హోమ్ /వార్తలు /Explained /

ఆప్ఘనిస్తాన్ ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు..?

ఆప్ఘనిస్తాన్ ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాలిబన్ల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఇతర దేశాలకు చెందిన వారితో పాటు అప్ఘనిస్తాన్ వాసులు కూడా విమానాల్లో తోసుకొని మరీ ఎక్కడం, ప్రమాదకరంగా ప్రయాణించడం వంటివి చేస్తుండడం చూసి ప్రపంచమంతా విస్తుపోతోంది.

రెండు దశాబ్దాల పాటు అమెరికా మిలటరీ సేనల రక్షణలో ఉన్నఅప్ఘనిస్తాన్(Afghanistan)ఒంటరిగా మిగిలింది. ఇన్నాళ్లు తాలిబాన్ల నుంచి దేశాన్నికాపాడిన అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. దీంతో, ప్రస్తుతం ఆ దేశం తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. తాలిబన్ల (Tablibans) నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఇతర దేశాలకు చెందిన వారితో పాటు అప్ఘనిస్తాన్ వాసులు కూడా విమానాల్లో తోసుకొని మరీ ఎక్కడం, ప్రమాదకరంగా ప్రయాణించడం వంటివి చేస్తుండడం చూసి ప్రపంచమంతా విస్తుపోతోంది.ఈ నేపథ్యంలో అసలు అప్ఘాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదానిపై తాలిబన్ ప్రతినిధిసుహైల్ షాహీంక్ఏమంటున్నారో చూద్దాం..

1. అప్ఘనిస్తాన్​పై విజయం సాధించిన వారం తర్వాత కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికి సద్దుమణుగుతుందని మీరు భావిస్తున్నారు?

జ: ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరిపేందుకు మేం సమయం తీసుకుంటున్నాం. ఎందుకంటే అన్ని పక్షాలు మా భవిష్యత్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆశిస్తున్నాం.అందుకే అందరితోనూ చర్చలు జరుపుతున్నాం. లేకపోతే కాబూల్లోకి ప్రవేశించిన రోజే ప్రభుత్వం నిలబెట్టుకున్నట్లు ప్రకటన చేసేవాళ్లం. మేం అలా చేయదల్చుకోలేదు కాబట్టే అందరితోనూ చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నాం. అతి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వస్తుంది.

2. గత రెండు దశాబ్దాల్లో భారత్ అప్ఘనిస్తాన్లో చాలా పనులు చేసింది. రోడ్లు, డ్యామ్స్, పార్లమెంట్ బిల్డింగ్ కూడా నిర్మించింది. కానీ తాలిబన్లు భారత్తో వర్తక, వాణిజ్యాలను పూర్తిగా ఆపేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి?

జ: అప్ఘనిస్తాన్ ప్రజల మంచి కోసం, వారి అభ్యున్నతి కోసం ఉపయోగపడే పనులు ఒకవేళ అసంపూర్తిగా మిగిలిపోతే అవి ఇప్పుడు కూడా కొనసాగుతాయి. భారత్ అప్ఘనిస్తాన్ ప్రజల పక్షాన నిలబడాలని మేం కోరుకుంటున్నాం. ఈ కీలుబొమ్మ ప్రభుత్వానికి మద్దతును ఇవ్వకుండా ప్రజల పక్షాన నిలవాలనిగత20 సంవత్సరాల నుంచి కోరుకుంటూ వస్తున్నాం. వారు ప్రభుత్వానికి మద్దతును ఇవ్వడాన్ని మేం వ్యతిరేకించాం. భారత్ అప్ఘనిస్తాన్తో సంబంధాలు కొనసాగించాలనిమేం కోరుకుంటున్నాం.

3. అప్ఘనిస్తాన్లో విదేశాల తరహాలో ప్రజాస్వామ్యం ఉండదని మీరు ప్రకటించారు. అలాంటప్పుడు ఎలక్టోరల్ పార్లమెంట్ ఉన్న సందర్భంలో రూపొందిన పార్లమెంట్ బిల్డింగ్ని ఏం చేయాలనుకుంటున్నారు?

జ: మేం అప్ఘనిస్తాన్ కి గాను ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రూపొందిస్తాం. పరిస్థితులన్నీ సాధారణంగా మారి ప్రభుత్వం ఏర్పడగానే రాజ్యాంగం రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ భవనాన్ని ఏదో ఒక అవసరం కోసం వినియోగిస్తాం. ప్రభుత్వ భవనంగా దాన్ని ఉపయోగించుకుంటాం.

4. తాలిబన్లు వచ్చిన తర్వాత మహిళలు పనికి వెళ్లకూడదని నియమం పెట్టారు. జీన్స్ వేసుకున్నందుకు గాజ్నీ అమ్మాయిలను చితకబాదారు. ఇలాంటి 17కి పైగా సంఘటనలు మానవ హక్కుల ఉల్లంఘనగా నమోదయ్యాయి. ఇలాంటివి ప్రస్తుత సమయంలో జరగడం పట్ల మీరేం స్పందిస్తారు?

జ: ఇలాంటివి చాలా తాత్కాలికమైనవి. అమ్మాయిలకు చదువుకునే హక్కు, పనిచేసే హక్కు ఉంది. కానీ హిజబ్ ధరించే అవి చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి చాలా చిన్న చిన్న అంశాలు. చాలా తొందరగా వీటికి పరిష్కారం కూడా దొరుకుతుంది. మహిళలకు చదువు, ఉద్యోగాలకు అవకాశం తప్పక ఉంటుంది. దాని గురించి ఎవరూ కంగారుపడాల్సిన అవసరం ఉండదు.

5. అప్ఘాన్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రస్తుతం కంగారుపడుతున్నారు. తాలిబన్లు లిస్టు ఏర్పాటు చేసుకొని వారి కోసం ఇంటింటా వెతికి చంపుతున్నారు. తాజాగా అలాంటి ఘటనలు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిపై మీరు ఎలా స్పందిస్తారు?

జ: ఇంటింటికీ వెళ్లి వెతకడం అనే మాట తప్పు,. నేను నిన్న కూడా దీనిపై స్పందించాను. ఇలాంటిదేదీ జరగట్లేదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మా సైనికులు దీనిపై విచారణ జరిపి దోషులను పట్టుకుంటున్నారు. తప్పక న్యాయం జరుగుతుంది. మా పాలసీలు ఏమీ మారలేదు. వాటిని ఎవరైనా తప్పితే వారికి తప్పక శిక్ష పడుతుంది.

6. ప్రభుత్వ అధికారులు తిరిగి విధుల్లో చేరడానికి భయపడుతున్నారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని నడిపించాలంటే వారి సహకారం అవసరం. ఎయిర్ పోర్టు నుంచి ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ కష్టం ఎదురవుతోంది. దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు?

జ: విదేశాలకు వెళ్లేవారికి సరైన డాక్యుమెంట్లు, వీసా ఉంటే వారు ఎయిర్ పోర్ట్ కి చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవ్వదు. ఐఎస్ ఐఎస్ మెంబర్లు కూడా వీరితో పాటు విదేశాలకు వెళ్తున్నారని మాకు తెలిసింది. అందుకే మేం కట్టుదిట్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. సరైన డాక్యుమెంట్లు లేనివారిని బయటకు వెళ్లనివ్వడం లేదు.

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ శ్రీమంతుడు.. ఆస్తి ఎంతో తెలుసా.. ఏం వ్యాపారాలు ఉన్నాయంటే..

7. మొదటిసారి మీకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా ఉండడం వల్ల తాలిబన్లు వాటిని అనుమతిస్తున్నారా? లేక ఈ సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారా?

జ: మహిళలు ఉద్యోగాలు చేయడానికి మేం వ్యతిరేకులం కాదు. దానికి మేం కట్టుబడి ఉన్నాం. కానీ ముస్లిం ఆచారాల ప్రకారం వారు హిజబ్ ధరించాల్సి ఉంటుంది. వారు దాన్ని పాటించిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలు చేసుకున్నా మేం వ్యతిరేకించం. వాకి కోసంవాట్సాప్ నంబర్లు కూడా అనౌన్స్ చేశాం. వారు ఆ నంబర్లలో సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. కంప్లైంట్లు అందించడం వారి హక్కు. వారి ఫిర్యాదులను మేం తప్పక పరిష్కరిస్తాం.

8. ఇటీవలే తాలిబన్లు భారతీయులను కిడ్నాప్ చేసి ఆ తర్వాత తిరిగి వదిలేశారని వార్తలొచ్చాయి. వారు ఆ తర్వాత సురక్షితంగా దేశానికి చేరుకున్నారు. కానీ అలాంటి వార్తలు ఎందుకు వచ్చాయి? అప్ఘాన్ నుంచి వెళ్లాలనుకునేవారికి మీరిచ్చేమెసేజ్ ఏంటి?

జ: నేను దీన్ని ఖండిస్తున్నాను. కిడ్నాప్ చేయడం అనే పదాన్ని అసలు ఉపయోగించకండి.దేశం నుంచి బయటకు వెళ్లాలనుకునేవారి కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంబసీలు పనిచేస్తున్నాయి. అంబాసిడర్లు, డిప్లొమాట్లు కూడా పనిచేస్తున్నారు. వారి డాక్యుమెంట్లలో ఏదైనా సమస్య ఉండొచ్చు అందుకే అధికారులు వారిని ఆపి ఉంటారు. మేం ప్రకటించిన ప్రతి అంశాన్ని మేం చేసి చూపుతాం. దేశం బయట కొన్ని సంస్థలు దేశంలో ఇలాంటివి జరగడానికి, మాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. మేం దానిపై ఇన్వెస్టిగేషన్ జరిపి చర్యలు తీసుకుంటాం.

9. భారత్, అప్ఘాన్ ల స్నేహం గురించి చెప్పాలంటే బాలీవుడ్ సినిమాలు అయిన కాబూలీ వాలా, షెహన్షా వంటివి గుర్తొస్తాయి. 1996లో మీరు ఆ సినిమా సిబ్బంది కోసం సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారని తెలిసింది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ చూడొచ్చా?

జ: ఇది భారత్ తదుపరి చర్యలు, వారి పాలసీని బట్టి ఆధారపడి ఉంటుంది. అప్ఘనిస్తాన్ పట్ల మీరు ఎలాంటి పాలసీలు తీసుకుంటారన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. భారత్​ నుంచిపాజిటివ్ రెస్పాన్స్ వస్తే మేం కూడా పాజిటివ్ గానే స్పందిస్తాం. అప్ఘాన్ ప్రజల కోసం డ్యామ్ లు వంటివన్నీ నిర్మించింది భారత్. ఇలాంటివి స్వాగతిస్తాం.

10. అప్ఘనిస్తాన్లో అభివృద్ధి పనులు చేయాలనుకునే అంతర్జాతీయ సమాజానికి మీరు సందేశం ఏంటి?

జ: మేం దశాబ్దాల యుద్ధం నాటి కాలాన్ని పూర్తి చేసుకొని ముందుకు నడుస్తున్నాం. కొత్త ఛాప్టర్ ని ప్రారంభించబోతున్నాం. అప్ఘనిస్తాన్ ప్రజలు ప్రతి ఒక్కరి నుంచి సహాయం, స్నేహాన్ని కోరుకుంటున్నారు. ఆర్థికంగా కూడా వీరికి సహాయం చేయడం వల్ల వారి జీవితాలు బాగుపడతాయి. ఇతర దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించాలని మేం భావిస్తున్నాం. 70 శాతం ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. 20 సంవత్సరాల యుద్ధం వారి జీవితాలను చాలా చిన్నాభిన్నం చేసింది. అందుకే అంతర్జాతీయ సమాజం వారి అభివృద్ధిలో సహాయం చేయాలని కోరుతున్నాం.

11. తాలిబన్ ముఖ్య నేత ముల్లా ఔకంద్జాద్ ఎక్కడ ఉన్నారు?

జ: ఆయన త్వరలోనే బయటకు వస్తారు. అందరికీ కనిపిస్తారు. 20 సంవత్సరాల నుంచి మేం చాలా కష్టపడ్డాం. ప్రజల కంటి నుంచి దూరంగా జీవించాం. కానీ ఆయన త్వరలోనే బయటకు వస్తారు. మీడియాలో ఎన్నో అసత్య వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ తప్పుడు వార్తలు. అప్ఘనిస్తాన్ ప్రజలు, మాకు మధ్యలో అవి దూరాన్ని పెంచుతున్నాయి. అవి సత్యానికి దూరంగా ఉన్నాయి. నిజాలు తెలుసుకొని దాన్ని రాయడం మంచిది అని నేను మీడియాను కోరుతున్నా.

12. భారత్, అప్ఘన్ సంబంధాలు మెరుగుపడితే భవిష్యత్తులో అక్కడ సినిమా షూటింగులు చేసుకునే వీలుంటుందా?

జ: ఇది భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ప్రస్తుతం మాకు మా దేశం శాంతి, సుస్థిరత మాత్రమే అవసరం. ఇప్పుడు వాటి గురించే మేం ఆలోచిస్తున్నాం. మిగిలిన అంశాల గురించి మేం ఇప్పుడే ఆలోచించదల్చుకోలేదు. వాటిని భవిష్యత్తుకేవదిలేస్తున్నాం.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Afghanistan, Taliban

ఉత్తమ కథలు