Home /News /explained /

Mutual Fund: మీ అవసరాలకు సరిపడే మ్యూచువల్ ఫండే ఏది? ఇలా తెలుసుకోండి

Mutual Fund: మీ అవసరాలకు సరిపడే మ్యూచువల్ ఫండే ఏది? ఇలా తెలుసుకోండి

Mutual Fund: మీ అవసరాలకు సరిపడే మ్యూచువల్ ఫండే ఏది? ఇలా తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Mutual Fund: మీ అవసరాలకు సరిపడే మ్యూచువల్ ఫండే ఏది? ఇలా తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Mutual Fund | మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేయాలో (How to select mutual fund) అర్థం కావట్లేదా? మీ అవసరాలకు సరిపడే మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడానికి ఈ టిప్స్ గుర్తుంచుకోండి.

    పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. వారు ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాలి. ప్రధాన విభాగాలైన డెట్ లేదా ఫిక్స్‌డ్ ఇన్‌కం ఫండ్, ఈక్విటీ ఫండ్ లేదా బ్యాలెన్స్‌డ్ ఫండ్లలో దేన్ని ఎంచుకోవాలి.. ఏ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC)ని ఆశ్రయించాలనేది నిర్ణయించుకోవాలి. అయితే దీనికి ముందు మూడు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మీ పెట్టుబడుల లక్ష్యం ఏంటి? ఎంత కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు? ఎంత రిస్క్‌ను (నష్టభయాన్ని) తట్టుకోగలరు? వంటి విషయాలను ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్‌తో పంచుకోవాలి.

    పెట్టుబడి లక్ష్యం తెలుసుకోవాలి


    మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందే పెట్టుబడి లక్ష్యం నిర్ణయించుకోవాలి. పిల్లల చదువులు, సొంత ఇంటి నిర్మాణం, పెళ్లి కోసం నిధులు, రిటైర్‌మెంట్‌ తరువాత అవసరమైన నిధులు.. వంటి లక్ష్యాల ఆధారంగా స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక లక్ష్యంతో సరైన ఫండ్‌ ఎంచుకోవాలి. ఏ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనేది వీటిపైనే ఆధారపడి ఉంటుంది.

    మీకు రిటైర్‌మెంట్ ప్లానింగ్ వంటి దీర్ఘకాలిక లక్ష్యం ఉండి, కొంత రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా ఉంటే.. ఈక్విటీ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్ ఎంచుకోవచ్చు. సేవింగ్స్ మాదిరిగా కొన్ని నెలల పాటు డబ్బును ప్రత్యేకంగా పక్కన పెట్టాలనుకునే స్వల్పకాలిక లక్ష్యం ఉంటే.. లిక్విడ్ ఫండ్ అనువైనది. రెగ్యులర్ ఆదాయాన్ని ఆశించే ఆలోచన ఉంటే మంత్లీ ఇన్‌కమ్ ప్లాన్ లేదా ఇన్‌కమ్ ఫండ్‌ను నిపుణులు సిఫారసు చేస్తారు.

    SBI Savings Scheme: ఎస్‌బీఐలో రోజూ రూ.33 పొదుపు చేస్తే చాలు... రూ.1,60,000 మీవే

    best mutual fund, best mutual fund for sip, best mutual funds to invest in 2021 india, best mutual funds to invest in 2021 india for long term, best mutual funds to invest in 2021 india for short term, how to select best mutual fund for sip, how to select mutual funds for investment in india, top 10 mutual funds for sip to invest in 2021, top mutual funds in india, బెస్ట్ మ్యూచువల్ ఫండ్, మ్యూచువల్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ సిప్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్
    ప్రతీకాత్మక చిత్రం

    రిస్క్‌ కెపాసిటీ ఆధారంగా నిర్ణయం


    సాధారణంగా రిస్క్ (నష్టభయం) ఎక్కువగా ఉంటేనే రిటర్న్ (రాబడి) ఎక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లతో మెరుగైన రాబడి పొందాలనుకునే వారు రిస్క్‌కు సిద్ధపడాల్సిందే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ స్వింగ్స్‌కు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లు చాలా ఒడిదొడుకుల‌కు లోన‌వుతాయి. కొన్నిసార్లు మార్కెట్లు పతనం కావడం సాధారణ విషయం. అలాంటి స‌మ‌యాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ తగ్గుతుంది.

    ఈ రిస్క్‌ను తట్టుకోలేమని భావించేవారు ఈక్విటీ స్కీమ్స్‌ను ఎంచుకోకూడదు. అయితే మార్కెట్‌ రిస్క్ తట్టుకుని దీర్ఘకాలం వేచి ఉండగలమనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి రాబడులు అందిస్తాయి. ఈ రకమైన మ్యూచువల్ ఫండ్‌ను కలిగి ఉండటానికి కాలపరిమితి అయిదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.

    పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ ఫ్యాక్టర్‌పై అవగాహనకు వచ్చిన తరువాత మీకు ఎలాంటి ఫండ్ బెస్ట్ ఆప్షన్ అనేది నిర్ణయించుకోవడం సులువు అవుతుంది. రిస్క్‌ను తట్టుకోగలుగుతూ భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే దీర్ఘకాలిక మూలధన వృద్దికి (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌) అవకాశం ఉన్న ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఇలాంటి పథకాలు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. మదుపరులు స్వల్పకాలిక అవసరాల కోసమే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే.. ఇన్‌కం ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచిది.

    Credit Cards: క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా? యాన్యువల్ ఫీజు లేని బెస్ట్ కార్డులు ఇవే

    best mutual fund, best mutual fund for sip, best mutual funds to invest in 2021 india, best mutual funds to invest in 2021 india for long term, best mutual funds to invest in 2021 india for short term, how to select best mutual fund for sip, how to select mutual funds for investment in india, top 10 mutual funds for sip to invest in 2021, top mutual funds in india, బెస్ట్ మ్యూచువల్ ఫండ్, మ్యూచువల్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ సిప్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్
    ప్రతీకాత్మక చిత్రం


    గ్రోత్ ఫండ్స్, క్యాపిటల్ అప్రిసియేషన్ ఫండ్స్ ద్వారా ఎలాంటి డివిడెండ్ అందదు. అందువల్ల తక్షణ అవసరాల కోసం ఇన్‌కం ఫండ్స్ మంచి ఎంపిక. ఈ ఫండ్‌లు సాధారణంగా బాండ్‌లు, ఇతర డెట్ ఇన్‌స్ట్రుమెంట్ల రూపంలో ఉంటాయి. వీటి ద్వారా క్రమం తప్పకుండా వడ్డీ అందుతుంది. ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ డెట్ ఫండ్స్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. స్వల్ప, మధ్యస్థ లేదా దీర్ఘకాలిక హోల్డింగ్ పీరియడ్‌ను బట్టి వీటి ప్రయోజనాలు సైతం మారుతుంటాయి. ఈ ఫండ్‌లు మార్కెట్ రిస్క్‌కు తక్కువగా ప్రభావితమవుతాయి. స్టాక్ మార్కెట్‌తో వీటికి తక్కువ సంబంధం ఉండటమే ఇందుకు కారణం.

    అందువల్ల మీ స్టాక్ పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యానికి డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. అయితే వడ్డీ రేట్లలో మార్పులు, క్రెడిట్ రిస్క్, డిఫాల్ట్ రిస్క్ వంటివి ఈ ఫండ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు పెట్టుబడిదారులకు దీర్ఘకాలిక అవసరాలు ఉన్నప్పటికీ, రిస్క్‌ వద్దనుకుంటారు. ఈ సందర్భంలో స్టాక్స్, బాండ్లలో కలిపి పెట్టుబడి పెట్టే బ్యాలెన్స్‌డ్ ఫండ్ మంచి ఎంపిక.

    ట్రాక్ రికార్డ్ ఆధారంగా...


    ఫండ్ గత పనితీరు, ఫండ్ మేనేజర్ల పనితీరును బట్టి కూడా మంచి ఫండ్‌ను మదుపర్లు ఎంపిక చేసుకోవచ్చు. అన్ని పెట్టుబడుల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్స్ గత ఫలితాలను ఇన్వెస్టర్లు పరిశీలించాలి. ఇలా ఫండ్ ట్రాక్ రికార్డును సమీక్షించేటప్పుడు కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. ఫండ్ మేనేజర్ సాధారణ మార్కెట్ రాబడికి అనుగుణంగా ఫలితాలను అందించారా? ప్రధాన ఇండెక్స్‌ల కంటే ఫండ్ మరింత అస్థిరంగా ఉందా? అసాధారణంగా అధిక టర్నోవర్ ఉందా? వంటివి ఆరా తీయాలి.

    ఈ ప్రశ్నలకు సమాధానాల ఆధారంగా పోర్ట్‌ఫోలియో మేనేజర్‌తో పాటు ఫండ్ పనితీరును అంచనా వేయవచ్చు. ఫండ్ ప్రాస్పెక్టస్ ద్వారా.. రాబోయే సంవత్సరాల్లో ఫండ్, దాని హోల్డింగ్‌ల అవకాశాలపై ఒక నిర్ణయానికి రావచ్చు. ఫండ్ పనితీరును ప్రభావితం చేసే సాధారణ పరిశ్రమ, మార్కెట్ ధోరణుల గురించి కూడా మదుపర్లు ఆరా తీసి.. బెస్ట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు.

    Post Office Scheme: రోజూ రూ.50 దాచుకుంటే... రూ.35 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు

    best mutual fund, best mutual fund for sip, best mutual funds to invest in 2021 india, best mutual funds to invest in 2021 india for long term, best mutual funds to invest in 2021 india for short term, how to select best mutual fund for sip, how to select mutual funds for investment in india, top 10 mutual funds for sip to invest in 2021, top mutual funds in india, బెస్ట్ మ్యూచువల్ ఫండ్, మ్యూచువల్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ సిప్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్
    ప్రతీకాత్మక చిత్రం

    ఇవి కూడా..


    చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడుల వ్యూహాన్ని విస్మరిస్తారు. అయితే ఇది మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియో విజయానికి కీలకం. ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.. మీ పెట్టుబడి అవసరాలతో సరిపోలకపోతే.. నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఫండ్స్‌ను తక్కువ ధరల వద్ద విక్రయించాల్సి ఉంటుంది. దీంతో పాటు పెట్టుబడిని సక్రమంగా నిర్వహించడానికి వసూలు చేసే కమీషన్ లేదా ఫీజు.. ట్యాక్స్ ప్రయోజనాలు.. వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

    ఎలాంటి ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయించుకున్న తర్వాత, AMCలు అందించే నిర్దిష్ట పథకంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా AMC ట్రాక్ రికార్డ్, స్కీమ్ సస్టైనబిలిటీ, పోర్ట్‌ఫోలియో వివరాలు.. వంటివి నిర్ధారించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలి. ప్రతి పెట్టుబడిదారుడు స్కీమ్ ఫ్యాక్ట్‌షీట్స్, కీ ఇన్ఫర్మేషన్ మెమోరాండం అనే రెండు డాక్యుమెంట్లను పెట్టుబడి పెట్టడానికి ముందు తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. స్కీమ్‌కు సంబంధించిన అన్ని వివరాల కోసం ‘స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్‌’ను పరిశీలించాలి. ప్రతి మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్‌లో ఇవన్నీ సులభంగా అందుబాటులో ఉంటాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Investment Plans, Mutual Funds, Personal Finance, Save Money

    తదుపరి వార్తలు