M. Bala Krishna, Hyderabad, News18
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government), స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా, ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లను (Online Movie Ticekts) విక్రయించే కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. అసలు బిల్లులో ఏముంది? ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం? అసలు ఈ బిల్లు లో ఏముంది? ఆ చట్టం ప్రకారం ఇక ఏపీలో ఎలాంటి సినిమాలు నాలుగు షోలు మాత్రమే వేస్తారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదు. ఆన్ లైన్ మూవీ బుకింగ్ సిస్టమ్ విధానం ద్వారా ప్రభుత్వామే ఇక పై సినిమా టిక్కట్లను విక్రయించబోతోంది. ప్రతిపాదిత ఆన్ లైన్ మూవీ బుకింగ్ సిస్టమ్ బ్లాక్ మార్కెటింగ్ కి చెక్ పెట్టడంతోపాటు ఒక పై ఈ చట్టం అమల్లోకి వస్తే కొత్త సినిమాలు బెనిఫిట్ షోలు ఉండవు.
అంతేకాదు పెద్ద సినిమాలు రిలీజ్ రోజు అధిక ధరలకు టిక్కట్ విక్రయించడానికి వీలు ఉండదు. దీంతోపాటు ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ పన్ను ఎగవేతను అరికడుతుందని గడువులోగా జీఎస్టీని, సేవా పన్నులు మొదలైన వాటిని వసూలు చేయడానికి రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు వీలు కల్పిస్తుందీ బిల్లు.
ప్రభుత్వం ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్‌ను ఎందుకు ప్రారంభిస్తోంది..?
ఏపీలో మెజారిటీ సినిమా హాళ్లు (సింగిల్ స్క్రీన్) మరియు మల్టీప్లెక్స్‌లు సినిమా విడుదల మరియు ప్రదర్శనలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్న కొద్దిమంది పెద్ద సినిమా నిర్మాతల నియంత్రణలో ఉన్న నేపథ్యం సినిమా పరిశ్రమ అనేది పూర్తి స్థాయి దందాగా మారిందని ప్రభుత్వం భావించడమే ఈ యాక్ట్ తీసుకురావడానికి ప్రధానమైన కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌లో, సినిమా థియేటర్లలో ప్రవేశానికి గరిష్ట సీలింగ్ రేట్లను రూ.5 ( నాన్-ఏసీ థియేటర్) నుంచి రూ.250 (మునిసిపల్ కార్పొరేషన్‌లో ప్రీమియం మల్టీప్లెక్స్) వరకు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రేట్లు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ యాక్ట్ ను ప్రభుత్వం ఎలా అమలు చేయనుంది..?
ఈ చట్టం ద్వారా ఎగ్జిబిటర్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో మాత్రమే సినిమాలను మరియు టికెట్ ధరలు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ప్రభుత్వం రూపోందించిన వెబ్ సైట్ ద్వార టిక్కెట్ లు అమ్మకానికి సంబంధించి బ్లూ ప్రింట్‌ను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఎనిమిది మంది అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొత్త విధానానికి సంబంధించిన విధివిధానాలను ఇంకా రూపొందించలేదు. ఆన్ లైన్ టిక్కటింగ్ విధానాన్ని ప్రారంబించే ముందు ప్రారంభించే ముందు ప్రభుత్వం ఎగ్జిబిటర్‌లతో మరియు సినిమా నిర్మాతలతో చర్చించనుంది.
ఇప్పటికే ఉన్న ఆన్ లైన్ టికెట్ సెల్లింగ్ వెబ్ సైట్ల పరిస్థితేంటి..?
ఇకపై ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ కొనుగోలుకు వీలవుతుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న బుక్ మై షో వంటి యాప్ లతో పాటు జనం క్యూలో నిలబడి టికెట్లు తీసుకోవడం వల్ల అధికంగా నష్టపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అలా కాకుండా సినిమా చూడాలి అనుకున్నవాళ్లు ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేయడం, వెబ్ సైట్ లో బుక్ చేసుకోవడం, ఎస్ఎంఎస్ పంపడం ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
రోజువారీ కలెక్షన్లు.. ఎగ్జిబిటర్లకు చెల్లింపులు ఎలా..?
ఆన్ లైన్ టికెట్ సెల్లింగ్ పోర్టల్‌ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్ వే ద్వారా థియేటర్లకు చెల్లిస్తుంది.
ఎరికి లాభం అండ్ ఎవరికి నష్టం..?
ఈ కొత్త చట్టం వలన ప్రభుత్వానికి, మరియు ఎగ్జిబిటర్స్ కి లాభం చేకూరుతుందనేది విశ్లేషకుల మాట. ఇప్పటివరకు టికెట్ల అమ్మకాలను తక్కువగా చూపి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కొత్త విధానం వలన సినిమా టిక్కెట్ల అమ్మకం వచ్చిన లాభాల వివరాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి కాబట్టి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను కట్ చేసుకోని మిగిలిన డబ్బులు మాత్రమే ఎగ్జిబిటర్స్ ఖాతాల్లో జమమవుతాయి.
భారీ సినిమాల కలెక్షన్స్ కి ఇబ్బంది ఉంటుందా..?
గతంలోలాగా బేనిఫిట్ షోలు ఉండవు. విడుదలైన రోజు అధిక ధరలకు టిక్కెట్స్ అమ్మే విధానం కూడా ఇకపై ఉండదు. దీంతో గతంలో మాదిరి సినిమా కలెక్షన్స్ పెంచి చూపించే అవకాశం ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, Tollywood