Home /News /explained /

WHAT IS THE CWC AND WHAT ROLE DOES IT PLAY IN THE CONGRESS FULL DETAILS HERE GH VB

Explained: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ- CWC అంటే ఏంటి..? పార్టీలో దాని అధికార పరిధి ఎంత వరకు ఉంటుంది..?

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్)

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (ఫైల్)

కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)లో అన్ని రకాల నిర్ణయాలను తీసుకొనే అధికారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC)కి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీ ఓటములు మూటగట్టుకొన్న కాంగ్రెస్‌ ఎన్నికల వైఫల్యాలపై చర్చించేందుకు మార్చి 13వ తేదీన ఆదివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (Congress Working Committee) సమావేశమైంది

ఇంకా చదవండి ...
కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)లో అన్ని రకాల నిర్ణయాలను తీసుకొనే అధికారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC)కి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారీ ఓటములు మూటగట్టుకొన్న కాంగ్రెస్‌ ఎన్నికల వైఫల్యాలపై చర్చించేందుకు మార్చి 13వ తేదీన ఆదివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (Congress Working Committee) సమావేశమైంది. కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి తామే కారణమని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని, కమిటీ సభ్యుల అభిప్రాయం కూడా అదే అయితే కాంగ్రెస్‌ పార్టీ కోసం ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధంగా ఉన్నామని పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi), ఆమె వారసులు ఎంపీ రాహుల్‌ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ చెప్పినట్లు సమాచారం. అయితే అలాంటి అభిప్రాయాలు లేవని, సోనియా గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఆగస్టు- సెప్టెంబరులో ఎన్నికలు జరగనున్నాయని కనీసం అప్పటి వరకైనా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలని సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Realme Narzo 50A Prime: హై రిజ‌ల్యూష‌న్‌, 50 మెగాపిక్సెల్ కెమెరాతో.. మార్చి 22న రియ‌ల్‌మి మీఫోన్ లాంచ్.. ఓ లుక్కేయండి

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ 2019 ఆగస్టు నెలలో రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకొన్నారు. ఆ సమయంలో సోనియా(75) బాధ్యతలు తీసుకొన్నారు. అప్పటికి కేవలం రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలమే అధ్యక్ష పదవిలో రాహుల్‌ గాంధీ ఉన్నారు. అంతకు ముందు 1998 నుంచి 2017 వరకు సోనియానే కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పని చేశారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అంటే ఏంటి?
కాంగ్రెస్‌ పార్టీలో అన్ని విధాలా నిర్ణయాలు తీసుకొనే అధికారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి మాత్రమే ఉంది. పార్టీ సిద్ధాంతాలకు సంబంధించిన నిర్ణయాలు, ఆదేశాలపై తుది నిర్ణయం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీదే అవుతుంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్‌లో పార్టీ లీడర్‌, ఇతర 23 మంది సభ్యులు ఉంటారు. 23 మందిలో 12 మందిని ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ(AICC, పార్టీస్‌ సెంట్రల్‌ డెసిషన్‌- మేకింగ్‌ అసెంబ్లీ) ఎన్నుకొంటుంది. మిగిలిన సభ్యులను పార్టీ అధ్యక్షులు ఎంపిక చేస్తారు.

వాస్తవానికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసే, తొలగించే అధికారం ఉంటుంది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో మార్పులు చోటుచేసుకొంటాయి. ఏఐసీసీ ప్లీనరీ సమావేశాల్లోనూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ఎన్నుకొంటారు. అయితే పార్టీ అధ్యక్షుల ఆమోదం ఉండాలి.

Smart Phone Tips: మీ ఫోన్‌లో ఈ స‌మ‌స్య ఉందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

చివరిసారి సీడబ్ల్యూసీ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
గత 50 సంవత్సరాల్లో రెండు పర్యాయాలు మాత్రమే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు నిజాయతీగా జరిగాయి. అయితే ఆ రెండు పర్యాయాలు నెహ్రూ- గాంధీ కుటుంబానికి చెందిన వారు కాకుండా ఇతరులు అధ్యక్ష పదవిలో కూర్చున్నారు. 1992లో తిరుపతిలో జరిగిన ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు పీవీ నరసింహారావు.. తాను ఎంపిక చేసిన వ్యక్తులు గెలుస్తారని భావించి సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించారు. అతని వ్యతిరేకులు ముఖ్యంగా అర్జున్ సింగ్, శరద్ పవార్ , రాజేష్ పైలట్ కూడా ఎన్నికయ్యారు. ఎస్పీ, ఎస్టీ, లేదా మహిళలు ఎవరూ ఎన్నిక కాలేదని మొత్తం సీడబ్ల్యూసీకి పీవీ నరసింహారావు రాజీనామా చేయించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని పునఃనిర్మించి, నామినేట్ చేయబడిన వర్గంలో సింగ్ , పవార్‌లను పీవీ చేర్చారు.

1997లో కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి ఆధ్వర్యంలో మళ్లీ వర్కింగ్‌ కమిటీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కౌంటింగ్ మరుసటి రోజు వరకు కొనసాగింది. విజేతలలో అహ్మద్ పటేల్, జితేంద్ర ప్రసాద, మాధవ్ రావ్ సింథియా, తారిఖ్ అన్వర్, ప్రణబ్ ముఖర్జీ, ఆర్.కె.ధావన్, అర్జున్ సింగ్, గులాం నబీ ఆజాద్, శరద్ పవార్‌, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌లో చీలిక తర్వాత, 1969 బాంబే ప్లీనరీలో.. 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులలో చంద్ర శేఖర్‌ను ఉండటంతో చివరి నిమిషంలో ఎన్నికలు రద్దు చేశారు. 1998 ఏప్రిల్ లో సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారిన తర్వాత, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ నామినేట్ అఅవుతున్నారు. ఆమె అదే సంస్కృతిని ప్రోత్సహించారు.

వర్కింగ్‌ కమిటీని ఎంత తరచుగా పునర్వ్యవస్థీకరించారు?
2017 డిసెంబర్ లో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల తర్వాత 2018 మార్చి లో సీడబ్ల్యూసీ చివరి పునర్వ్యవస్థీకరణ జరిగింది. పునర్వ్యవస్థీకరించడానికి ఏఐసీసీ అతనికి అధికారం ఇచ్చింది. 2010 సెప్టెంబరు లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా తిరిగి ఎన్నికైన తర్వాత.. 2011 మార్చిలో పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆమె ఎలాంటి నాటకీయ మార్పులు చేయలేదు. అయితే ప్రధానంగా వర్కింగ్‌ కమిటీ నుంచి అర్జున్ సింగ్ , మొహసినా కిద్వాయ్‌ను తొలగించి వారికి శాశ్వత ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు.

కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ తర్వాత మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది, ఆస్కార్ ఫెర్నాండెజ్, ముకుల్ వాస్నిక్, బీకే హరిప్రసాద్, బీరేంద్ర సింగ్, ధని రామ్ షాండిల్, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, హేమోవా సోనీ, ముఖర్జీ , ఆజాద్‌, సైకియా , సుశీల తిరియాను చేర్చుకొంది. ఐదు ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షులందరూ తమకు నచ్చిన కమిటీ కావాలనే భావించారు. 25 మంది సభ్యులలో 12 మందిని మాత్రమే ఎన్నుకోవాలని పార్టీ సిద్ధాంతాలు చెబుతున్నాయి.

Russia Ukraine war: పుతిన్‌, జెలెన్‌స్కీకి PM Modi ఫోన్ కాల్.. కీలక సూచన -అలా చేస్తే యుద్ధం ఆగేనా!


బీజేపీలో సీడబ్ల్యూసీ లాంటి సంస్థ ఉందా?
బీజేపీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పార్లమెంటరీ బోర్డు. బీజేపీ అధ్యక్షుడు ఎంపిక చేసిన 11 మంది సభ్యులు ఇందులో ఉంటారు. రాష్ట్ర ఎన్నికల తర్వాత పార్టీ ముఖ్యమంత్రిని నిర్ణయించాల్సి వచ్చినప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమవుతుంది. 2013లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించాలని పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తరహాలోనే పార్లమెంటరీ బోర్డులో పార్టీ విధానాలు చాలా అరుదుగా చర్చకు వచ్చాయి.
Published by:Veera Babu
First published:

Tags: Congress, Elections, Rahul Gandhi, Sonia Gandhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు