హోమ్ /వార్తలు /Explained /

AP Municipal Elections: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం ఎవరిది? ఫలితాలపై స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్

AP Municipal Elections: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం ఎవరిది? ఫలితాలపై స్టీల్ ప్లాంట్ ఎఫెక్ట్

జీవీఎంసీ కార్యాలయం (ఫైల్ ఫోటో)

జీవీఎంసీ కార్యాలయం (ఫైల్ ఫోటో)

గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం ఎవరిది? విశాఖ ఉక్కు ఉద్యమం ఏ పార్టీకి మైనస్.. ఏ పార్టీకి కలిసి వస్తుంది. ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు ఒక లెక్క.. తరువాత ఒక లెక్క అంటున్న రాజకీయ పార్టీలు? ఇంతకీ ఎవరి లెక్క నిజమవుతుంది.

పట్టణ ఓటర్లు తీర్పు ఏంటి అన్నది ఇప్పటికే ఫైనల్ అయ్యింది. అయితే ఆ ఫలితం ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది. ప్రాధాన పార్టీలు మాత్రం ఎవరికి వారు గెలుపై బయటకి ధీమాగా కనిపిస్తున్నా.. లోలోపల టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. భారీ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే భయం నెలకొంది. అయితే చాలా మున్సిపాలిటీలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నా.. విశాఖ, విజయవాడ, గుంటూరు మున్సిపాలీటీల్లో గెలుపు ఎవరిది అన్నది తీవ్ర ఉత్కంఠ పెంచుతోంది.

వీటి ఫలితాల కోసం మరో రెండు రోజులు ఆగాలి. అదే అభ్యర్థుల్లో టెన్షన్‌ను పెంచేస్తోంది. స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రంగా ఉన్న బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఓటర్ల తీర్పు ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు నేతలు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది. 70 మున్సిపాల్టీల్లో, 11 కార్పొరేషన్లకు కౌంటింగ్‌ జరగనుంది. చిలకలూరిపేట మున్సిపాల్టీ, ఏలూరు కార్పొరేషన్‌లో కౌంటింగ్‌ను హైకోర్టు ఆదేశాలను బట్టి తర్వాత చేపడతారు. మొత్తం 75 మున్సిపాల్టీల్లో 4 మున్సిపాల్టీలు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్లలో కన్నా మున్సిపాల్టీల్లోనే ఎక్కువగా పోలింగ్‌ నమోదైంది. 12 కార్పొరేషన్లలో 57.14 శాతం ఓట్లు పోలైతే.. కార్పొరేషన్లలో 62.28 శాతం పోలింగ్‌ జరిగింది. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి..

ముఖ్యంగా రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లలో తీర్పే అత్యంత ఉత్కంఠ రేపుతున్నాయి ఫలితాలు. విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో గెలుపు ఎవరిదనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా స్టీల్‌ సిటీలో ఉక్కు ఉద్యమం దెబ్బ ఎవరికి పడుతుందో ఆదివారం తేలుతుంది. బీజేపీ, జనసేనకు ఎఫెక్ట్‌ తప్పదనే అంచనా ఉంది. వైసీపీకి ఇబ్బందులు తప్పవా…అనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కార్మికుల ఆందోళన గ్రేటర్‌ విశాఖలో గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపిందనేది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

విశాఖ జీవీఎంసీలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో విశాఖ జీవీఎంసీని ఈసారి ఎవరు కైవసం చేసుకుంటారన్నది అందరిలో ఉత్కంఠ పెంచుతోంది. విశాఖ జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. యలమంచిలి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీనీ మాత్రం టీడీపీ గెల్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ పీఠం మాత్రం ప్రధాన పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

ముఖ్యంగా అధికార వైసీపీకి గ్రేటర్ విశాఖ విజయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అందుకు ప్రధాన కారణం.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే అక్కడ నుంచి పాలించేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో స్థానికంగా వేరే పార్టీ అధికారంలో ఉంటే ఇబ్బందులు తప్పవు. దానికి తోడు విశాఖను రాజధానిగా చేయడం స్థానికులు ఇష్టం లేదనే ప్రచారం మొదలవుంది. అందుకే ఎలాగైనా విశాఖ నెగ్గాలని వైసీపీ భావిస్తోంది. విశాఖ బాధ్యతలన్నీ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూశారు. గెలుపుకోసం ఆయన చాలా వ్యూహాలు రచించారు. విరామం లేకుండా ఇంటింటికీ తిరిగారు. ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉన్న చోటా.. ఆ పార్టీల అభ్యర్థులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ బలంగా ఉండడంతో.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి పాదయాత్ర కూడా చేశారు. అయితే తమకు అంతా అనుకూలంగానే ఉంటుందని వైసీపీ పార్టీ భావించింది. కానీ కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది..

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100 శాతం తప్పదని కేంద్రం తేల్చి చెప్పేసింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని బాంబు పేల్చింది. అది కూడా మున్సిపల్ ఎన్నికలకు ఒక రోజు ముందే కేంద్రం ఆ ప్రకటన చేయడంతో వైసీపీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అప్పటి వరకు కేవలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే కార్మిక సంఘాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అంతేకాదు కొన్ని డివిజన్లలో ఓటుతో పాటు సేవ్ స్టీల్ ప్లాంట్ అనే స్లిప్పులు కూడా వేశారని తెలుస్తోంది. అంటే ప్రజల్లో ఎంత సెంటిమెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మొన్నటి వరకు గెలుపుపై దీమాతో ఉన్న వైసీపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది. గెలుస్తామా లేదా అని ఆందోళన పెరుగతోంది.

అటు ప్రధాన ప్రతిపక్షం సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం వైసీపీదే అని ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యింది. దానికతోడు బలమైన కేడర్ పార్టీకి ఉండడం. చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉన్నా గంటా శ్రీనివాసరాలు తిరిగి పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు రోడ్ షోలు నిర్వహించడం.. వీటికి తోడు మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం అన్ని తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వైసీపీ నేతలు దౌర్జాన్యాలు చేశారని ఫిర్యాదులు అందితే.. విశాఖలో టీడీపీ నేతలు దౌర్జాన్యాలు చేశారంటూ అధికార పార్టీ ఫిర్యాదులు చేసింది. ఇలా ఏ లెక్కన చూసినా వైసీపీ నేతల్లో భయం స్పష్టం కనిపిస్తోంది. మరి ఫలితం ఎలా ఉంటుంది ఆదివారం తేలిపోనుంది.. ఎవరి లెక్కలు నిజమవుతాయో చూడాలి.

ఇక విజయనగరం జిల్లాలో.. 3 మున్సిపాలిటీలను, నగర పంచాయతీని.. వైసీపీయే దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు. విజయనగరం కార్పొరేషన్ పీఠం కూడా వైసీపీకే దక్కే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. పలాస మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరి నడిచింది. మిగిలిన రెండు మున్సిపాలిటీల్లోనూ.. వైసీపీ గట్టి పోటీ కనబర్చింది. మరిఫలితాలు అనుకూలంగా ఉంటయో.. ప్రభుత్వం వ్యతిరేకతకు అద్దం పడతాయో చూడాలి..

First published:

Tags: Ap local body elections, Bjp-janasena, Municipal Elections, Tdp, Visakha, Visakhapatnam, Vizag, Ycp

ఉత్తమ కథలు