హోమ్ /వార్తలు /Explained /

Explained: ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్భన్ పథకం అంటే ఏంటి..? ఈ స్కీమ్‌ లబ్ధిదారులు ఎవరు..?

Explained: ప్రధానమంత్రి ఆవాస్ యోజన- అర్భన్ పథకం అంటే ఏంటి..? ఈ స్కీమ్‌ లబ్ధిదారులు ఎవరు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పీఎంఏవైలో రెండు రకాలు ఉంటాయి. ఇందులో పీఎంఏవై-యూ (PMAY-U) పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇల్లు మంజూరు చేస్తుంది. పీఎంఏవై-జీ (PMAY-G) గ్రామీణ ప్రాంతల్లోని అర్హులైన ప్రజలకు ఇళ్లు నిర్మిస్తుంది.

భారత దేశంలో కోట్లాది మంది ప్రజలు సొంత ఇల్లు (Own House) లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం (Government) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) (Pradhan Mantri Awas Yojana-Urban) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద 2022 నాటికి అర్హులైన లబ్ధిదారులందరికీ పక్కా ఇల్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ 25, 2015న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం అమల్లోకి వచ్చింది. పీఎంఏవైలో రెండు రకాలు ఉంటాయి. ఇందులో పీఎంఏవై-యూ (PMAY-U) పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇల్లు మంజూరు చేస్తుంది. పీఎంఏవై-జీ (PMAY-G) గ్రామీణ ప్రాంతల్లోని అర్హులైన ప్రజలకు ఇళ్లు నిర్మిస్తుంది. ఈ పథకంలో "ఇన్-సిటు" స్లమ్ రీడెవలప్‌మెంట్ (ISSR); క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS); అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్‌నర్‌షిప్ (AHP), బెనిఫీషయరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్‌స్ట్రక్షన్‌/ ఎన్‌హాన్స్‌మెంట్ (BLC) వంటి కేటగిరీలు ఉన్నాయి. ఈ కేటగిరీల కింద లబ్ధిదారులందరికీ ఇళ్లు నిర్మించడమే కేంద్రం ముఖ్య లక్ష్యం.

* ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు నిర్మించారు?

పీఎంఏవై-యూ (PMAY-U)లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మే 9 2022 వరకు ఈ పథకం కింద 1.21 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయి, వాటిలో 58.82 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. బీఎల్‌సీ (BLC) కేటగిరీ కింద గరిష్టంగా 28.17 లక్షల ఇళ్లు నిర్మించారు. మిగిలిన 30.65 లక్షల ఇళ్లు ఐఎస్ఎస్ఆర్ (ISSR), సీఎల్ఎస్ఎస్ (CLSS), ఏహెచ్‌పీ (AHP) కింద నిర్మించారు.

Russia Remote Weapon Station: రిమోట్ వెపన్ స్టేషన్ ఉత్పత్తిని ప్రారంభించిన రష్యా.. BPM-97 అంటే ఏంటి..?


* పీఎంఏవై-యూ కోసం ఎంత డబ్బు ఖర్చు చేశారు?

పీఎంఏవై-యూ కోసం కేంద్రం రూ.2.01 లక్షల కోట్లు కేటాయించింది. అందులో రూ.1.18 లక్షల కోట్లు విడుదల చేసి రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది.

* బెనిఫీషయరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్‌స్ట్రక్షన్‌/ ఎన్‌హాన్స్‌మెంట్ (BLC) అంటే ఏంటి?

బీఎల్‌సీ కింద, ఒక లబ్దిదారుడు తన ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి రూ. 2.5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. PMAY-U మార్గదర్శకాల ప్రకారం... భర్త, భార్య, అవివాహిత కుమారులు లేదా అవివాహిత కుమార్తెలతో కూడిన కుటుంబం మాత్రమే బీఎల్‌సీ కింద లబ్ధి పొందుతుంది. ఒక వేళ కుటుంబంలో భార్యాభర్తల పిల్లలకు పెళ్లయితే వారికి ఈ పథకం కింద ప్రయోజనాలు లభించవు. "లబ్దిదారుని కుటుంబం భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా అతని/ఆమె పేరు మీద లేదా అతని/ఆమె కుటుంబంలోని ఏ సభ్యుని పేరు మీద ఒక పక్కా ఇల్లు కలిగి ఉండకూడదు" అని పీఎంఏవై-యూ మార్గదర్శకాలు పేర్కొన్నాయి.

పీఎంఏవై-యూ పథకం మార్గదర్శకాల ప్రకారం, డబ్బులు సంపాదించుకుంటున్న ఒక అడల్ట్ పర్సన్ ని (వైవాహిక స్థితితో సంబంధం లేకుండా) ప్రత్యేక వ్యక్తిగా పరిగణించవచ్చు. అయితే, ఈ పథకాన్ని పొందేందుకు, అతను లేదా ఆమె భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా అతని/ఆమె పేరు మీద పక్కా ఇల్లు కలిగి ఉండకూడదు. పీఎంఏవై-యూ కింద, లబ్ధిదారులు ఇప్పటికే ఉన్న ఇంటిని మెరుగుపరచడానికి బీఎల్‌సీ ద్వారా లబ్ధి పొందవచ్చు. అయితే, 21 చ.మీ కంటే తక్కువ నిర్మాణ విస్తీర్ణం కలిగిన పక్కా ఇల్లు ఉన్న వ్యక్తులు మాత్రమే లబ్ధి పొందేందుకు అర్హులు.

* జియోట్యాగింగ్ అంటే ఏంటి, పీఎంఏవై-యూ కింద ఇది తప్పనిసరా?

జియోట్యాగింగ్ అనేది ఫొటోగ్రఫీ వంటి వివిధ మాధ్యమాలకు భౌగోళిక గుర్తింపు (Geographical Identification)ను జోడించే ప్రక్రియ. పీఎంఏవై-యూ మార్గదర్శకాల ప్రకారం, పథకం పర్యవేక్షణ కోసం ప్రభుత్వం భువన్ హౌసింగ్ ఫర్ ఆల్ (HFA) అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఈ పథకం కింద నిర్మించిన అన్ని గృహాలు భువన్ హౌసింగ్ ఫర్ ఆల్ (HFA) అప్లికేషన్‌కు జియోట్యాగ్ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం తప్పనిసరి.

Explained: అప్పట్లోనే దేశద్రోహ చట్టాన్ని వ్యతిరేకించిన స్వతంత్ర సమరయోధులు.. దీనిపై తిలక్, గాంధీ, నెహ్రూ ఏమన్నారంటే..


* భువన్ హెచ్‌ఎఫ్ఏ అంటే ఏంటి?

భువన్ అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అభివృద్ధి చేసిన ఒక ఇండియన్ జియో ప్లాట్‌ఫామ్. భువన్ హెచ్‌ఎఫ్ఏ వివిధ మ్యాప్ సంబంధిత సేవలను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతించే వెబ్ ఆధారిత అప్లికేషన్. పీఎంఏవై-యూ కింద నిర్మించిన లేదా నిర్మిస్తున్న ఇళ్ల ఫోటోలను జియోట్యాగింగ్ చేసే సౌకర్యాన్ని కూడా అప్లికేషన్ అందిస్తుంది.

First published:

Tags: Centre government, Explained, Housing Loans, PMAY

ఉత్తమ కథలు