Medical Oxygen: మెడికల్ ఆక్సిజ‌న్‌ను ఎలా ఉత్పత్తి చేస్తారు? కరోనా రోగులను అది ఎలా కాపాడుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

Medical Oxygen: వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌వారిలో క‌నింపిచే సాధార‌ణ ల‌క్ష‌ణాల్లో శ్వాస అంద‌క‌పోవ‌డం, లేదంటే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో రోగుల‌కు ఆక్సిజ‌న్ థెర‌పీ అవసరం అవుతుంది.

  • Share this:
కోవిడ్ రోగులకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్‌ పంపిణీని కేంద్రం వేగవంతం చేసింది. అన్ని రాష్ట్రాల‌కు, ఆసుపత్రుల‌కు ఆక్సిజ‌న్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను వినియోగించాల్సిన మార్గ‌ద‌ర్శ‌కాలను కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. కరోనా ఊపిరితిత్తుల పనితీరుపై ప్ర‌భావం చూపుతుంది. దీంతో కొవిడ్‌-19 తీవ్రంగా ఉన్న‌ప్పుడు రోగుల‌కు అందించే చికిత్స‌లో ఆక్సిజ‌న్ కీల‌కంగా మారింది. వ్యాధి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌వారిలో క‌నింపిచే సాధార‌ణ ల‌క్ష‌ణాల్లో శ్వాస అంద‌క‌పోవ‌డం, లేదంటే శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో రోగుల‌కు ఆక్సిజ‌న్ థెర‌పీ అవ‌స‌రం అవుతుంది. దీన్ని మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ద్వారా అందించాల్సి ఉంటుందని కేంద్రం తెలియ‌జేసింది. ద్ర‌వంగా మార్చ‌డం వ‌ల్ల ఎక్కువ మోతాదులో ఆక్సిజ‌న్‌ను నిల్వ చేసుకోవ‌చ్చని, దీన్ని ర‌వాణా చేయ‌డానికీ సులువుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఎన్ని పద్ధతుల్లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చో తెలుసుకుందాం.

లిక్విడ్ మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను ఎలా ఉత్ప‌త్తి చేస్తారు?
ఇందులో చాలా ప‌ద్ధ‌తులు ఉన్నాయి. అత్యంత సాధార‌ణ‌మైన ప‌ద్ధ‌తి ఆక్సిజ‌న్‌ను వేరు చేయ‌డం. వీటినే ఎయిర్ స‌ప‌రేష‌న్ యూనిట్స్ (ASU's) అంటారు. ఇవి ప్రాథ‌మికంగా ఎక్కువ ప‌రిమాణంలో వాయువుల‌ను వేరు చేయ‌గ‌లిగిన ప్లాంట్‌లు. వాతావ‌ర‌ణంలోని గాలి నుంచి స్వ‌చ్ఛ‌మైన ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి ఫ్రాక్ష‌న‌ల్ డిస్టిలేష‌న్ మెథ‌డ్ అనే ప‌ద్ధ‌తిని ఉప‌యోగిస్తాయి. వాత‌వ‌ర‌ణంలోని గాలిలో 78 శాతం నైట్రోజెన్‌, 21 శాతం ఆక్సిజ‌న్, మిగిలిన ఒక శాతం ఆర్గాన్‌, కార్బ‌న్‌డైఆక్సైడ్, నియోన్‌, హీలియం, హైడ్రోజ‌న్ వంటి ఇత‌ర‌త్రా వాయువులు క‌లిసి ఉంటాయి. ఈ ప‌ద్ధ‌తిలో వాయువులను చ‌ల్ల‌బ‌ర‌చి ద్ర‌వ‌రూపంలోకి మార్చిన త‌ర్వాత.. అవి వివిధ భాగాలుగా విడిపోతాయి. దాని నుంచి ద్ర‌వ‌రూప ఆక్సిజ‌న్‌ను సేక‌రిస్తారు.

ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు
ఈ విధానంలో వాతావ‌ర‌ణంలోని గాలిని మైనస్ 181 డిగ్రీల సెల్సియ‌స్ ద‌గ్గ‌ర చ‌ల్ల‌బ‌రుస్తారు. ఇక్క‌డ ఆక్సిజ‌న్ ద్ర‌వంగా మారుతుంది. ఇక్క‌డ నైట్రోజ‌న్ మ‌రిగే స్థాయి -196 డిగ్రీల సెల్సియ‌స్‌. ఇది వాయురూపంలోనే ఉంటుంది. అయితే ఆర్గాన్ మ‌రిగే స్థితి ఆక్సిజ‌న్ లాగానే (-181 డిగ్రీల సెల్సియ‌స్‌) ఉంటుంది. అందుకే ఆర్గాన్ గ‌ణ‌నీయ‌మైన మొత్తంలో ఆక్సిజ‌న్‌తో పాటు ద్ర‌వ‌రూపంలోకి మారుతుంది. ఆక్సిజ‌న్‌, ఆర్గాన్ మిశ్ర‌మ ప‌దార్థం మ‌రింత శుధ్దీక‌ర‌ణ కోసం ఇంకిపోయి, కుళ్లిపోయి, రెండ‌వ అల్ప‌-పీడ‌న వెజిల్ ద్వారా పంపించ‌బడుతుంది. త‌ర్వాత మ‌నం చివ‌రిగా శుద్ధీక‌రించిన ద్ర‌వ‌రూప ఆక్సిజ‌న్‌ను పొందుతాము. దీన్ని క్ర‌యోజెనిగ్ కంటైన‌ర్ల‌లో ర‌వాణా చేస్తారు.

క్ర‌యోజెనిక్ కంటైన‌ర్లంటే ఏంటి?
అతి త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌ల్లో ఉత్ప‌త్తి, ప‌దార్థాల ల‌క్ష‌ణాల‌ను క్ర‌యోజెనిక్స్ అంటారు. ఒక క్ర‌యోజెనిక్ లిక్విడ్ అంటే మైనస్ 90 డిగ్రీల సెల్సియ‌స్ సాధార‌ణ బాయిలింగ్ పాయింట్ కంటే త‌క్కువతో ఉన్న ద్ర‌వం. ఈ క్ర‌యోజెనిక్ లిక్విడ్ కంటైన‌ర్ల‌ను ద్ర‌వ‌రూప వాయువుల నిల్వ‌కు ప్ర‌త్యేకంగా డిజైన్ చేస్తారు. ఈ కంటైన‌ర్లు విద్యుత్తు కూడా ప్ర‌వ‌హించ‌కుండా ఉండేతగా ఇన్సులేట్ చేసి ఉంటాయి. వీటిలో అత్యంత త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద ద్ర‌వ‌రూప వాయువుల‌ను నిల్వ చేస్తారు.

ప్రెజ‌ర్ స్వింగ్ అబ్జార్‌ప్షన్ టెక్నిక్ అంటే ఏంటి?
క్ర‌యోజెనిక్‌గా కాకుండా సెలెక్టివ్ అబ్జార్‌ప్షన్‌ని ఉప‌యోగించి వాయు రూపంలో కూడా ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేయొచ్చు. ఈ ప‌ద్ధ‌తి అధిక పీడ‌న ప్రాప‌ర్టీల ద‌గ్గ‌ర ప్ర‌భావం చూపుతుంది, వాయువులు ఘ‌న ఉప‌రిత‌లాల‌కు ఆక‌ర్షిత‌మ‌వుతాయి. పీడ‌నం ఎంత అధికంగా ఉంటే వాయువు అంత శోష‌ణానికి గుర‌వుతుంది. ఒక‌వేళ గాలి వంటి వాయు మిశ్ర‌మం `జియోలైట్‌` అబ్జోర్బెంట్ బెడ్ క‌లిగి ఉన్న వెజిల్స్ నుంచి పీడ‌నం ద్వారా ప్ర‌వేశించిన‌ప్పుడు అది ఆక్సిజ‌న్ కంటే చాలా సామ‌ర్థ్యంతో నైట్రోజన్‌ని ఆక‌ర్షిస్తుంది.

ఇందులో మొత్తం నైట్రోజ‌న్ కానీ లేదంటే అందులో ఒక భాగం కానీ బెడ్ పైన ఉంటుంది. ఇక మిశ్ర‌మం వెజిల్‌లోకి ప్ర‌వేశించ‌డంతో పోల్చుకుంటే వెజిల్ నుంచి బ‌య‌ట‌కొచ్చే వాయువు ఆక్సిజ‌న్‌లో అధికంగా ఉంటుంది. ఈ ప‌ద్ధ‌తి ద్వారా ఆసుప‌త్రులు అదే ప్ర‌దేశంలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసుకోవచ్చు. ప‌రిస‌ర గాలిని కేంద్రీకృతం చేయ‌డం ద్వారా ఇలా ఆక్సిజ‌న్ ఉత్స‌త్తి చేయొచ్చు. వీటితోపాటు పోర్ట‌బుల్ ఆక్సిజ‌న్ జ‌న‌రేట‌ర్లూ ఉన్నాయి. ఇవి ఇంటి ద‌గ్గ‌రే ఉప‌యోగించుకోద‌గిన ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు.

తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు
ఉష్ణోగ్ర‌త‌ మ‌రింత ఎక్కువ‌గా ఉంటే ఆక్సిజ‌న్‌లో చాలా ప‌దార్థాలు మాడిపోతాయి. కాబ‌ట్టి, దానికి త‌గిన విధంగా స‌రైన ఎయిర్ సేఫ్టీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం అత్య‌వ‌స‌రం. అలాగే సిబ్బంది అంద‌రికీ ఆక్సిజ‌న్ నిర్వాహ‌ణ‌లో శిక్ష‌ణ ఇవ్వాలి. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కోసం అద‌నంగా కావాల్సిన అవ‌స‌రాలు, నియ‌మాలు కూడా ఉన్నాయి. వీటిల్లో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ కావాల్సిన వ్య‌క్తి డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ క‌లిగి ఉండటం కూడా ఒక‌టి.
Published by:Shiva Kumar Addula
First published: