన్న అన్ని రకాల వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం, ప్రజలపై అధిక పన్నుల భారం తప్పదు. అసలు, సంప్రదాయ ఇంధన వనరుగా అత్యధికంగా వినియోగమయ్యే బొగ్గుకు సంబంధించి ఇంత పెద్ద సంక్షోభం ఎలా తలెత్తింది? పరిశ్రమలు, ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపేసేంత వరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? డిమాండ్, సప్లై సూత్రం బాగా తెలిసిన కార్పొరేట్లు కూడా కోల్ క్రైసిస్ ను పసిగట్టలేకపోయాయా? అనే ప్రశ్నలకు భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి.

ప్రతీకాత్మకచిత్రం


కరోనానే కారణం..

అందరూ అంగీకరిస్తోన్న, ప్రస్తుత బొగ్గు సంక్షోభానికి మూల కారణం మాత్రం కరోనా విలయమే. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత భారత్, చైనా సహా ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక విద్యుత్ కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పైగా, దేశీయంగా తక్కువ ధరలు ఉండటం, ప్రపంచ బొగ్గు ధరల మధ్య ధర వ్యత్యాసం పెరగడంతో కొనుగోలుదారులు దిగుమతులను తగ్గించుకున్నారు. ఇవన్నీ ప్రతికూలతలుగా మారాయిప్పుడు..

భారత్ లో బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న కోల్ ఇండియా తీసుకునే నిర్ణయాలు సంబంధిత అన్ని అంశాలపై ప్రభావం చూపుతుంది. కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు భారీగా పెరిగినప్పటికీ, కోల్ ఇండియా మాత్రం గత ఏడాది కాలంలో ధరలను స్థిరంగా ఉంచింది. ఇంతలోనే, ఆసియా బొగ్గు ధర ప్రమాణాలు ఇటీవలి కాలంలో రికార్డు స్థాయికి చేరాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆర్థిక కలాపాలు మళ్లీ వేగం పుంజుకోగానే విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన ఇంధనమైన బొగ్గు కోసం డిమాండ్ పెరిగింది.


ఆ మూడు దేశాలపై..

బొగ్గు వినియోగం, దిగుమతుల పరంగా భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. బొగ్గు రిజర్వుల పరంగా మనది నాలుగో స్థానం. భారత్ ప్రధానంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటుంది. చైనా చైనా కూడా ఆస్ట్రేలియా, ఇండోనేషియాల దిగుమతులపైనే ఆధారపడుతుండగా, కరోనా పుట్టుకపై దర్యాప్తు విషయంలో ఆసీస్ తో విభేదాలు చైనాను మరింత ఇరునక పడేశాయి. భారత్ లో..

భారత్ లోనే తక్కువ చార్జీలు

పంచంలోనే అతి తక్కువ విద్యుత్ చార్జీలు కలిగిన దేశమైన భారత్ లో బొగ్గు ఉత్పత్తి, దాంతో కరెంటు ఉత్పత్తి ప్రధానంగా ప్రభుత్వ నిర్వహణలోనే సాగుతున్నది. విశ్వసనీయంగా వెల్లడైన మరో డేటా ప్రకారం ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు భారతదేశ సగటు వారపు బొగ్గు దిగుమతులు, ప్రపంచ బొగ్గు ధరలు ఆల్ -టైమ్ గరిష్టానికి 40% పైగా పెరిగాయి. మొదటి ఏడు నెలల్లో సగటున 30% కంటే ఎక్కువ తగ్గాయి సంవత్సరం నుండచి కేవలం 3 మిలియన్ టన్నుల కంటే తక్కువగా ఉంది.

బొగ్గు కంపెనీల షేర్ల జోరు

రతీయ విద్యుత్ ఉత్పత్తిదారులు NTPC లిమిటెడ్ (NTPCNS), టాటా పవర్ (TTPW.NS) మరియు టొరెంట్ పవర్ (TOPO.NS) మరియు కోల్ ఇండియా షేర్లు ఇటీవలి వారాల్లో బలంగా పెరుగుతున్నాయి. దేశీయ స్పాట్ వేలంలో బొగ్గును కొనుగోలు చేసిన చాలా మంది వ్యాపారులు ఇంధనాన్ని విపరీతమైన ప్రీమియంతో విక్రయించారని ఓ ప్రధాన సంస్థ యుటిలిటీ ఆపరేటర్ అధికారి తెలిపారు.

పెరగనున్న బొగ్గు ధరలు?

బొగ్గు  దిగుమతి చేసుకున్న విద్యుత్ ప్లాంట్ల విద్యుత్ యేతర వినియోగదారులు అధిక విదేశీ ధరల కారణంగా ఉత్పత్తిని తగ్గించారు. భవిష్యత్తులో చైనాలో పెద్ద ఎత్తున పనిచేయకపోవడం అసాధ్యమని అనిపించినప్పటికీ, దేశంలోని కొన్ని విద్యుత్ అంతరాయాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కోల్ ఇండియా సైతం పరిస్థితిని అనుకూలంగా భావిస్తూ బొగ్గు ధరను కనీసం 10 నుంచి 18 శాతానికి పెంచాలనే నిర్ణయానికి వచ్చింది. దీనికి కేంద్రం అంగీకారమే తరువాయి.
Published by:Madhu Kota
First published:

Tags: China, India, NTPC, Power problems

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు