WHAT IS TWITTER BOTS WHATS THE PROBLEM WITH ELON MUSK IN THE PROCESS OF BUYING TWITTER DETAILS HERE GH VB
Explained: ట్విట్టర్ బాట్స్ అంటే ఏంటి..? ట్విట్టర్ కొనుగోలులో ఎలాన్ మస్క్‌కి వీటితో సమస్య ఏంటి..?
elon musk
ట్విటర్(Twitter) 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఆఫర్‌పై అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయి. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం ముందుకు సాగాలంటే ట్విట్టర్ అకౌంట్లలో 5 శాతం కంటే తక్కువ మాత్రమే నకిలీవి ఉన్నట్లు నిరూపించాలని టెస్లా CEO ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
ట్విటర్(Twitter) 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఆఫర్‌పై(Offer) అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయి. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం ముందుకు సాగాలంటే ట్విట్టర్ అకౌంట్లలో 5 శాతం కంటే తక్కువ మాత్రమే నకిలీవి ఉన్నట్లు నిరూపించాలని టెస్లా CEO ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఓ ట్విట్టర్ వినియోగదారుడి ట్వీట్‌కు సమాధానంగా ఎలాన్ మస్క్ ఈ ట్వీట్(Tweet) చేశారు. ఈ విషయంపై ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్‌తో కూటా ట్వీట్స్ యుద్ధం చేశారు. బాట్స్(Bots)ను కనుక్కొనేందుకు ట్విట్టర్ కంపెనీ చేస్తున్న కృషిని వివరిస్తూ అగర్వాల్ వరుస ట్వీట్లు చేశారు. ఐదు శాతం మాత్రమే బాట్స్ లేదా స్పామ్ అకౌంట్లు(Spam Accounts) ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన ట్వీట్లో..‘20 శాతం నకిలీ/స్పామ్ అకౌంట్లు(Spam Accounts) ఉండవచ్చు. ఇది ట్విట్టర్ కంపెనీ క్లెయిమ్(Company Claim) చేసే దానికంటే 4 రెట్లు ఎక్కువ. ట్విట్టర్ SEC ఫైలింగ్‌లు కచ్చితమైనవిగా ఉండటంపై నా డీల్ ఆధారపడింది. నిన్న ట్విట్టర్ సీఈవో బహిరంగంగా 5 శాతం రుజువును చూపించడానికి నిరాకరించారు. అతను నిరూపించే వరకు ఈ ఒప్పందం ముందుకు సాగదు.’ అని పేర్కొన్నారు.
ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ప్రకారం.. ట్విట్టర్ బాట్ అకౌంట్లు దాని DAU(రోజువారీ యాక్టివ్ యూజర్లు)లో కంపెనీ చెబుతున్న ఐదు శాతం కంటే ఎక్కువ ఉండవచ్చు. అయినప్పటికీ బాట్స్‌గా పేర్కొంటున్న అకౌంట్లలో ఎక్కువ మనుషులే నిర్వహిస్తున్నారు. బాట్లపై జరిగిన మొత్తం చర్చతో పలు ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇలాంటి అకౌంట్లను మొదట ట్విట్టర్ ఎందుకు అనుమతించింది. ఆ తర్వాత సమస్యను పరిష్కరించడంలో ఎందుకు విఫలమవుతోంది? ఈ ప్రశ్నలకు అర్థం తెలియాలంటే మొదట బాట్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి.
* ట్విట్టర్ బాట్స్ అంటే ఏంటి? మనుషులే నిర్వహిస్తారా?
బాట్స్ ట్విట్టర్ పబ్లిక్ API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్) ఉపయోగించి థర్డ్ పార్టీ క్రియేట్ చేసిన ఆటోమేటెడ్ అకౌంట్లు. ట్వీట్లు చేయడం, ఇతర వినియోగదారులను ఫాలో అవ్వడం, ఇతరుల పోస్ట్‌లను లైక్ చేయడం, రీట్వీట్ చేయడం వంటి పనులను నిజమైన మనుషుల మాదిరిగానే బాట్స్ కూడా చేయగలవు. వ్యక్తులు, సంస్థలు మానవులపై ఆధారపడకుండా రియాక్షన్స్(లైక్స్ కూడా)ను ఆటోమేట్ చేయడానికి థర్డ్ పార్టీలతో కలిసి పని చేస్తాయి.
కొన్ని బాట్లను మోసపూరిత, హానికరమైన పనుల కోసం ప్రోగ్రామ్ చేయవచ్చు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. బిజినెస్ లక్ష్యాల కోసం ప్రోగ్రామ్ చేసిన స్పామ్ బాట్స్ ఏదైనా ప్రొడక్ట్‌కు సంబంధించిన మార్కెటింగ్ కోసం సంబంధిత వెబ్‌సైట్‌కి ట్రాఫిక్‌ను పెంచే ప్రయత్నంలో నిరంతరాయంగా ట్వీట్ చేయవచ్చు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, రాజకీయ ప్రచారం చేయడానికి కూడా ఇలాంటి స్వామ్ బాట్లను ఉపయోగించవచ్చు. ఇవి నకిలీ బహుమతులు, ఇతర ఎకనామికల్ స్కామ్ లింక్‌లను కూడా వ్యాప్తి చేయగలవు.
* బాట్స్, నకిలీ అకౌంట్లను ట్విట్టర్ అనుమతిస్తుందా?
టెక్నాలజీ పరంగా ట్విట్టర్ బాట్ల వినియోగాన్ని అనుమతిస్తుంది. అయితే కంపెనీ విధానం ప్రకారం, అటువంటి అకౌంట్లు ఆటోమేటెడ్ అని సూచించాలి. ట్విట్టర్ మంచి బాట్లను సూచించేందుకు @tinycarebot వంటి లేబుల్‌ను కూడా ప్రారంభించింది. అయితే మైక్రోబ్లాగింగ్ సైట్ స్పామ్ బాట్లను అనుమతించదు. వాటిని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన విధానాలను కూడా ట్విట్టర్ రూపొందించింది. కంపెనీ స్వామ్ అకౌంట్లను శాశ్వతంగా తొలగిస్తుంది. పాలసీ ఉల్లంఘనలకు పాల్పడుతున్న అకౌంట్ల వివరాలను రిపోర్ట్ చేయాలని యూజర్లను కూడా ప్రోత్సహిస్తోంది. అలాంటి వినియోగదారు అకౌంట్‌కు సంబంధించిన అదనపు సమాచారాన్ని అందించిన తర్వాత లేదా reCAPTCHA సవాలును పరిష్కరించిన తర్వాత మాత్రమే అకౌంట్ ఓపన్ అవుతుంది.
* ట్విట్టర్లో ఎన్ని బాట్స్ ఉన్నాయి?
ట్విట్టర్ అధికారిక అంచనా ప్రకారం, దాని రోజువారీ క్రియాశీల వినియోగదారులలో ఐదు శాతం (సుమారు 229 మిలియన్లు) బాట్స్ ఉన్నాయి. అయితే వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కొందరు నిపుణులు 9 శాతం నుండి 15 శాతం ప్రొఫైల్‌లను బాట్స్‌గా అంచనా వేశారు. మరోవైపు ఎలాన్ మస్క్ ఈ అంచనాలను విశ్వసించలేదు. ట్విట్టర్ హ్యాండిల్స్‌లో 20 శాతం బాట్ అకౌంట్లు ఉన్నాయని చెప్పారు.
బాట్లతో మస్క్ సమస్య ఏమిటి?
మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు, క్రిప్టోకరెన్సీలతో కూడిన స్కామ్‌లను ప్రోత్సహించే స్పామ్ బాట్లను అరికట్టడం తన ప్రాధాన్యతలలో ఒకటి అని చెప్పారు. క్రిప్టోకరెన్సీ స్కామ్‌లను ప్రోత్సహించడానికి ట్విట్టర్ అత్యంత యాక్టివ్ సెలబ్రిటీ వినియోగదారులలో ఒకరిగా ఉన్న మస్క్ పేరిట అకౌంట్లను క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలంలో సమస్యగా మారుతుంది. ఉన్న మస్క్‌కి బోట్ సమస్య దీర్ఘకాల స్థిరీకరణను ప్రతిబింబిస్తుంది. వినియోగదారులు, అలాగే ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటనలను విక్రయించే ప్రకటనదారులు ఎంత మంది నిజమైన వ్యక్తులు తమ ప్రకటనలు చూస్తారని కోరవచ్చు.. ఇలాంటివి మస్క్ సమస్యగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ స్వాధీనం తర్వాత, కంపెనీ మేనేజ్మెంట్ను మస్క్ ప్రక్షాళన చేస్తారనే వార్తలు వచ్చాయి. వీటిపై సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుపై స్పష్టత లేదని కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్ కూడా గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మయామీ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో, మస్క్ ట్విట్టర్ 229 మిలియన్ అకౌంట్లలో కనీసం 20 శాతం స్పామ్ బాట్స్ ఉంటాయని అంచనా వేశారు, ఈ శాతం తన అంచనాలో తక్కువ స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. అదే ఆల్ ఇన్ సమ్మిట్‌లో మస్క్ గత నెలలో తాను అంగీకరించిన 44 బిలియన్ డాలర్ల కంటే తక్కువ చెల్లించాలనుకుంటున్నట్లు ట్విట్టర్‌కు బలమైన సూచన చేశారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.