గ్రీన్ హౌజ్ వాయువుల ఉత్పన్నం వల్ల సముద్రాలు అధిక వేడిని గ్రహిస్తాయి. తద్వారా సముద్ర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతలు సముద్రంలోని జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలా సముద్రం వేడెక్కడాన్ని ఓషన్ వార్మింగ్( Ocean Warming) అంటారు. అయితే తాజాగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నివేదిక.. 21వ శతాబ్దంలో ఓషన్ వార్మింగ్ పెరుగుతూనే ఉంటుందని వెల్లడించింది. మనం కార్బన్ ఉద్గారాలను తగ్గించినప్పటికీ 2300 ఏళ్ల వరకూ సముద్రాలు వేడెక్కే అవకాశం ఉందని హెచ్చరించింది.
1971 నుంచి రికార్డు చేసిన సముద్రపు వేడిని పరిగణలోకి తీసుకుంటే తక్కువ ఉష్ణోగ్రతల పరిస్థితులలో కూడా 2100 నాటికి సముద్రపు వేడి రెట్టింపు అవుతుందని నివేదిక వెల్లడించింది. అధిక వేడిమి పరిస్థితులలో సముద్రపు ఉష్ణోగ్రత 4-8 రెట్లు పెరుగుతుందని నివేదిక పేర్కొంది. మానవుల ప్రభావితం వల్లే సముద్రాలు వేడెక్కుతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఓషన్ వార్మింగ్(Ocean Warming) వల్ల సముద్రంలో అనాక్సిక్ (కరిగిపోయిన ఆక్సిజన్ లేని నీరు), హైపోక్సిక్ (తక్కువ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్) జోన్‌లు అధికంగా ఏర్పడతాయి. ఈ జోన్‌లు వేల సంవత్సరాల కొద్దీ అలాగే ఉంటాయని నివేదిక తెలిపింది.
White Rice: అన్నం తింటూ బరువు పెరగకుండా ఉండొచ్చా ? ఇది సాధ్యమేనా ?
* సముద్రం వేడెక్కినప్పుడు చేపలు ఎక్కడికి వెళ్తాయి?
సముద్ర జలాలు వేడెక్కడంతో మహాసముద్రాల్లో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. వాటి వలన మనం తినగలిగే అనేక చేపలు తుడిచిపెట్టుపోతాయని గత అధ్యయనాల్లో తేలింది. సముద్రాలు వేడెక్కడంతో పాటు ఆమ్లీకరణ కారణంగా 2100 నాటికి కమర్షియల్ ఆర్కిటిక్ కాడ్ ఫిషరీ గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యయనం గుర్తించింది. అయితే ఇటువంటి పరిస్థితులలో అనేక జాతులు సముద్రం లోపలికి వెళ్లి వాటికి అనువైన ఉష్ణోగ్రతలో నివసించడం ప్రారంభించాయని అధ్యయనంలో తేలింది. 2010 వరకు 40 సంవత్సరాలలో ఉష్ణమండల సముద్ర మండలాల్లోని మొత్తం ఓపెన్-వాటర్ జాతుల సంఖ్య సగానికి తగ్గిందని ఏప్రిల్ నెలలో మరొక అధ్యయనం వెల్లడించింది.
Strange hopes: తమ మీద పిట్ట రెట్ట వేస్తే బాగుంటుందనుకుంటున్న రష్యన్లు.. ఎందుకో తెలుసా..
సోమవారం ప్రచురించిన అధ్యయనంలో సార్డినెస్, పిల్‌చార్డ్స్, హెర్రింగ్ వంటి చేపలు కూచించుకుపోతాయని.. అవి అనుకూలమైన సముద్ర ఉష్ణోగ్రతల వద్ద కూడా వెళ్లలేవని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ జీవ పరిణామ జీవశాస్త్రవేత్త, అధ్యయనం సహ రచయిత ప్రొఫెసర్ క్రిస్ వెండిట్టి ఈ అధ్యయనం గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత వేగంగా పెరగడంతో.. చేపలు చాలా త్వరగా సైజు తగ్గుతున్నాయని.. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు పోరాడుతాయని క్రిస్ వెండిట్టి తెలిపారు. రాబోయే దశాబ్దాలలో మనం తినే అనేక జాతులు అంతరించిపోయే అవకాశం ఉందని.. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Rat eaters: ఆ జాతి ప్రజలకు ఎలుకలే ఆహారం.. అలాంటి ప్రజలు లక్షల్లో ఉన్నారు
క్లూపీఫార్మ్‌లపై అధ్యయనం చేసినప్పటికీ.. ఆంకోవీస్, అట్లాంటిక్ హెర్రింగ్, జపనీస్ పిల్‌చార్డ్, పసిఫిక్ హెర్రింగ్ దక్షిణ అమెరికా పిల్‌చార్డ్‌తో కూడిన రే-ఫిన్డ్ చేప జాతులపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధకులు తెలిపారు. మార్చి నెలలో చేసిన అధ్యయనాలు షార్క్ చేపలు చాలా చిన్న పరిమాణంలో జన్మిస్తాయని తెలిపాయి.
* చేపల మనుగడ కష్టసాధ్యం
జనవరి నెలలో పరిశోధకులు 286 రకాల చేపల జీవక్రియ రేట్లను స్టడీ చేసి పెద్ద చేపలు మనుగడ కూడా కష్టమేనని గుర్తించారు. అధిక ఉష్ణోగ్రతల పరిస్థితులలో చేపలు శ్వాస పీల్చుకోవడానికి కష్టపడతాయని.. అవి చనిపోయే ప్రమాదం కూడా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Ghost areas: ఇండియాలోని ఈ ప్రాంతాల్లో దెయ్యాలు ఉంటాయట.. ఆ ప్రదేశాలు ఏంటంటే..
* ఏ చేపలు వాతావరణ మార్పులను తట్టుకుంటాయి?
మాలిక్యులర్ ఎకాలజీ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. త్రీస్పైన్ స్టిక్‌బ్యాక్ చేపలు అధిక ఉష్ణోగ్రతలో కూడా జీవించగలవని తేలింది. స్టిక్‌బ్యాక్ చేపల జన్యువులను అధ్యయనం చేసి అవి ఉష్ణోగ్రతల మార్పులను తట్టుకోగలవు అని పరిశోధకులు వెల్లడించారు. వాటి సంతానోత్పత్తి లో కూడా ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bay of Bengal, Fish, Ocean