Home /News /explained /

WHAT IS THE STATUS OF PAYTM IN THE MARKET WHAT CAUSED THE SHARES TO FALL THE EXPERTS ARE SAYING THAT GH VB

Explained: మార్కెట్ లో పేటీఎం పరిస్థితి ఏంటి..? భారీగా పతనం కావడానికి కారణమేంటి..? నిపుణులు ఏమంటున్నారంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

గత సంవత్సరం ఆర్థిక చెల్లింపుల సంస్థ పేటీఎం బహిరంగ మార్కెట్(IPO)కు వచ్చిందనే సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కంపెనీ స్టాక్స్ ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ సోమవారం నాటికి ఈ సంస్థ షేర్ వాల్యూ 6 శాతం పడిపోయి ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరుకుంది.

ఇంకా చదవండి ...
గత సంవత్సరం ఆర్థిక చెల్లింపుల సంస్థ పేటీఎం(Paytm) బహిరంగ మార్కెట్(IPO)కు వచ్చిందనే సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కంపెనీ స్టాక్స్(Company Stocks) ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ సోమవారం నాటికి ఈ సంస్థ షేర్ వాల్యూ(Share Value) 6 శాతం పడిపోయి ఆల్ టైమ్(all time) కనిష్ఠానికి చేరుకుంది. పేటీఎం షేర్ విలువ అత్యంత తక్కువగా రూ.1,151కు దిగజారింది. రోజు ముగిసే సమయానికి రూ.1,157కి చేరుకుంది. ఈ సంస్థలో యాంకర్ ఇన్వెస్టర్లుగా (Anchor Investors) పెట్టుబడులు పెట్టిన నాలుగు మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకటైన HDFC గత నెలలో తన రెండు స్కీముల్లో పేటీఎం హోల్డింగ్స్ (Holdings)ను గణనీయంగా తగ్గించిందనే వార్తల నేపథ్యంలో షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఐపీఓ వ్యవహారం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలి పోతుందేమోనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Explained: టీవీలలో సరికొత్త డిస్‌ప్లే టెక్నాలజీ QD OLED.. అసలేంటీ టెక్నాలజీ..? దీని ప్రయోజనాలేంటి..?


షేర్లు ఎందుకు పతనమయ్యాయి..
పేటీఎం షేర్లు(Shares) సోమవారం నాడు 6 శాతం పడిపోయాయి. 2021 డిసెంబరు 31 నుంచి ఇప్పటివరకు 13 శాతం నష్టపోయాయి. గత సంవత్సరం నవంబరు 12 నాటికి కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ 0.81 శాతాన్ని కలిగి ఉండగా.. HDFC మ్యూచువల్ ఫండ్ తన హోల్డింగ్స్ ను తగ్గించడంతో మదుపర్లు వెనక్కి తగ్గారు. నెలవారీ పోర్ట్‌ఫోలియో(Fort Polio) ప్రకారం ప్రారంభంలో HDFC మిడ్ క్యాప్(Mid Cap) రూ.65 కోట్లు పెట్టుబడి పెట్టింది. డిసెంబరు 31 నాటికి ఆ హోల్డింగ్స్ శూన్యానికి తగ్గించింది. అంతేకాకుండా బ్యాలెన్సెడ్ అడ్వాన్సెడ్ ఫండ్‌ రూపంలో పెట్టిన రూ.39 కోట్ల పెట్టుబడిని కూడా తగ్గించింది. తన హోల్డింగ్‌లో 90 శాతం కుదించింది.

మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు?
పేటీఎం ఐపీఓ ప్రారంభంలో అధిక ధరను కలిగి ఉందని, ఇష్యూ కోసం బలహీనమైన సబ్‌స్క్రిప్షన్‌కు దారితీసిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయినప్పటి నుంచి పనితీరు తక్కువగా ఉన్న కారణంగా మదుపర్ల సెంటిమెంట్ బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. షేర్ల పతనం ఇలాగే కొనసాగితే మిడ్ టర్మ్ పూర్తయ్యేలోపు మరింత నష్టపోవాల్సి ఉంటుందని, చివరకు స్టాక్(Stock) నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందని ఫండ్ మేనేజర్ తెలిపారు. ఈ విషయంపై HDFC ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు. నిర్దిష్ట పెట్టుబడి నిర్ణయాల గురించి కామెంట్ చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు.

ఐపీఓలో ఎవరు పెట్టుబడి పెట్టారు?
ప్రారంభంలో పెట్టుబడుదారులకు ఒక్కో షేరు ధరను రూ.2,150లకు పేటీఎం కేటాయించింది. అయితే నవంబరు 18న ఇష్యూ చేసే నాటికి ఆ కాస్ట్‌కు మదుపరులు చేరుకోలేకపోయారు. అత్యధికంగా ఇష్యూ ధర రూ.1,961కి తాకింది. అది కూడా లిస్టింగ్ రోజు కావడం గమనార్హం. నవంబరు 17 నాటికి పేటీఎం సంస్థలో మ్యూచువల్ ఫండ్స్ 0.8 శాతం ఉండగా.. FPIలు 10.37 శాతం వాటాను కలిగి ఉన్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లలో భాగంగా పబ్లిక్ ఆఫర్ సమయంలో నాలుగు మ్యూచువల్ ఫండ్స్ ముందుకు వచ్చి రూ.1050 కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఆదిత్య బిర్లా రూ.515 కోట్లు, మిరే అసెట్ రూ.375 కోట్లు, HDFC నాలుగు స్కీముల్లో కలిపి రూ.150 కోట్లు, బీఎన్‌పీ 10 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.

ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ పేటీఎం రేటింగ్‌ను ఎందుకు తగ్గించాయి?
లీడింగ్ పెట్టుబడి బ్యాంక్ మాక్వేర్(Macquarie) పేటీఎం స్టాక్ ధర లక్ష్యాన్ని 25 శాతం తగ్గించి 1200 నుంచి 900కి చేర్చింది. ఈ కంపెనీ స్టాక్‌పై 'అండర్ పర్ఫార్మర్' రేటింగ్‌ ఇచ్చింది. అంటే స్టాక్ మరింత పతనమయ్యే అవకాశముంది. తక్కువ పంపిణీ, క్లౌడ్ రాబడి కారణంగా 2025-26 వరకు పేటీఎం ఆదాయ అంచనాను ఏడాదికి సగటున 10 శాతం తగ్గించింది. వ్యాపార అప్డేట్లు, ఫలితాలను పోస్ట్ చేయాలని, రాబడి అంచనాలు ప్రమాదంలో ఉన్నాయని మాక్వేరీ ఓ నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పేటీఎం నుంచి రాజీనామాలు చేయడం ఆందోళన కలిగిస్తుందని, ప్రస్తుత అట్రిషన్ రేటు ఇలాగే కొనసాగితే వ్యాపారాన్ని ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడుతున్నామని తెలిపింది.

SSD Storage: మీ ల్యాప్‌టాప్‌ స్లో అవుతోందా..? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించే ఈ SSD స్టోరేజ్​ ప్రొడక్ట్స్‌ను ప్రయత్నించండి..


పేటీఎం ఏం చెబుతోంది?
తమ ప్లాట్‌ఫాం నుంచి పంపిణీ అయిన రుణాల సంఖ్య ఏడాదికి 401 శాతం పెరిగి 2022 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి 4.4 మిలియన్లకు చేరిందని పేటీఎం పేర్కొంది. గతంలో కంటే గణనీయమైన వృద్ధి సాధించామని, ఈ రుణాల విలువ దాదాపు రూ.2,180 కోట్లు ఉందని స్పష్టం చేసింది. దాదాపు 360 శాతం పెరిగిందని, పేటీఎం పోస్ట్ పెయిడ్, వ్యక్తిగత రుణాలు, మర్చంట్ లోన్లు లాంటి లెండింగ్ ప్రొడక్టుల్లో గణనీయమైన వృద్ధిని చూశామని తెలిపింది. మూడు నెలల కాలంలో పేటీఎం నుంచి ప్రాసెస్ చేసిన స్థూల సరుకుల విలువ(GMV) రూ.250,000 కోట్లకు చేరిందని, గతేడాదితో(2021 FY Q3) పోలిస్తే 123 శాతం వృద్ధి సాధించామని స్పష్టం చేసింది.
Published by:Veera Babu
First published:

Tags: Paytm

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు