ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడులు మొదలైనప్పటి నుంచి 30 లక్షల మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు తరలివెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అయితే చాలా తక్కువ మందే అమెరికాలో అడుగుపెట్టినట్లు సమాచారం. వందల మంది ఉక్రేనియన్ శరణార్థులకు(Ukraine Refugees) మాత్రమే అమెరికా అనుమతి ఇచ్చిందని తెలిసింది. అయితే ఈ అంశంలో యూఎస్ ప్రభుత్వ విధానాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ మంది ఉక్రెయిన్ శరణార్థులను యూఎస్ ఎందుకు అనుమతించలేదంటే..
అవసరమైతే ఉక్రెయిన్(Ukraine) శరణార్థులను అనుమతించడానికి సిద్ధంగా ఉన్నట్లు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్, ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ శరణార్థులు యూరోపియన్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడాలని పదే పదే యూఎస్ సంకేతాలు ఇచ్చింది. మార్చి 11న ఫిలడెల్ఫియాలో డెమోక్రాట్ల సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ శరణార్థులు యూఎస్‌కు వస్తే అందరం స్వాగతిస్తాం.’ అని చెప్పారు.
యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మార్చి 10వ తేదీన సాకీ మాట్లాడుతూ..‘ఎక్కువ మంది శరణార్థులు పొరుగుదేశాలలోనే ఉండాలని కోరుకొంటారు. ఎందుకంటే అక్కడ స్నేహితులు, కుటుంబ సభ్యులు, యజమానులు ఉంటారు.’ అని చెప్పారు.
ఎక్కువ మంది శరణార్థులను అనుమతించాలని ఎవరు కోరుతున్నారు?
మార్చి 11వ తేదీన మూడు డజన్ల మందికిపైగా డెమొక్రాటిక్ చట్టసభ సభ్యుల బృందం బైడెన్‌కు ఓ లేఖ రాసింది. ఉక్రెయిన్ శరణార్థులకు యూఎస్‌లోకి ప్రవేశించేలా అవకాశం కల్పించాలని కోరారు. ‘హ్యూమనిరేటియన్ పెరోల్’ కింద ఉక్రెయిన్ కుటుంబాలను అనుమతించాలని కోరారు. లేఖ రాసిన వారిలో ఉన్న ఎమర్జెన్సీ మెడిసిన్‌లో శిక్షణ పొందిన వైద్యుడు, కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్ ఛైర్మన్ రౌల్ రూయిజ్ ఈ నెల ప్రారంభంలో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల ప్రతినిధి బృందంలో భాగంగా పోలాండ్-ఉక్రెయిన్ ససరిహద్దులో కూడా పర్యటించారు. ఈ సంక్షోభం ప్రస్తుతం చాలా మంది ఉఉక్రెయిన్ శరణార్థులకు ఆతిథ్యం ఇస్తున్న దేశాలను ముంచెత్తుతోంది. ఈ దేశాలకు సహాయం చేసే ప్రయత్నాల్లో యూఎస్ ముందు ఉండాలని బైడెన్‌కు సూచించారు.
ఇండియానాకు చెందిన రిపబ్లికన్ , ఉక్రేనియన్ వలసదారు ప్రతినిధి విక్టోరియా స్పార్ట్జ్ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఫాక్స్ న్యూస్‌తో ఆయన మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతో ఉక్రెయిన్ శరణార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత పొరుగు దేశం పోలాండ్‌ది మాత్రమే కాదని అన్నారు. సంక్షోభంలో ఆదుకోవాల్సిన ఆవశ్యకతను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భార్య ఒలెనా జెలెన్స్కా నొక్కి చెప్పారని, ఉక్రెయిన్ మహిళలు, పిల్లలకు మద్దతు ఇవ్వాలని ఆమె అమెరికన్ మహిళలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా రెండు డజనుకు యూదు-అమెరికన్ సంస్థలు ఉక్రెయిన్ శరణార్థులను రక్షించాలని బైడెన్‌ను కోరాయి.
అమెరికా ఎక్కువ మందికి ఆశ్రయం కల్పిస్తుందా?
మార్చిలో ఉక్రెయిన్ శరణార్థులకు యూఎస్ ఆశ్రయం కల్పించినట్లు సమాచారం అందుబాటులో లేదు. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సమాచారం ప్రకారం.. జనవరి, ఫిబ్రవరిలో కేవలం 514 మంది ఉక్రెయిన్ శరణార్థులను మాత్రమే అనుమతించింది.
యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంలో 15,000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ సంవత్సరం బైడెన్ ఆ సంఖ్యను 125,000కి పెంచారు. అయితే కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 125,000లో యూరప్, మధ్య ఆసియా ప్రజల కోసం 10,000 కేటాయించారు. ఇందులోనే ఉక్రెయిన్ ఉంది. అయితే అవసరమైతే ఆ కేటాయింపును విస్తరించవచ్చు మరియు కొన్ని కేసులను వేగవంతం చేస్తోంది.
మెక్సికో నుంచి యూఎస్‌లో అడుగుపెట్టాలని చూస్తే ఉక్రెయిన్ ప్రజలకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది?
వేలాది మంది ఉక్రెయిన్ ప్రజలు, రష్యన్లు యుఎస్-మెక్సికో సరిహద్దుకు ఆశ్రయం పొందేందుకు ప్రయాణిస్తున్నారు. అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో.. నైరుతి సరిహద్దు వద్ద ఉన్న యూఎస్ అధికారులు దాదాపు 1,300 మంది ఉక్రెయిన్ ప్రజలను అడ్డుకొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఎక్కువగా నౌకాశ్రయాల వద్ద మొత్తం 680 మంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిలా కాకుండా చాలా మంది ఉక్రెయిన్ ప్రజలను తమ ఇమ్మిగ్రేషన్ కేసుల కోసం యూఎస్ అనుమతిస్తోంది. సౌత్ఈస్ట్ బార్డర్ నుంచి ఎక్కువ మంది ఉక్రెయిన్లు వస్తుండటంతో యూఎస్ అడ్డుకొంటోంది.
శరణార్థులను అనుమతించని యూఎస్.. ఏం చేస్తోంది?
శరణార్థులను స్వీకరించే యూరోపియన్ దేశాలకు సాయం చేయడానికి యూఎస్ అందిస్తోంది. ఉక్రెయిన్ , యూరోపియన్ మిత్రదేశాలకు సహాయం చేయడానికి 13.6 బిలియన్లను మంగళవారం బైడెన్ మంజూరు చేశారు. తరలిపోతున్న ప్రజలకు సాయపడేలా 4 బిలియన్లను విడుదల చేశారు. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్లో ఉన్న సుమారు 75,000 మంది ఉక్రెయిన్ ప్రజలకు తాత్కాలిక రక్షిత హోదా (TPS) మంజూరు చేస్తామని యూఎస్ ప్రకటించింది. వారికి 18 నెలల పాటు బహిష్కరణ ఉపశమనం, వర్క్ పర్మిట్లను అందిస్తుంది. మార్చి 1వ తేదీ తర్వాత వచ్చిన వ్యక్తులకు వర్తించదు.
వామ్మో... పెట్రో ధరలు భరించడం నావల్ల కాదు.. గుర్రం స్వారీయే నయం.. వైరల్ వీడియో
మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలు మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ నుంచి యూరోపియన్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ కొరత తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. యూరోపియన్ దేశాల్లో నిల్వ ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ నాలుగు నుంచి ఆరు వారాల వరకు సరిపోతుంది. తర్వాత కష్టాలు తప్పవని ఈయూ వెజిటెబుల్ ఆయిల్ ఇండస్ట్రీ అసోషియేషన్ హెచ్చరించింది. దీంతోపాటు ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో తేడాల కారణంగా వివిధ దేశాల్లో ధరల పెరుగుదలతో పాటు ద్రవ్యోల్బణంలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం కుదుటపడితే కానీ సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితులు లేవని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine