హోమ్ /వార్తలు /Explained /

Explained: స్టికీ బాంబ్స్.. పాకిస్తాన్ కొత్త పన్నాగం.. అంటే ఏంటి.. వీటితో వచ్చే డేంజర్ ఏంటి?

Explained: స్టికీ బాంబ్స్.. పాకిస్తాన్ కొత్త పన్నాగం.. అంటే ఏంటి.. వీటితో వచ్చే డేంజర్ ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం (Image Credit: Wikimedia)

ప్రతీకాత్మక చిత్రం (Image Credit: Wikimedia)

కాశ్మీర్ లో భారత ఆర్మీ గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లో వరుసగా స్టికీ బాంబ్స్ కోసం వేట కొనసాగిస్తోంది. వందల సంఖ్యలో అవి లభిస్తున్నాయి. భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్థాన్ చర్యలు ఇంకా ఆగట్లేదు.

  కాశ్మీర్ లో భారత ఆర్మీ గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లో వరుసగా స్టికీ బాంబ్స్ కోసం వేట కొనసాగిస్తోంది. వందల సంఖ్యలో అవి లభిస్తున్నాయి. భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్థాన్ చర్యలు ఇంకా ఆగట్లేదు. డ్రోన్ల సాయంతో కాశ్మీర్ లో స్టికీ బాంబులను అక్కడక్కడా వదులుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్టికీ బాంబ్స్ మిగిలిన వాటి కంటే చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే వీటిలో అయస్కాంతాలు ఉపయోగించడం వల్ల వీటిని ట్రైన్లు, బస్సుల లాంటి వాటిలో అమర్చి టెర్రరిస్టులు ఎక్కడో ఉండి కూడా వాటిని పేల్చే అవకాశం ఉంటుంది. 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొద్దిగా తగ్గాయని చెప్పుకోవచ్చు. రెండు దేశాలు తమ హై కమిషన్ నుంచి అధికారులను తిరిగి రప్పించుకున్నాయి. అయితే చైనాతో పాక్ దోస్తీ వల్ల బోర్డర్ లో ఇంకా గస్తీ కొనసాగుతూనే ఉంది. భారత్ చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల చైనా బోర్డర్ లో సైనికులను పెంచుతోంది. అందుకే చైనా భారత్ పాక్ బోర్డర్ లో ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తోందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడినట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 25 న కూడా రెండు దేశాలు చర్చించుకొని ఎల్ ఓసీ కి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాయి. అయితే పాకిస్థాన్ దీనికి కట్టుబడి ఉంటుందా? అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ లో లభిస్తున్న కొత్త రకం బాంబులు కూడా దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. వీటిని స్టికీ బాంబ్ అని పిలుస్తారు. గతంలో అప్ఘనిస్థాన్ లో ఇదే తరహా బాంబులతో ముష్కరులు మారణ హోమం సృష్టించారు. ఈ బాంబులు ఐఈడీ లాగే ఉన్నా వాటికంటే కాస్త చిన్నగా ఉంటాయి. ఐఈడీ అంటే ఇంప్రూవైస్డ్ ఎక్స్ ప్లాయిటేటివ్ డివైజెస్. వీటిని రోడ్డు పక్కన ఏదైనా వస్తువులో అమర్చి పెడతారు. వీటిపై ఎవరైనా కాలు పెడితే చాలు.. వెంటనే ఆ బాంబు పేలుతుంది. స్టికీ బాంబ్ దీని కంటే ఎంతో ప్రమాదకరమైనది. ఎందుకంటే దీన్ని ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసే వీలుంటుంది. ఈ బాంబ్ ని కావాల్సిన ప్రదేశంలో అమర్చి రిమోట్ కంట్రోల్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసే వీలుంటుంది. కాశ్మీర్ లో నిర్వహించిన సోదాల్లో వీటిని చాలా ప్రదేశాల్లో గుర్తించారు.

  వీటిని పాకిస్థానీ టెర్రరిస్టులు అప్ఘనిస్తాన్ తాలిబన్ల సాయంతో ఈ బాంబులు కాశ్మీర్ లో విడిచి ప్రాణ నష్టం కల్పించేందుకు ప్రయత్నిస్తోందేమో అని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత భద్రతను కట్టుదిట్టం చేశారు. దీని ఫలితంగా అక్కడ ప్రస్తుతం ఎలాంటి హింసాత్మక చర్యలు జరగట్లేదు. అయితే ఈ శాంతికి భంగం కల్పించేందుకు తీవ్రవాదులు ఈ బాంబుల ద్వారా ప్రయత్నిస్తున్నారేమో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి భద్రతా దళగాలు.

  అసలు ఈ బాంబులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఆయా ప్రదేశాలకు వాటిని ఎవరు తెచ్చి విడిచి పెడుతున్నారు వంటి విషయాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా లేదా భారత్ నుంచి పాక్ కి తవ్వుతున్న కొన్ని సొరంగాల ద్వారా వీటిని దేశంలోకి తీసుకువస్తున్నట్లు భద్రతా అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సొరంగాలు బయట పడుతున్న కొద్దీ వాటిని మూసేస్తూ ఆ ప్రదేశాల్లో భద్రతను మరింత పెంచుతున్నారు. ఈ స్టికీ బాంబ్ లు ఏ వాహనానికైనా సులువుగా అతుక్కుపోతాయి. అందుకే ఇకపై ప్రైవేట్ వాహనాలకు ఆర్మీ వాహనాలకు మధ్య దూరం కొనసాగించాలని.. అలాగే ఆర్మీ వాహనాల చుట్టూ కెమెరాల ద్వారా ఇలాంటి బాంబులు అతుక్కుంటే తెలుసుకునేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు డ్రోన్ల ద్వారా అనుమానం ఉన్న ప్రదేశాల్లో గస్తీ కొనసాగించనున్నారు.

  First published:

  Tags: India pakistan, India pakistan border, India VS Pakistan, Jammu and Kashmir, Pakistan infiltration, Terrorism

  ఉత్తమ కథలు