Afghanistan: ఓ దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోవడం అనేది ఏమాత్రం మంచి పరిణామం కాదు. ప్రపంచ దేశాలేవీ ఈ పరిణామాన్ని అడ్డుకోలేదు. ఆ మాటకొస్తే ఆ దేశ అధ్యక్షుడే ఆ ప్రయత్నం చెయ్యలేదు. నెక్ట్స్ ఏంటి?
Afghanistan: అఫ్గానిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ల పాలన రావడం ఖాయమైంది. రాజధాని కాబూల్‌ను కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. తన పదవికి రాజీనామా కూడా చేయనున్నారు. దీంతో అఫ్గాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. ప్రధాని కార్యాలయం కూడా వారి ఆధీనంలోకి వెళ్లింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ దేశంపై ఆధిపత్యం సాధించారు. అష్రఫ్‌ఘనీ దేశాన్ని విడిచివెళ్లడం సహా రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తాత్కాలిక ప్రభుత్వం కోసం అఫ్గానిస్థాన్‌లో చర్చలు జరగనున్నాయి.
* అఫ్గాన్ ముందు ఉన్న మార్గాలేంటి?
ప్రస్తుతం అంతర్గత శాఖ మంత్రి అలీ అహ్మద్ జలాలీ తాత్కాలిక గవర్నమెంట్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే తాలిబన్లకు ఆధికార బదలాయింపు మొదలుకానుంది. అధికారం పంచుకునే ప్రదిపాదన వచ్చినా.. దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అందుకు సిద్ధంగా లేరు. అధికారం మొత్తం వారికే దక్కనుంది. దేశానికి పేరు మారుస్తామని ప్రకటించారు తాలిబన్లు. ఇస్లామిక్‌ఎమిరేట్స్ ఆఫ్అఫ్గానిస్థాన్ను కాబూల్ అధ్యక్ష కార్యాలయం నుంచి ప్రకటిస్తామని తాలిబన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇక దేశంలో సంక్షోభ నివారణ చర్చల ప్రక్రియను అష్రఫ్ ఘనీ రాజకీయ నాయకులకు అప్పగించారు.
This is, perhaps, one of the saddest images I've seen from #Afghanistan. A people who are desperate and abandoned. No aid agencies, no UN, no government. Nothing. pic.twitter.com/LCeDEOR3lR
కొత్త ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించేందుకు అష్రఫ్‌ఘనీ రాజీనామా చేస్తారని వార్తలు వస్తుండగా.. ఆయన ఇప్పటికే రిజైన్ చేశారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌లో ఇక రక్తపాతం జరగకూడదనే తాను దేశం విడిచివెళ్లాని ఘనీ చెప్పారు. అలాగే అఫ్గాన్ ఆర్మీ సైతం ఇక తాలిబన్లతో పోరాటాన్ని ఆపేసింది.
It is now morning in Afghanistan. Gunfire. Rocket fire. Panic. Women and children running for their lives. Mobs rushing to the airport to flee their own country.
కాబూల్‌లో ఉన్న తమ ప్రతినిధులు, అధికారులు, పౌరులను వెనక్కి రప్పించేందుకు వేరే దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో అఫ్గానిస్థాన్‌లో ఉన్న ఏకైక విమానాశ్రయం కాబూల్ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. తమ దేశాలకు వెళ్లేందుకు విదేశీయులు బారులు తీరారు.
ఇక తమ దేశ భవిష్యత్తుపై చర్చించేందుకు కొందరు అఫ్గానిస్థాన్నేతలు పాకిస్థాన్‌కు వెళ్లారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడుతున్నారు. ప్రస్తుత అఫ్గాన్ ప్రభుత్వానికి, తాలిబన్లు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇమ్రాన్ సూచిస్తున్నారు.
అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో చాలా ప్రపంచ దేశాలు దేశాలు.. అఫ్గాన్‌కు విమానాలను నిలిపివేశాయి. మరోవైపు తాలిబన్లను తిప్పికొట్టడంతో తీవ్రంగా విఫలమైన అష్రఫ్ ఘనీపై చాలా మంది అఫ్గానీయులు, ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత తాలిబన్ల కఠిన పాలనను తలచుకొని పౌరులు ఆందోళన చెందుతున్నారు.
అమెరికా తన బలగాలను విరమించుకున్న నాటి నుంచే తాలిబన్లు విజృంభించారు. 20 ఏళ్ల పాటు అఫ్గాన్‌లో ఉన్న యూఎస్ బలగాలను గతేడాది నుంచి అమెరికా తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో మళ్లీ తాలిబన్లు రెచ్చిపోయారు. అఫ్గాన్‌లో తమ మిషన్ పూర్తయినందునే బలగాలను ఉపసంహరించుకున్నామని అమెరికా చెప్పింది. అయితే ఇప్పడు అగ్రదేశం ఏం చేస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. మరోవైపు తాలిబన్లకు అండగా ఉందని విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.