Home /News /explained /

WHY DO MAKERS OF MOBILE PHONES WANT TO BUILD CARS NOW AND MOSTLY LOOKING TOWARDS THE PRODUCTION OF ELECTRIC CARS PRV GH

Explained: కార్ల తయారీకి క్యూ కట్టిన మొబైల్ తయారీ కంపెనీలు.. ఎందుకిలా జరుగుతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొబైల్ తయారీ రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తివైపు చూడటానికి ప్రధాన కారణం ఏంటనేది ఓసారి గమనిస్తే.. ఈవీ మార్కెట్​ పరిధి రోజురోజుకూ విస్తృతమవుతోంది. అంతేగాక..

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు (makers of mobile phones) ఎలక్ట్రిక్ కార్ల(EV) తయారీపై దృష్టిసారిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్ (apple electric), హువావే తమ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్​కి సంబంధించిన ప్రణాళికలను ప్రకటించగా.. ఈ జాబితాలో సోనీ కంపెనీ సైతం చేరింది. అసలు.. మొబైల్ తయారీ రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తివైపు చూడటానికి ప్రధాన కారణం ఏంటనేది ఓసారి గమనిస్తే.. ఈవీ మార్కెట్​ పరిధి రోజురోజుకూ విస్తృతమవుతోంది. అంతేగాక.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లకు భిన్నంగా.. ఈవీల(EV) పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలకు ఛాన్స్​ ఉంది. పూర్తిగా సాఫ్ట్​వేర్ ఆధారంగా నడిచే ఈవీలను తయారుచేయడం మొబైల్ కంపెనీలకు కాస్త సులువైన పనే.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేయడం..

ఈ మధ్యకాలంలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమన్వయంతో సెల్ఫ్ డ్రైవింగ్(self driving cars) కార్లను తయారుచేయడం చాలా సింపుల్​గా మారింది. ఉదాహరణకు.. కనీసం రెండు వేల వస్తువులను అమర్చితే గానీ సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ ఇంజిన్లను తయారుచేయలేం. అదే ఎలక్ట్రిక్ ఇంజిన్‌లో కదిలే భాగాలు 20 మాత్రమే ఉంటాయి.

అందుకే ఈ రంగంపై మొబైల్ తయారీ సంస్థలు  (Mobile manufacturing companies)దృష్టిసారిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్, క్లౌడ్‌ కంప్యూటింగ్ ఆధారితంగా పనిచేసే ఈవీలలో.. మ్యాపింగ్, టెలిమాటిక్స్, థర్డ్ పార్టీ అప్లికేషన్‌లతో పాటు.. అధునాతన డ్రైవింగ్ ఫీచర్లు ఉంటాయి. ఇప్పటికే ఈ టెక్నాలజీలపై మంచి పట్టున్న మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు ఇదొక అడ్వాంటేజ్​.

Sony VISION S-EV: ఈవీ మార్కెట్‌లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చేందుకు 2022 మొదట్లో సోనీ మొబిలిటీ పేరిట ఓ కంపెనీని ప్రారంభించాలని జపాన్(sony japan) ఎలక్ట్రానిక్స్ దిగ్గజం యోచిస్తోంది. తదుపరి తరం మొబిలిటీ సొల్యూషన్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకూ ఎరిక్సన్‌ భాగస్వామ్యంతో మొబైల్ ఫోన్​లను తయారు చేసిన ఈ సంస్థ.. కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. ఈ మేరకు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో(CES) టెక్ ఫెయిర్‌కు ముందు సోనీ ఛైర్మన్, ప్రెసిడెంట్ కెనిచిరో యోషిడా ఓ ప్రకటనలో తెలిపారు.

"సోనీ యొక్క ఇమేజింగ్, సెన్సింగ్, క్లౌడ్, 5జీ, ఎంటర్‌టైన్‌మెంట్ టెక్నాలజీలను కలిపి సృజనాత్మక ఉత్పత్తిని లాంఛ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని " యోషిదా చెప్పారు. సోనీ ఓ ప్రోటోటైప్ SUV సహా.. VISION-S 02ని ఆవిష్కరించనుందని ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది.

Huawei Aito M5: మరో దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ హువావే సైతం SF-5 ఈవీ తయారీ సంస్థను ప్రారంభించింది. Aito M5 పేరిట ఓ మోడల్​ను సైతం విడుదల చేయనున్న.. ఈ డిజైన్ చైనాలో టెస్లా మోడల్-వైకి(Tesla-Y) పోటీనిస్తోందని భావిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేయనున్న ఈ కార్​లో Harmony OSను ఉపయోగించనుంది హువావే. ఫిబ్రవరి 20నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధి రిచర్డ్ యు తెలిపారు.

యాపిల్​ కార్ ప్రాజెక్ట్: మొబైల్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన యాపిల్ సైతం ఎలక్ట్రిక్ కార్ (ఈవీ) ప్రాజెక్ట్​పై పనిచేస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత ఎనిమిదేళ్లుగా ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి సారించింది యాపిల్. మాజీ ఫోర్డ్ ఇంజినీర్ స్టీవ్ జాడెస్కీ నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ 2014లో ప్రారంభమైంది.

ఈవీల రంగంలో ఫోక్స్​వ్యాగన్ (Volkswagen), టయోటా మోటార్స్ (Toyota Motor) గ్లోబల్ ఆటోమేకర్లుగా దూసుకెళ్తున్నాయి. ఈవీల రంగంలో మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు రాబోయే రోజుల్లో 170 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నట్లు గత నెలలో ప్రకటించాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనా రంగంలో మార్కెట్ లీడర్ అయిన టెస్లా సెల్ఫ్​డ్రైవింగ్ కార్ల తయారీపై దృష్టి సారించింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Apple, Cars, Electric cars, Huawei, Sony

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు